Latest
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై AAP MP పవర్‌ఫుల్ పోస్ట్!
సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. దీనిపై AAP MP సంజయ్ సింగ్ రియాక్ట్ అవుతూ, PM మోదీ, మీడియా మౌనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. X ప్లాట్‌ఫామ్‌లో ఒక పవర్‌ఫుల్ పోయం షేర్ చేస్తూ, "పోరాటం ఇంకా ముగియలేదు, ఈ టైమ్‌లో సైలెంట్‌గా ఉండేవాళ్లు కూడా దోషులే" అని విమర్శించారు. ఆయన ప్రాణాలకేదైనా రిస్క్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

HMDA చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ACB దాడులు
TG: హైదరాబాద్‌లో HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఇంట్లో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయం, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో 15 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నోట్ల కట్టలు, వివిధ ఆస్తి పత్రాలు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల DSP భీమ్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సోదాల సమయంలో సుమారు రూ.300 కోట్లకు పైగా ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు బయటపడిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ సంచలన ట్వీట్!
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. "వాంగ్‌చుక్ గారు, మీరు దేశానికి ఒక హెరిటేజ్. దయచేసి మీ హంగర్ స్ట్రైక్ ముగించండి" అని కేజ్రీవాల్ రిక్వెస్ట్ చేశారు. అలాగే, జూలై 16 సాయంత్రం 5 గంటలకు స్వయంగా జంతర్ మంతర్‌కు వెళ్లి వాంగ్‌చుక్‌ను కలిసి తన సపోర్ట్ అందిస్తానని ట్విట్టర్ (X)లో ట్వీట్ చేశారు.

అమెరికా శాస్త్రవేత్తల ఘనత
అమెరికా శాస్త్రవేత్తలు రసాయనాలతో 'స్పుద్‌సెల్' అనే సజీవ కృత్రిమ కణాన్ని సృష్టించారు. ఇది ఆహారం తీసుకుంటూ ఐదు తరాల వరకు కణ విభజన చెందగలదు. 90 కేబీపీ చిన్న జీనోమ్ కలిగిన ఈ కణానికి జీవభద్రత ముప్పులు లేవు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు సమర్థవంతమైన ఔషధాల తయారీ, పారిశ్రామిక రసాయనాల ఉత్పత్తి, బయోఎకానమీ బలోపేతానికి మార్గం సులువు కానుంది.
జాతీయ పక్షికి అరుదైన గౌరవంతో వీడ్కోలు
ఢిల్లీ నరేలా పార్కులో కుక్కల దాడిలో మరణించిన జాతీయ పక్షి నెమలికి పోలీసులు అరుదైన గౌరవం కల్పించారు. ఎస్‌ఐ సురేంద్ర మాలిక్ బృందం నెమలి కళేబరాన్ని జాతీయ జెండాతో చుట్టారు. స్థానికుల సాయంతో పార్కులోనే నెమలికి అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి విధుల్లో ఉంటూనే మూగజీవి పట్ల పోలీసులు చూపిన మానవత్వానికి సంబంధించిన వీడియో నెట్‌లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.

గ్రామాల్లో పన్ను..ఏకంగా రూ.1200
TG: గ్రామ పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు, గ్రామాల్లో హోల్డింగ్ పన్ను, ఇతర స్థానిక పన్నులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ప్రతిపాదన కింద ప్రతి ఇంటి నుండి రూ.1200 పన్ను వసూలు చేస్తారు. దీంతో గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ నిర్వహణ, వీధి దీపాలలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇప్పటికే ఏడాదికి రూ.100 నుండి రూ.300 ఇంటి పన్ను ఉండగా, ఒక్కసారిగా రూ.1200 వరకు పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయనుంది.

