Latest

సెల్‌ఫోన్ గొడవ.. బాలిక సూసైడ్
AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన జేమ్స్ కుమార్తె లావణ్య (15) స్థానిక ZPHSలో 9వ తరగతి చదువుతోంది. ఆమె అన్న చరణ్ కూడా అదే స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి సెల్ ఫోన్ వాడుకునే విషయంలో గొడవ పడ్డారు. తల్లిదండ్రులు లావణ్యను మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక క్షణికావేశంలో పక్కనే ఉన్న తన అవ్వ ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్నపిల్లల కోసం కట్టిన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

NOC కోసం లంచం డిమాండ్.. చివరికీ
TG: ఆదిలాబాద్ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సొనాల ప్రాంతానికి చెందిన చౌహన్ విక్రమ్ సింగ్ పౌల్ట్రీఫామ్ ఏర్పాటు కోసం NOC కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. నీరుపారుదల EE రాథోడ్ విఠల్, AE రమేష్ రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫైనల్‌గా రూ.60 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఇంజనీర్లకు డబ్బులు ఇస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నట్లు ఏసీబీ DSP మధు తెలిపారు.

ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియం
TG: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి TG20 లీగ్ మంచి వేదిక అని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. TG20 మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఛాంపియన్స్‌ను ఆయన అభినందించారు. తెలంగాణలో తొలిసారిగా క్రికెట్ లీగ్ జరిగిందని, రాష్ట్రంలోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో లక్షమంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. దీని కోసం BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) తో చర్చిస్తున్నట్లు తెలిపారు.

ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తండి
AP: రాష్ట్ర ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్‌లో మన గళం వినిపించాలని పార్టీ MPలకు YSR CP అధ్యక్షుడు YS జగన్ సూచించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ MPలతో చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు YSR CP ఇదివరకే మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని, రెండేళ్లలో రూ.3.6 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, ప్రజాసమస్యలపై పోరాడాలన్నారు.

పంట భూములను CM బీడు భూములుగా మారుస్తున్నారు
TG: రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి CM రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ MLA సుంకర శంకర్ ఫైరయ్యారు. పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరితే BRS నాయకుల రక్తాన్ని పంటపొలాల్లో చల్లాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, పార్టీ నాయకులు రక్తదానం చేశారు. KCRను బదనాం చేయడానికి కన్నెపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి ఎత్తిపోయకుండా CM కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీటి చుక్క కోసం అన్నదాత ఆరాటం
TG: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు ఖాళీగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హన్మకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 60 శాతం మైనస్ వర్షపాతం నమోదైంది.

అమరావతిని ఎవరూ కదిలించలేరు
AP: అమరావతి రాష్ట్ర ఖ్యాతిని పెంచేలా, యువతకు ఉపాధినిచ్చే కల్పవల్లిగా వర్ధిల్లుతుందని CM చంద్రబాబు అన్నారు. రాజధాని పరిధి వెంకటపాలెంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో పూరీ జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిర్మిస్తున్న అమరావతిని ఈ స్థల మహాత్మ్యంతో ఎవరూ కదిలించలేరు అన్నారు. సమాజంలో విలువలు, మానవ సంబంధాలు పడిపోతున్న టైంలో చాలా సమస్యలకు ఆధ్యాత్మికతే పరిష్కారం అని CM చంద్రబాబు అన్నారు.

USలో కత్తి పోట్లకు గురైన హైదరాబాదీ!
అమెరికాలోని ఉటా రాష్ట్రంలో వెస్ట్ వ్యాలీలోని ఒక షాపింగ్ మాల్‌లో దుండగుడి కత్తి పోట్లకు గాయపడిన బాధితుడు హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన సోహైల్ అని తేలింది. నిన్న ఆర్ యు ఏ ముస్లిం? అని అడుగుతూ ఓ దుండగుడు కత్తితో 13 సార్లు పొడవడంతో సోహైల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సొహైల్ వివాహితుడు. ఇతనికి ఇద్దరు పిల్లలున్నారు. మైనారిటీలపై దాడుల పట్ల MIM నేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై భారత కాన్సులేట్ కూడా విచారం వ్యక్తం చేసింది.

