Latest

వాంగ్ చుక్ కు దక్కని రిలీఫ్- ఆస్పత్రిలోనే  దీక్ష !
News· 19 Jul 2026

వాంగ్ చుక్ కు దక్కని రిలీఫ్- ఆస్పత్రిలోనే దీక్ష !

లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయనను ఆసుపత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసేందుకు పర్మిషన్ కోరుతూ ఆయన భార్య వేసిన పిటిషన్‌పై ఇంటెరిం రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దాంతో ఆయన ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొనసాగనున్నారు. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైన అన్ని మెడికల్ ఫెసిలిటీస్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామం ఆయన మద్దతుదారుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న మిడిల్ ఈస్ట్
World· 19 Jul 2026

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న మిడిల్ ఈస్ట్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) ప్రాంతం మరోసారి యుద్ధ మేఘాల నీడలోకి వెళ్ళింది. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులు, క్షిపణి దాడులకు దిగడంతో పాత అణు ఒప్పందాలు పూర్తిగా పక్కకు పోయాయి. సరిహద్దుల్లో సైరన్ల మోత, వరుస పేలుళ్లతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడి ప్రజలకు బతుకు నిత్య నరకంగా మారింది. ఈ తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుండగా, మిడిల్ ఈస్ట్ ప్రస్తుతం వార్ ఫీల్డ్ లా మారిపోయింది.

రైతులకు అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి
Politics· 19 Jul 2026

రైతులకు అండగా ఉంటాం: సబితా ఇంద్రారెడ్డి

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, BRS నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కలిశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో తమ సాగుభూములను బలవంతంగా తీసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా రైతులు తమ భూములను రక్షించాలని వేడుకున్నారు. రైతుల సమస్యలను విన్న ఆమె, భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు BRS పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఫైరయ్యారు.

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్
TG· 19 Jul 2026

ప్లాట్లు ఇప్పిస్తానని, రాత్రికి రాత్రే పరార్

TG: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ప్లాట్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించిన తర్వాత ప్లాట్లు ఇవ్వకపోవడంతో అతని ఇంటి ముందు వారు ఆందోళనకు దిగారు. అయితే అక్కడికి చేరుకునే సరికి వెంకటేష్ ఇల్లు అమ్ముకుని కుటుంబంతో కలిసి పరారైనట్లు తెలిసి వారు షాక్‌కు గురయ్యారు. తమ కష్టార్జిత సొమ్మంతా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్‌‌ను అరెస్ట్ చేసి, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులు, ప్రభుత్వాన్ని కోరారు.

నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతిఒక్కరూ స్పందించాలి: తులసిచందు
Education· 19 Jul 2026

నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతిఒక్కరూ స్పందించాలి: తులసిచందు

TG: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రేపు ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఛలో పార్లమెంట్’‌కు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఛలో పార్లమెంట్‌కు ప్రముఖ జర్నలిస్ట్ తులసిచందు తన మద్ధతు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జరిగే ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్‌గా ఉండాలని కోరారు. ప్రధాని మోడీ పాలనలో జరిగిన నీట్, ప్రశ్నాపత్రాల లీక్‌లపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలన్నారు.

వర్షాల కోసం గాడిదలకు పెళ్లి
AP· 19 Jul 2026

వర్షాల కోసం గాడిదలకు పెళ్లి

AP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో గ్రామస్థులు వినూత్న ఆచారాన్ని నిర్వహించారు. వర్షాలు కురవాలని రెండు గాడిదలను వధూవరులుగా అలంకరించి, డప్పుచప్పుళ్లతో ఊరేగింపు చేశారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. మంగళసూత్రం కట్టి, తలంబ్రాలు పోసి, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఇలానే గాడిదలకు పెళ్లి చేయడంతో మంచి వర్షాలు కురిశాయని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

3 మేయర్లు కాదు.. ముందు ఒక కార్పొరేషన్ గెలిపించండి
Politics· 19 Jul 2026

3 మేయర్లు కాదు.. ముందు ఒక కార్పొరేషన్ గెలిపించండి

TG: BJP నుంచి బయటకు వెళ్లిన గోషామహల్ MLA రాజాసింగ్ మరోసారి పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన ఆయన, MP ఈటల రాజేందర్, కేంద్రమంత్రి బండి సంజయ్ కలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందా అంటూ పార్టీ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు. త్వరలో జరగనున్న GHMC ఎన్నికలపై మాట్లాడుతూ, 3 కార్పొరేషన్ల మేయర్లను గెలవడం కాదు, ముందుగా ఒక కార్పొరేషన్‌లో సగం కార్పొరేటర్లను గెలిపించి చూపించాలని సవాల్ విసిరారు.

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు
TG· 19 Jul 2026

కారం చల్లి రాళ్లు రువ్విన రైతులపై కేసు నమోదు

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం చేపట్టిన 600 ఎకరాల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. పెద్దఎత్తున చేరుకున్న రైతులు, గ్రామస్తులు అధికారులను, పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చెలరేగి, కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనలో DCP యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు CIలకు గాయాలయ్యాయి. పోలీసులు హైఅలర్ట్ ప్రకటించి, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. వీడియో ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య
India· 19 Jul 2026

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ భార్య

ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆయన భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను అక్రమంగా నిర్బంధించారని, వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్‌లో కోరారు. వ్యక్తిగత వైద్యులు, న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజుల నిరాహార దీక్ష అనంతరం పోలీసులు ఆయనను శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారని, చికిత్స విషయంలో పారదర్శకత లేదని ఆమె ఆరోపించారు.

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్
Crime· 19 Jul 2026

బెట్టింగ్ కోసం చోరీ.. నిందితుడు అరెస్ట్

TG: హైదరాబాద్‌లోని సరస్వతినగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును సరూర్‌నగర్ పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు బూర్ల అనిల్‌ను అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, హుండీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు రావడంతో అప్పుల పాలైన నిందితుడు డబ్బు కోసం ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దేవాలయంలోకి ప్రవేశించి చోరీ చేసిన అతడిని CCTV దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రెండు గ్రామాల మధ్య వివాదం.. ఉద్రిక్తత
AP· 19 Jul 2026

రెండు గ్రామాల మధ్య వివాదం.. ఉద్రిక్తత

AP: పల్నాడు జిల్లాలో బయ్యవరం, మునగోడు గ్రామస్థుల మధ్య కృష్ణానది జలాల ఊరేగింపు ఉద్రిక్తతకు దారితీసింది. సాంప్రదాయం ప్రకారం గ్రామదేవత పూజ కోసం కొందరు కృష్ణానదికి వెళ్లారు. వాళ్లను గ్రామ సెంటిమెంట్‌ దెబ్బతింటుందని మునగోడు గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. పల్నాడు పోలీసులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో చర్చించారు. పోలీసులు వేగంగా స్పందించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం
Crime· 19 Jul 2026

చెరువులో విగ్రహం కోసం గాలింపు ముమ్మరం

TG: హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఫీర్జాదిగూడలోని సమీపంలోని ఓ ఆలయంలోకి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులోకి దూకినట్లు గుర్తించారు. తేజస్విని మృతదేహం లభించగా, కేసులో విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో DRF సిబ్బంది బోట్ల సహాయంతో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె నెలకు దాదాపు రూ. లక్ష అద్దె చెల్లిస్తున్న ఫ్లాట్, ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్, CCTV ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

రేవంత్, KTRల మధ్య చీకటి ఒప్పందం
Politics· 19 Jul 2026

రేవంత్, KTRల మధ్య చీకటి ఒప్పందం

TG: BJP MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన, CM రేవంత్ రెడ్డి, KTR మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు యువతను మోసం చేశాయని, బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల BRS పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్
TG· 19 Jul 2026

బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం జరుగుతున్న భూసేకరణపై అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. దీక్ష చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించి, తెల్లవారుజామున విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 650ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు గతకొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సరైన పరిహారం, పునరావాసంపై స్పష్టత లేకుండానే భూములు తీసుకోవడం సరికాదని ఆరోపించారు. రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులనూ పోలీసులు అడ్డుకున్నారు.

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా
Crime· 19 Jul 2026

నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌తో టోకరా

TG: హైదరాబాద్‌లోని నాగోల్ బండ్లగూడకు చెందిన వెంకట్ రెడ్డి విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల బారినపడి రూ.4.64 లక్షలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం Naukri.comలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయగా, దినేష్ మిట్టల్ అనే వ్యక్తి తనను నైకరీ గల్ఫ్ సర్వీస్ ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. ఖతర్ యూనివర్సిటీలో అధ్యాపకుని ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రిక్రూట్మెంట్ ప్రక్రియ పేరుతో పలుదఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నకిలీ నియామక ఉత్తర్వులు, ఖతర్ యూనివర్సిటీ పేరుతో నకిలీ ఈమెయిల్ పంపించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం
Politics· 19 Jul 2026

కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం

TG: వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్‌పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఆయన ముఖం, మెడ, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను స్థానిక MGM ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. MLA కేఆర్ నాగరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రియాంక చోప్రా బర్త్‌డే.. రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్
Cinema· 19 Jul 2026

ప్రియాంక చోప్రా బర్త్‌డే.. రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రం నుంచి ఆమె కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. “ఆమె నవ్వితే హుందాతనం.. నవ్వకపోతే అగ్ని కణం” అనే క్యాప్షన్‌తో రాజమౌళి ఈ ఫోటోలను Xలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, ప్రియాంక కొత్త రూపం వాటిని మరింత పెంచింది.

శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాం
India· 19 Jul 2026

శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తాం

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని రేపు నిర్వహించనున్న ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. ఈ మార్చ్‌ను ఐదు ప్రధాన అంశాలతో శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకమే ఉంటుందని, ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ జెండాలు ఉండవని స్పష్టంచేశారు. పాల్గొనేవారు భారత రాజ్యాంగం లేదా మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ ఫోటోలను తీసుకురావాలని సూచించారు. సానుకూల నినాదాలే చేయాలని, హింసకు పాల్పడకూడదని వాంగ్‌చుక్ తెలిపారు.

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
TG· 19 Jul 2026

మహిళ మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మంజుల(23) మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండానే ఇంజెక్షన్ ఇచ్చారని, దానికి రియాక్షన్ రావడంతో మరో ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
AP· 19 Jul 2026

తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

AP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అనంతపురం జిల్లా పామిడి మండలంలో పంటల పరిస్థితిని డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పొగరూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి, కంది, సజ్జ పంటలను పరిశీలించి రైతులతో వారు మాట్లాడారు. పంటల ఎదుగుదల, వర్షాభావ ప్రభావంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్
Education· 19 Jul 2026

అంగన్‌వాడీ అటెండెన్స్‌లో ఆదిలాబాద్ టాప్

TG: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల అటెండెన్స్‌ జిల్లాల వారీగా అనుహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా 93.47 శాతం హాజరుతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. కొమురంభీం, ఖమ్మం, ములుగు జిల్లాలు కూడా 80 శాతానికి పైగా హాజరుతో మెరుగైన ఫలితాలు నమోదు చేశాయి. మరోవైపు కరీంనగర్ జిల్లా కేవలం 52.69 శాతం హాజరుతో చివరి స్థానంలో నిలిచింది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా తక్కువ అటెండెన్స్ నమోదు అయింది. అభివృద్ధి చెందిన జిల్లాల్లో హాజరు తగ్గడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.