బహదూర్‌గూడలో అర్ధరాత్రి హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం జరుగుతున్న భూసేకరణపై అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. దీక్ష చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించి, తెల్లవారుజామున విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. 650ఎకరాల భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు గతకొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సరైన పరిహారం, పునరావాసంపై స్పష్టత లేకుండానే భూములు తీసుకోవడం సరికాదని ఆరోపించారు. రైతులకు మద్దతుగా వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులనూ పోలీసులు అడ్డుకున్నారు.