'ది ఒడిస్సీ' మూవీకి అరగంట ముందే వెళ్లాలి.. ఎందుకంటే?
క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఫ్యాన్స్ దీనిని ఒక గ్రాండ్ సినిమాటిక్ ఈవెంట్‌గా చూస్తున్నారు. హోమర్ రాసిన 3,000 ఏళ్ల నాటి పురాతన ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రారంభం కావడానికి కంటే ముందే థియేటర్‌కు చేరుకోవడం వల్ల, కథా నేపథ్యాన్ని ,ఆ అద్భుతమైన వాతావరణాన్ని ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకుని ఆస్వాదించడానికి వీలవుతుంది. దాదాపు రూ. రెండు వేల కోట్లతో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ఇది

USలో ఇకపై విదేశీ స్టూడెంట్లకు 4 ఏళ్ల ఫిక్స్‌డ్ వీసా
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్స్ , ఫారిన్ మీడియా వీసాల కోసం ఒక కొత్త రూల్‌ను ఫైనలైజ్ చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ (కోర్సు అయిపోయే వరకు ఉండే అవకాశం) స్థానంలో ఇకపై 4 ఏళ్ల ఫిక్స్‌డ్ వీసా కాలాన్ని తీసుకురానున్నారు. దీనివల్ల లాంగ్ టర్మ్ కోర్సులు చేసే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ మళ్లీ వీసా ఎక్స్‌టెన్షన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో ఏవైనా ఆలస్యాలు జరిగితే, వారు చట్టవిరుద్ధంగా అక్కడ ఉన్నట్లు పరిగణించే ప్రమాదం ఉంది.

విశాఖలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు !
విశాఖలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు కలకలం రేపుతోంది. బాధితుడు జ్వరం, ఒళ్లు నొప్పులతో జనరల్ ఫిజీషియన్ దగ్గరకు రాగా అనుమానం వచ్చి ప్రైవేట్ ల్యాబ్ కు టెస్టుకు పంపారు. అయితే ప్రైవేటు ల్యాబ్ లో అతగాడికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత వైద్యాధికారి ద్వారా అదే శాంపిల్ ను కోవిడ్ టెస్ట్ నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ లో కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించడంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లోకి పంపారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కోవిడ్ కేసు కనిపించడంతో వైద్య వర్గాలు కలవరం చెందుతున్నాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

AI జాబ్స్ బోలెడు.. టాలెంట్ మాత్రం షార్ట్!
భారత్‌లో రోబోటిక్స్, ఇండస్ట్రియల్ AI రంగాల్లో 9,000+ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటికి సరిపోయే స్కిల్స్ ఉన్న నిపుణులు దొరకడం కంపెనీలకు పెద్ద సవాల్‌గా మారింది. దేశంలో 3.7 లక్షల AI టాలెంట్ పూల్ ఉన్నా, AIతో పాటు రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, IoT, క్లౌడ్ స్కిల్స్ కలిగిన వారే ఎక్కువ డిమాండ్‌లో ఉన్నారు. ముఖ్యంగా తయారీ, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ రంగాల్లో అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి.

మహిళలకు జాబ్స్ షాక్.. 15 నెలల్లో నిరుద్యోగం టాప్!
భారత్‌లో మహిళల నిరుద్యోగం జూన్‌లో 5.9% చేరి 15 నెలల గరిష్ఠానికి ఎగిసింది. మేలో ఇది 5.6%గా ఉంది. గ్రామీణ మహిళల నిరుద్యోగం 5%, పట్టణాల్లో 6.4%కు పెరిగింది. మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 32.7% వద్ద దాదాపు స్థిరంగా ఉండగా, మొత్తం నిరుద్యోగం 5.5%గానే ఉంది. మహిళలు ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నా, అవకాశాలు అదే వేగంతో పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

క్రేన్ కూలి ఒక వ్యక్తి దుర్మరణం, ముగ్గురికి గాయాలు
ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో గురువారం నిర్మాణంలో ఉన్న 13 అంతస్తుల భవనం వద్ద భారీ కన్స్ట్రక్షన్ క్రేన్ అకస్మాత్తుగా కూలిపడింది. ఈ ఘోర ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్ కింద పడటంతో అక్కడ పార్క్ చేసిన 12-16 వాహనాలు పూర్తిగా ధ్వంసమ య్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. భద్రతా లోపాలు లేదా టెక్నికల్ ప్రొబ్లమ్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

UPSC సాధించలేక నకిలీ అవతారాలెత్తిన ఘనుడు !
ఉత్తరాఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్ రామస్వామి కుమారుడు యశ్‌వర్ధన్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఐపీఎస్ ఆఫీసర్, రా (RAW) ఏజెంట్ , ఆర్మీ సోల్జర్‌గా నకిలీ అవతారాలెత్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుండి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. నిందితుడి వద్ద నుండి 5 ఫేక్ ఐడీ కార్డులు, ఆర్మీ యూనిఫారాలు, వైర్‌లెస్ సెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీఎస్‌సీ (UPSC) క్లియర్ చేయలేక, అధికారం కోసం అతను ఈ మోసాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

ఇస్రోలో ఆ రాజీనామాలు కామన్ - మంత్రి
భారత అంతరిక్ష సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తల రాజీనామాలు, వాలంటరీ రిటైర్మెంట్ లపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఇస్రోలో ఉద్యోగులు రావడం, పోవడం సహజమని, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాల వల్లేనని ఆయన స్పష్టం చేశారు. గగన్‌యాన్ లాంటి కీలక మిషన్ల నేపథ్యంలో గ్రూప్-Aఅధికారుల రాజీనామాలను నిరాకరించాలని ఇస్రో ఇంటర్నల్ ఆర్డర్స్ జారీ చేసింది. అలాగే కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో ఎలాంటి డేటా లీక్ కాలేదని మంత్రి వెల్లడించారు.

