Latest

E 20 వాడకంతో పాత కార్లకు దెబ్బే !
News· 7 Jul 2026

E 20 వాడకంతో పాత కార్లకు దెబ్బే !

ఈ20 (E20) పెట్రోల్ వాడకం వల్ల పాత కార్లలోని ఇంధన వ్యవస్థకు సంబంధించిన రబ్బరు భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI ( ఆటో మోటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)lనివేదికలో తెలిపింది. అయినా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బయటపెట్టలేదు. 2023 కంటే ముందు తయారైన వాహనదారుల ఆందోళనలను ఈ నివేదిక నిజం చేస్తోంది. అయితే, ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ20 ఇంధన వినియోగాన్ని ఈ నివేదిక సమర్థించడం విశేషం !

ఇండోనేషియాలో  బిజూ పట్నయక్‌కు మోడీ ప్రశంస
World· 7 Jul 2026

ఇండోనేషియాలో బిజూ పట్నయక్‌కు మోడీ ప్రశంస

ఇండోనేషియా పర్యటనలో మోడీ బిజూపట్నాయక్‌కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మెమోరీని షేర్ చేసుకున్నారు. ఇండోనేషియా స్వతంత్ర నాయకులను డచ్ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు, నెహ్రూ విన్నపం మేరకు 31ఏళ్ల బిజూపట్నాయక్ ప్రాణాలకు తెగించి విమానంలో జకార్తా చేరుకున్నారు. డచ్ బలగాలను లెక్క చేయకుండా, ఆ దేశ ప్రధాని సుతాన్ సజహ్రీర్, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ హట్టాలను ఢిల్లీకి తరలించారు. దీనికి గుర్తుగా ఇండోనేషియా ప్రభుత్వం ఆయనను అత్యున్నత పౌరపురస్కారం 'భూమిపుత్ర'తో గౌరవించింది. దీనిని మోదీ ప్రశంసించారు.

బరుయిపూర్ రేప్-మర్డర్ కేసులో పోలీసు లోపాలపై బెంగాల్ సీఎం నివేదిక కోరార
India· 7 Jul 2026

బరుయిపూర్ రేప్-మర్డర్ కేసులో పోలీసు లోపాలపై బెంగాల్ సీఎం నివేదిక కోరార

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బరుయిపూర్ రేప్-మర్డర్ కేసు దర్యాప్తులో పోలీసు లోపాలపై నివేదిక కోరారు. లించ్ చేయబడిన యువకుడు నిర్దోషి అని ఆయన అన్నారు. ఈ ఘటనలో పోలీసు వైఫల్యంపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.

కడియం శ్రీహరిపై సీఎం రేవంత్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
Business· 7 Jul 2026

కడియం శ్రీహరిపై సీఎం రేవంత్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ సీఎం రేవంత్‌కు కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పార్టీలో కలకలం రేపింది.

కొత్త యాడ్ లో బేబీ బంప్ తో మెరుస్తున్న దీపికా !▶
Cinema· 7 Jul 2026

కొత్త యాడ్ లో బేబీ బంప్ తో మెరుస్తున్న దీపికా !

ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె నటించిన ఒక కొత్త కమర్షియల్ యాడ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ యాడ్‌లో దీపికా తన బేబీ బంప్‌తో ఎంతో క్యూట్‌గా, గ్లోయింగ్‌గా కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ, "అసలు ఎంత అందంగా ఉందో!" అంటూ క్రేజీ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది!

HYROX హైప్.. ఫిట్‌నెస్‌కు కొత్త క్రేజ్!
Health· 7 Jul 2026

HYROX హైప్.. ఫిట్‌నెస్‌కు కొత్త క్రేజ్!

