← Back to news

క్రేన్ కూలి ఒక వ్యక్తి దుర్మరణం, ముగ్గురికి గాయాలు

By DS· 16 Jul 2026· ndtv· Mumbai
క్రేన్ కూలి ఒక వ్యక్తి దుర్మరణం, ముగ్గురికి గాయాలు

ముంబై సమీపంలోని మీరా రోడ్‌లో గురువారం నిర్మాణంలో ఉన్న 13 అంతస్తుల భవనం వద్ద భారీ కన్స్ట్రక్షన్ క్రేన్ అకస్మాత్తుగా కూలిపడింది. ఈ ఘోర ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్ కింద పడటంతో అక్కడ పార్క్ చేసిన 12-16 వాహనాలు పూర్తిగా ధ్వంసమ య్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. భద్రతా లోపాలు లేదా టెక్నికల్ ప్రొబ్లమ్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More in News