నోటి పుండ్లు ఎందుకు వస్తాయి?
ఒంటి మీద పుండునే తట్టుకోలేం! ఇక నోట్లో పుండ్లను భరించగలమా? ఇవి పెదవులు, బుగ్గల లోపల తెల్లగా, గుండ్రగా మొదలై వాటి నుండి రక్తం కూడా వస్తుంది. కారం, ఉప్పు, పులుపు దానికి తగిలితే ఆ నొప్పి భరించలేం. ఇవి రావడానికి ముఖ్యంగా పొగతాగడం, ఎక్కువ కారం, పులుపు ఉన్న పదార్థాలు తీసుకోవడం, దంతాల చికిత్స (ఎత్తు పళ్ళను సరిచేసేందుకు పెట్టె బ్రెసెస్ సరిగ్గా పట్టకపోవడం), నొప్పి మందులు తరచుగా వాడడం కారణాలు.

హోర్ముజ్ జలసంధిలో దాడి..భారత నౌకదళా సిబ్బంది మృతి
హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో ఓ భారతీయ నౌకదళా సిబ్బందిలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచిన ఈ ఘటనపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు పోతున్నా.. గవర్నమెంట్ సైలెంట్!
ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. సుదీర్ఘ ఉపవాసం వల్ల ఆయన కండరాల క్షీణతతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. దీక్ష ఆపాలని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కేతో పాటు అందరూ రిక్వెస్ట్ చేయగా, "నన్ను దీక్ష ఆపమని అడగొద్దు, చర్చలు జరపడానికి కూడా సిద్ధంగా లేని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి" అంటూ ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోనమ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు.

అమెరికా ఆంక్షల మధ్య యథావిధిగా ఇరాన్ చమురు ఎగుమతులు
అమెరికా 60 రోజుల ఆంక్షల మినహాయింపును రద్దు చేసినప్పటికీ ఇరాన్ చమురు ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆ దేశ ఇంధనశాఖ మంత్రి మొహ్సెన్ పాక్‌నెజాద్ తెలిపారు. ఆంక్షలను ఎదుర్కొనే వ్యవస్థ ఇప్పటికే రెడీగా ఉండటంతో ఎగుమతులపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

ఆషాఢం ఆఫర్ అంటూ గ్రామస్తులకు టోకరా
AP:కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చి లక్కీ డ్రాలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేశాడు. ఆషాడం ప్రత్యేక ఆఫర్ పేరుతో ఫ్రిజ్, ఎయిర్ కూలర్, డబుల్ కాట్ మంచం, వాషింగ్ మెషిన్, బైక్‌ల వంటి ఖరీదైన వస్తువులను అతితక్కువ ధరకే అందిస్తామని నమ్మించాడు. రోజువారీ కూలీలే లక్ష్యంగా పలువురి నుంచి నగదు, ఫోన్‌పే ద్వారా వేలాది రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చేతికి రాగానే మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితులు మలికిపురం PSలో ఫిర్యాదు చేశారు.
రైల్వే పాయింట్స్ మ్యాన్ సాహసం అదుర్స్
కర్ణాటక రాష్ట్రం మురుడేశ్వర్ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి ఒక ప్రయాణికుడు దిగడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అతను ఫ్లాట్‌ఫార్మ్ మధ్యలోకి పడిపోతుండగా డ్యూటీలో ఉన్న పాయింట్స్ మ్యాన్ గణపతి నాయక్ అతణ్ని బయటకు లాగి ప్రాణాలు కాపాడాడు. అతని ధైర్యసాహసాన్ని గుర్తించిన కొంకణ్ రైల్వే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రూ.10 వేలు నగదును బహుమతిగా ప్రకటించారు.

చీమలు తీపి పదార్థాలను ఎలా గుర్తిస్తాయి?
చీమలు తీపి పదార్థాలను ఎలా గుర్తిస్తాయో తెలుసా? వాటి తలపై ఉండే రెండు యాంటెన్నాలలో వేలాది సూక్ష్మ గ్రాహకాలు ఉంటాయి. ఇవి గాలిలో ఉన్న వాసన అణువులను గుర్తిస్తాయి. తీపి పదార్థాల నుంచి విడుదలయ్యే రసాయన అణువులను పసిగట్టి, దూరం నుంచే ఆహారం ఎక్కడ ఉందో గుర్తిస్తాయి. ఒక చీమ తీపి ఆహారం కనుక్కుంటే తిరిగి గూటికి వెళ్తూ నేలపై ఫెరోమోన్ అనే రసాయన మార్గాన్ని వదులుతుంది. ఆ మార్గాన్ని అనుసరించి మిగతా చీమలు కూడా అదే ఆహారం వద్దకు చేరుకుంటాయి.

