రేవంత్, KTRల మధ్య చీకటి ఒప్పందం

TG: BJP MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన, CM రేవంత్ రెడ్డి, KTR మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు యువతను మోసం చేశాయని, బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల BRS పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని నిలదీశారు.