జిమ్‌లో కేవలం వెయిట్స్ ఎత్తడం కాదు.. ఇప్పుడు HYROX ఛాలెంజ్‌తో ఫిట్‌నెస్ లెవెల్‌ను ప్రూవ్ చేసే ట్రెండ్ దూసుకెళ్తోంది. ఇందులో 1 కి.మీ. రన్ తర్వాత ఒక ఫంక్షనల్ వర్కౌట్ చేయాలి. ఇలా మొత్తం 8 రన్స్ + 8 వర్కౌట్స్ పూర్తి చేయాలి. స్లెడ్ పుష్, రోయింగ్, బర్పీలు, వాల్ బాల్స్ వంటి టాస్కులు ఉంటాయి. మొదట బేసిక్ ట్రైనింగ్‌తో ప్రారంభించి, ఓవర్‌ట్రైనింగ్‌కు దూరంగా ఉండాలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.

తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయ!
India· 7 Jul 2026

తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయ!

తాజ్ మహల్ చుట్టూ మళ్లీ లీగల్ వార్ మొదలైంది. ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడం లోపల 'తేజో మహాలయ' అనే శివాలయం ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజ్ మహల్ ప్రాంగణంలో హిందూ మతపరమైన ఆనవాళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి శాస్త్రీయమైన, భౌతికపరమైన సర్వే (Scientific Survey) జరపాలని పిటిషనర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం వస్తుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది!

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో హై టెన్షన్!
World· 7 Jul 2026

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో హై టెన్షన్!

యూఎస్-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) నడుస్తున్న టైమ్‌లోనే.. కేవలం 24 గంటల్లో ఏకంగా 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. పర్షియన్ గల్ఫ్ ద్వారం వద్ద బ్రిటీష్ మిలిటరీ ఈ దాడులను ధృవీకరించింది. శాంతి చర్చలు సాగుతున్న వేళ, గ్లోబల్ ఆయిల్ సప్లై రూట్‌లో జరిగిన ఈ సీరియస్ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్!

ప్రశ్న రావణ్ పై UAPA చట్టం వర్తించదు: ABV
Viral· 7 Jul 2026

ప్రశ్న రావణ్ పై UAPA చట్టం వర్తించదు: ABV

ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టుపై Ex IPS ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రిమాండ్ రిపోర్టుతో పాటు రావణ్ అరెస్టుకు కారణమైన వీడియో క్లిప్స్ అన్నీ చూశానని చెప్పారు. రాధామనోహర్ దాస్ అనే వ్యక్తి వేరే మతంపై చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గానే రావణ్ మాట్లాడారని, అంతేకానీ ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. రావణ్ కొన్ని బూతులు మాట్లాడిన మాట నిజమే అయినా.. అవి కేవలం ఆ వ్యక్తిని ఉద్దేశించి అన్నవే తప్ప, వాటికి ఎలాంటి ఉగ్రవాద వ్యతిరేక చట్టం (UAPA) వర్తించదని, అసలు ఈ కేసులకు ఆ చట్టానికి సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు.

ఖరల్దాస్ జలపాతానికి టూరిస్టుల తాకిడి▶
Entertainment· 7 Jul 2026

ఖరల్దాస్ జలపాతానికి టూరిస్టుల తాకిడి

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనినౌపడా జిల్లాలో ఉన్న ఖరల్ధాస్ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది...ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏకంగా 500 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం ఉధృతంగా జాలువారుతోంది.. పచ్చని ప్రకృతి మధ్య అలరిస్తున్న ఈ జలపాతం పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు..ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా మారుతోంది..జలపాతానికి సంబంధించిన అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తుండటంతో.. దీనిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు..

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!
Crime· 7 Jul 2026

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో AP హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడైన CI నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు SITకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ విచారణ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్‌గా వీడియో రికార్డింగ్ చేసి కోర్టు ముందు పెట్టాలని ఆదేశించింది. తనకు ప్రాణహాని ఉందంటూ, రాజమండ్రి జైల్లోనే విచారణ జరపాలని నాగరాజు లాయర్ చేసిన రిక్వెస్ట్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ విచారణతో నిందితుడి హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.

చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో DSP సంచలన హామీ!
Viral· 7 Jul 2026

చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో DSP సంచలన హామీ!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు నెల దాటినా ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ కేసుపై కాకినాడ జిల్లా తుని మండలంలో DSP తిలక్ మీడియా సమావేశం పెట్టి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటే తమకు అప్పగించాలని, వారిపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోమని హామీ ఇచ్చారు. జంతువుల ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదని, ప్రస్తుతం ఈ కేసును కిడ్నాప్ యాంగిల్‌లోనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పారు. సెల్‌ఫోన్ వాడని వాళ్లే దీనికి పాల్పడి ఉంటారని డౌట్ పడుతున్నారు.

వాయనాడ్ ను షేక్ చేస్తున్న CCTV ఫుటేజ్!▶
Viral· 7 Jul 2026

వాయనాడ్ ను షేక్ చేస్తున్న CCTV ఫుటేజ్!

వాయనాడ్‌లో జరిగిన ఒక భయంకరమైన కొండచరియలు విరిగిపడిన విజువల్స్ అక్కడ ఉన్న ఒక CCTV కెమెరాలో రికార్డయ్యాయి. మట్టి, బురద ఒక్కసారిగా కొట్టుకుంటూ వస్తుంటే.. అక్కడున్న జనం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భయంతో పరుగులు తీశారు. ఆ ఫోర్స్‌కి అక్కడ ఆపి ఉంచిన ఒక హెవీ ట్యాంకర్ లారీ కూడా క్షణాల్లో కొట్టుకుపోయింది. ఈ హార్రర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

CM రేవంత్‌కి కొండా సురేఖ లెటర్!
Politics· 7 Jul 2026

CM రేవంత్‌కి కొండా సురేఖ లెటర్!

TG: MLA కడియం శ్రీహరిపై యాక్షన్ తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ CM రేవంత్ రెడ్డికి 3 పేజీల లెటర్ రాశారు. దేవాదాయ శాఖలో తనకి చెప్పకుండా కడియం అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టడంపై ఆమె సీరియస్ అయ్యారు. ఇది రూల్స్ కి విరుద్ధమని, గవర్నమెంట్ సిస్టమ్ నమ్మకానికి సంబంధించిన ఇష్యూ అని చెప్పారు. డిసిప్లినరీ కమిటీతో ఎంక్వైరీ చేయించి, మంత్రుల పవర్స్ ని రెస్పెక్ట్ చేసేలా కడియం శ్రీహరికి గైడ్‌లైన్స్ ఇవ్వాలని సురేఖ డిమాండ్ చేశారు.

బ్రేకింగ్ న్యూస్: జడ శ్రవణ్‌పై పోలీస్ కంప్లైంట్!
Politics· 7 Jul 2026

బ్రేకింగ్ న్యూస్: జడ శ్రవణ్‌పై పోలీస్ కంప్లైంట్!

AP: లాయర్ జడ శ్రవణ్‌పై అనకాపల్లి జిల్లా కొత్త కోట పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ P.V.S.N ఈ కంప్లైంట్ ఇచ్చారు. జడ శ్రవణ్ తన స్పీచ్‌లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడారని, ఆయన పరువు తీసేలా కామెంట్స్ చేశారని రాజు తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య!
Crime· 7 Jul 2026

హైదరాబాద్‌లో దారుణం.. లవర్ తో కలిసి భర్తను చంపిన భార్య!

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ బయటపడింది. సత్యవతి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త పెంతేష్ (45)ను మర్డర్ చేసింది. ఆ తర్వాత ఎవరికీ డౌట్ రాకుండా బాడీని తీసుకెళ్లి మహారాష్ట్ర బోర్డర్ దగ్గర పాతిపెట్టేసింది. లాస్ట్ నవంబర్‌లో తన భర్త కనిపించడం లేదంటూ తనే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ, పోలీసులు కేసు ఫైల్ చేసి ఆమె కాల్ రికార్డ్స్, CCTV ఫుటేజ్ చెక్ చేయడంతో ఈ కిల్లర్ ప్లాన్ మొత్తం బయటపడింది.

