← Back to news

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

By sahani· 7 Jul 2026· AP
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో AP హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడైన CI నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు SITకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ విచారణ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్‌గా వీడియో రికార్డింగ్ చేసి కోర్టు ముందు పెట్టాలని ఆదేశించింది. తనకు ప్రాణహాని ఉందంటూ, రాజమండ్రి జైల్లోనే విచారణ జరపాలని నాగరాజు లాయర్ చేసిన రిక్వెస్ట్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ విచారణతో నిందితుడి హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 18h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.