ఈ వర్షాకాల సమావేశాల్లో 5 కొత్త బిల్లులకు ఛాన్స్ !
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, గత ఏప్రిల్ బడ్జెట్ సమావేశాల్లో విఫలమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళల రిజర్వేషన్, డీ లిమిటేషన్)ల పై ఇంకా క్లారిటీ రాలేదు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ఈ బిల్లు నెగ్గడానికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. విపక్ష కూటమిలోని కొన్ని పార్టీలను ఆకర్షించడం ద్వారా ఈసారి ఎలాగైనా అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించాలని ఎన్డీయే (NDA) ప్రభుత్వం తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

₹30 కోట్ల ఆస్తి ఇచ్చినా తల్లికి తిండి పెట్టని కొడుకులు💔
శంకర్‌పల్లిలో హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 82 ఏళ్ల సుశీలమ్మ తన ఇద్దరు కొడుకులకు ₹30 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని సమానంగా పంచింది. తన ఫ్యూచర్ కోసం 2 ఎకరాలు అమ్మి దాచుకున్న ₹2.70 కోట్ల క్యాష్‌ను చిన్న కొడుకు నర్సింహారెడ్డి లాక్కున్నాడు. కనీసం అన్నం పెట్టకుండా, కేవలం బ్రెడ్ ఇస్తూ డాబా పైన ఉంచాడు. డబ్బులు తిరిగి అడిగితే ఇంట్లోంచి గెంటేశాడు. తిండికి అలమటిస్తూ ఆ బామ్మ 6 నెలలుగా ఆర్డీవో, కలెక్టర్ చుట్టూ తిరుగుతుండగా, ఫైనల్‌గా పోలీసులు కేసు బుక్ చేశారు.

తిరుపతి దేవస్థానం హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ₹97 కోట్ల విరాళాలు వచ్చాయి. డొనేషన్స్ ఇచ్చే భక్తుల దర్శన రూల్స్ మారుతుండటంతో, పాత బెనిఫిట్స్ కోల్పోకూడదని కేవలం 10 గంటల్లోనే భక్తులు క్యూ కట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 2,460 మంది డొనేట్ చేయగా, ఇందులో ఇద్దరు భక్తులు ఏకంగా తలో ఒక కోటి రూపాయలు ఇవ్వడం విశేషం.
దీక్షా స్థలిలో కేజ్రీవాల్ సంచలన కామెంట్స్!
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షా స్థలికి వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్, ఎగ్జామినేషన్ సిస్టమ్‌ను సరిచేయాలని కోరుతూ 'కాక్రోచ్ మూమెంట్' చేస్తున్న యువతకు సెల్యూట్ చేశారు. ఎగ్జామ్స్ రాయడం స్టూడెంట్స్ డ్రీమ్ అని, కానీ వరుస పేపర్ లీకులతో వారి కాన్ఫిడెన్స్ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తుకు ఇది ప్రమాదకరమన్న కేజ్రీవాల్.. విద్యార్థుల కోసం 18 రోజులుగా పోరాడుతున్న వాంగ్‌చుక్‌కు సపోర్ట్ ఇవ్వాలని, జులై 20న జరగబోయే పార్లమెంట్ మార్చ్‌ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.

చివరి శ్వాస వరకు గంగ కోసమే- జీ.డీ. అగర్వాల్
గంగా నది రక్షణ కోసం ప్రాణాలర్పించిన మాజీ IIT ప్రొఫెసర్, ప్రముఖ పర్యావరణవేత్త జీ.డీ. అగర్వాల్ (స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్) పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. గంగలో అక్రమ ఇసుక తవ్వకాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆయన 2018 జూన్ 22న ఆమరణ దీక్షకు దిగారు. గంగా రక్షణ చట్టం తేవాలని, నది స్వేచ్ఛా ప్రవాహాన్ని కాపాడాలని కోరుతూ ఏకంగా 111 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష కొనసాగించిన ఆయన, అదే ఏడాది అక్టోబర్ 11న కన్నుమూశారు.