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ మళ్లీ తగ్గాయి. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹110, 22 క్యారెట్లపై ₹100, 18 క్యారెట్లపై ₹80 వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ₹1,42,800 ఉండగా, 22 క్యారెట్లు ₹1,30,900 వద్ద, 18 క్యారెట్లు ₹1,07,100 గా ఉంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు, కాబట్టి కొనేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.

OUలో పోరుదీక్ష.. విద్యార్థి నేత అరెస్ట్
TG: రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలని చేయాలని విద్యార్థిసేన ఆధ్వర్యంలో OUలో నిరుద్యోగ పోరుదీక్ష చేశారు. యూనివర్సిటీలో దీక్షకు అనుమతి లేదని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు శివప్రసాద్‌ను OU పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన CM రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఫైరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌లను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు.

క్షుద్రపూజల పేరుతో బాలుడి మృతి
AP: క్షుద్ర పూజలకు చిన్నారి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దివ్యాంగ బాలుడు చక్రవర్తి(5)ని నడిపిస్తానని మొబీనా అనే మహిళ కుటుంబసభ్యులను నమ్మించింది. బాలుడిని మొబీనాకు అప్పగించి తల్లిదండ్రులు వెళ్లిపోయారు. అనంతరం అతని రెండు చేతులను కట్టేసి చిత్రహింసలు పెట్టింది. దెబ్బలకు తాళలేక అతడు స్పాట్‌లో చనిపోయాడు. అయితే తిరిగి బతికిస్తాని మృతదేహంతో మొబీనా పూజలు చేసింది. చివరికి ఆమె తీరుపై అనుమానం రావడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్‌తో నాగార్జున 101వ సినిమా?
హీరో కింగ్ నాగార్జున తన 100 సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉండగా, బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ ఇటీవల ఆయనకు ఓ కథ వినిపించారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నాగార్జునకి ఆ కథ నచ్చి అగ్రిమెంట్ కూడా చేశారని తెలుస్తోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ మీద ఇండస్ట్రీలో అంచనాలు పెరిగాయి.

రాజ్‌కుమార్ మృతదేహం మాకు వద్దన్న కుటుంబసభ్యులు
TG: ఆరుగురిని క్రూరంగా హతమార్చిన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు ఇవ్వగా, వారు అతని బాడీని తమ వెంట తీసుకువెళ్ళడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి స్థానిక స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

బాబా వేషంలో రౌడీషీటర్
TG: 2018 హైదరాబాద్ నగరం సైఫాబాద్ హత్య కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు, రౌడీషీటర్ మహ్మద్ జావేద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లు కప్పేందుకు అతను సంగారెడ్డి జిల్లా చేర్యాలలోని ఓ దర్గాలో బాబా అవతారమెత్తాడు. ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పరీక్షల్లో అతడు గంజాయి తాగినట్టు నిర్ధారణ కావడంతో సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్
విదేశీ విద్యార్థుల తొలి ఎంపికగా భారత్ మారుతోంది. భారత్‌కు ఉన్నత విద్య కోసం వచ్చే విదేశీ విద్యార్థుల్లో నేపాల్ (24.1%) తొలి స్థానంలో నిలిచింది. తర్వాత యూఏఈ (7%), అమెరికా (5.9%), బంగ్లాదేశ్ (5.9%), నైజీరియా (5.7%), జింబాబ్వే(4%) దేశాలు ఉన్నాయి. ఫారిన్ విద్యార్థులకు భారత్ ‘ఎడ్యుకేషన్ డెస్టినేషన్’గా మారుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

పోక్సో నిబంధనలు దుర్వినియోగం: సుప్రీం
దిల్లీ వరుస ప్రేమ వ్యవహారాల్లో నమోదవుతున్న పోక్సో కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేమ జంటలను విడదీయడానికి కొందరు తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంది. బాధితుల వయసు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసులు నమోదు చేయాలని సూచించింది. ఇలాంటి కేసుల్లో విచారణ సమయంలో నిజాలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ చర్యలు యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది.