← Back to news

జగిత్యాల జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్

By Shiva Kumar· 5d ago· Jagitial, Jagitial, Jagitial
జగిత్యాల జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ‘పోలీస్ యాక్ట్ 1861’ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. రూల్స్‌కు విరుద్ధంగా డీజేలు వినియోగించడంపై నిషేధం ఉంటుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More in Local