బిగ్ ట్విస్ట్: హత్యకు ముందే ప్రియుడిని పెళ్లాడిన సియా గోయల్!
Crime· 7 Jul 2026

బిగ్ ట్విస్ట్: హత్యకు ముందే ప్రియుడిని పెళ్లాడిన సియా గోయల్!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె రియల్టర్ 'కేతన్ అగర్వాల్' మర్డర్ కేసులో మరో షాకింగ్ నిజం బయటపడింది. కేతన్‌ని మర్డర్ చేయడానికి ముందే.. నిందితురాలు సియా గోయల్ తన బాయ్‌ఫ్రెండ్ చేతన్ చౌదరిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా దాదాపు నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారని అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది.

మనవడి కోసం హాస్పిటల్‌కు వెళ్ళానున్నారు KCR!
News· 7 Jul 2026

మనవడి కోసం హాస్పిటల్‌కు వెళ్ళానున్నారు KCR!

KTR కొడుకు హిమాన్షు నిన్న సాయంత్రం స్పోర్ట్స్ ఆడుతుండగా ఒక చిన్న గాయం అయింది. ప్రస్తుతం ఆయన AIG హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో తన మనవడు హిమాన్షును పరామర్శించడానికి, హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకోవడానికి BRS అధినేత KCR హాస్పిటల్‌కు వెళ్తున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్!
Politics· 7 Jul 2026

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్!

ఢిల్లీ హైకోర్టులో కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఊరట లభించింది. గతంలో కొన్ని వివాదాల వల్ల బ్లాక్ చేసిన ఆ పార్టీ అఫీషియల్ 'ఎక్స్' అకౌంట్‌ను వెంటనే అన్‌బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు గవర్నమెంట్‌ను ఆదేశించింది. కోర్టు ఆర్డర్‌తో CJP లీడర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకో 24 నుండి 48 గంటల్లో ఈ అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

M.S ధోనీకి Ex CM స్టాలిన్ బర్త్‌డే విషెస్!
News· 7 Jul 2026

M.S ధోనీకి Ex CM స్టాలిన్ బర్త్‌డే విషెస్!

టీమిండియా మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్' MS ధోనీ బర్త్‌డే సందర్భంగా తమిళనాడు Ex CM M.K స్టాలిన్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఫీల్డ్‌లో ఉన్నా లేకపోయినా ధోనీ లీడర్‌షిప్, ఆయన క్రేజ్ మిలియన్ల మందికి ఇన్‌స్పిరేషన్ అని పొగిడారు. ధోనీని మళ్లీ గ్రౌండ్‌లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ధోనీ ఎప్పుడూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్టాలిన్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

హెల్త్ అలర్ట్: ఈ చిన్న సింప్టమ్స్ ని లైట్ తీసుకోకండి!
Health· 7 Jul 2026

హెల్త్ అలర్ట్: ఈ చిన్న సింప్టమ్స్ ని లైట్ తీసుకోకండి!

మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు, కాళ్లు సడన్‌గా పడిపోవడం, చూపు మసకబారడం వంటివి జరిగి కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే దాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది ఫ్యూచర్‌లో వచ్చే పెద్ద స్ట్రోక్‌కి అడ్వాన్స్ వార్నింగ్. బ్రెయిన్‌కి కొద్దిసేపు బ్లడ్ సర్క్యులేషన్ ఆగడం వల్ల ఇది వస్తుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి మరియు 55 ఏళ్లు దాటిన వారికి ఈ రిస్క్ ఎక్కువ. ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్లాలి. డైలీ ఎక్సర్‌సైజ్, హెల్తీ ఫుడ్, రెగ్యులర్ చెకప్స్ ద్వారా దీన్ని నివారించవచ్చు.