Latest

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు అప్డేట్!
అయోధ్య రామ మందిరంలో రూ. 5 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల విరాళాల దొంగతనం జరిగిందంటూ UP మాజీ మంత్రి పవన్ పాండే చేసిన ఆరోపణలతో జూన్ 7న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన SIT అధికారులు 150 మంది అనుమానితులను గుర్తించగా, 25 మందిపై చర్యలకు సిద్ధమయ్యారు. లవ్ కుష్, అవనీష్, అనుకల్ప్, కరుణే, తిన్ను యాదవ్ అనే ఐదుగురు ప్రధాన నిందితుల సమాచారంతో రూ. 2 కోట్లు రికవరీ చేశారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం కూడా సీజ్ చేశారు. ఓ మహిళా భక్తురాలు మందిరానికి ఇచ్చిన ఆభరణాల మాయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ బిగ్ స్కామ్ వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.

కాక్రోచెస్ నిరసనలపై ఎడ్యుకేషన్ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్!
నీట్ (NEET) నిర్వహణపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ టైమ్ స్పందించారు. స్టూడెంట్స్‌లో భయం పెంచిన రాహుల్ గాంధీ, ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాట్లాడారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే కొందరు ఈరోజు జంతర్‌మంతర్‌లో డప్పు కొడుతూ నిరసనలు చేస్తున్నారు, కానీ 'అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వారిలో ఒక్క స్టూడెంట్ అయినా ఉన్నాడా?' అని CJP ని ఉద్దేశించి ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు

తెలంగాణ అంగన్‌వాడీల్లో భారీ నోటిఫికేషన్!
తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టుల భర్తీకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,100 టీచర్లు, 12,882 సహాయకుల ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. ఈసారి అప్లై చేయడానికి 'ఇంటర్మీడియట్' క్వాలిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే కొత్తగా 10 మార్కులకు ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. లోకల్ వార్డు లేదా గ్రామానికి చెందిన మహిళలకే ఇందులో ఛాన్స్ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులతో పాటు వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఖాళీల పూర్తి వివరాల కోసం మీ జిల్లా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డకు గోల్డ్ రింగ్ ఫ్రీ!
తమిళనాడులో CM విజయ్ గవర్నమెంట్ 'వెట్రి తమిళగం విజన్'లో భాగంగా మేనమామ బంగారు ఉంగరం పథకం అనే స్కీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ కింద తమిళనాడులో ఎలిజిబుల్ ఫ్యామిలీస్‌కి చెందిన మహిళలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అయితే, పుట్టిన ప్రతి బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇస్తారు. జూన్ 22, 2026 తర్వాత పుట్టిన పిల్లలందరూ దీనికి ఎలిజిబుల్. సెప్టెంబర్ 15, 2026న ఈ స్కీమ్‌ను అఫీషియల్‌గా స్టార్ట్ చేయనున్నారు. ఇందుకోసం గవర్నమెంట్ ఏటా రూ.755.83 కోట్లు ఖర్చు చేయనుంది. విజయ్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ గురుంచి మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.
మూడు అడుగుల కోడిని చూశారా!
బ్రెజిల్‌కు చెందిన 'ఇండియో జిగాంటే' అనే కోడి జాతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కోడిగా ఫుల్ ఫేమస్ అయింది. ఈ కోడి సాధారణంగా మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీని కాళ్లు చాలా పొడవుగా, సన్నగా ఉండడం వల్ల చూడటానికి వింతగా అనిపిస్తుంది. దీని గంభీరమైన నడక, రాజసమైన రూపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు నవ్వుతూ దీనికి "KFC ఫైనల్ బాస్!" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?
బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులతో పాటు వారి చిన్న కూతురు సుప్రియ దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో పెద్ద కూతురు శ్వేత, ఆమె బాయ్‌ఫ్రెండ్ కెన్నెత్ కలిసి ఈ హత్యలు చేసినట్లు డౌట్ పడుతున్నారు. శ్వేత చేసిన అప్పులు, కెన్నెత్‌తో కలిసి ఉండడం పేరెంట్స్‌కి నచ్చకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం ముగ్గురిని కత్తితో పొడిచి చంపేసి, ఆ ఇద్దరూ పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ల కోసం వెతుకుతున్నారు.

జగన్‌కు పరామర్శించడానికి కూడా తీరిక లేదా?
AP: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. YS జగన్ YSR CPలో రౌడీలకు, గంజాయ్ బ్యాచ్‌లకు ఇచ్చిన విలువ.. జగన్ కోసం తన పేరును సైతం మార్చుకున్న తన తండ్రికి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. గత 10 రోజులుగా తన తండ్రి ముద్రగడ పద్మనాభం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే.. కనీసం పరామర్శించడానికి కూడా జగన్‌కు తీరిక లేదా? అంటూ ప్రశ్నించారు.
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజు అరెస్ట్
AP: తీవ్ర సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CI నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలను, ఆర్థిక లావాదేవీల కోణాలను రాబట్టేందుకు సిట్ అధికారులు సీఐ నాగరాజును ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ గెస్ట్‌హౌజ్‌కు తరలించారు. సీఐను అరెస్ట్ చేశారనే సమాచారం బయటకు రావడంతో నాగరాజుకు మద్దతుగా ఆయన అభిమానులు, అనుచరులు, స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గుమిగూడారు. దీంతో ఆయన నివాసం వద్ద ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

తండ్రికి ఫోన్ చేసి ప్రాణాలు వదిలిన స్టూడెంట్!💔
లక్నోలో జరిగిన కోచింగ్ సెంటర్ ప్రమాదంలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే. సుఖ్మణి సింగ్ (23) అనే స్టూడెంట్ వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, "డాడీ.. ఇక్కడ మంటలు వచ్చేసాయి, ప్లీజ్ నన్ను కాపాడండి" అని ఏడుస్తూ కాల్ చేశాడు. కానీ, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకునే లోపే ఆ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు ఫోన్ కాల్ గుర్తుచేసుకుంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు.

ఈ చేప ధర వింటే షాక్ !
AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 25కిలోల బరువున్న మగ కచిడి చేప చిక్కడంతో హార్బర్ వద్ద సందడి నెలకొంది. అరుదుగా లభించే ఈ చేపను హార్బర్‌లో వేలం వేయగా, పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2లక్షలకు కొనుగోలు చేశారు. కచిడి చేప పొట్ట భాగాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

చిరుని కలిసిన 'మా ఇంటి బంగారం' టీమ్..
సమంత లీడ్ రోల్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా టీమ్ రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ మూవీ చూసిన చిరు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. జాయింట్ ఫ్యామిలీ స్టోరీకి యాక్షన్, ఎమోషన్స్ కలిపి డైరెక్టర్ నందినీ రెడ్డి సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారని చెప్పారు. ముఖ్యంగా సమంత శారీ కట్టుకుని చేసిన యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయన్నారు. అలాగే లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్న సమంత, రాజ్ కపుల్‌కి చిరు ఆల్ ది బెస్ట్ చెబుతూ కొన్ని ఫొటోలను తన X హ్యాండిల్‌లో షేర్ చేశారు.

మెదక్ జిల్లాలో జంట హత్యలు కలకలం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో ప్రాణ స్నేహితులైన శ్రీధర్, ప్రభు (ప్రభాకర్) మధ్య ఆర్థిక వివాదం, ఆపై కుటుంబ గొడవలు దారుణహత్యలకు దారితీశాయి. ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఒక ఆటోను EMI పద్ధతిలో తీసుకున్నాడు. రెండునెలల EMI బకాయిల విషయంలో వీరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు, పగ తీవ్రరూపం దాల్చాయి. ప్లాన్ ప్రకారం ప్రభు తన ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీధర్‌ను దారుణంగా హతమార్చారు. దీంతో శ్రీధర్ కుటుంబసభ్యులు ప్రభుపై కక్షతో అతని తండ్రి యాదగిరిని హత్యచేశారు.

పాత జ్ఞాపకాలను షేర్ చేసిన పవన్ కళ్యాణ్!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఓల్డ్ ఫొటోపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు చనిపోయినప్పుడు. బహుజన నేత అగస్టిన్, విప్లవ గాయకుడు గద్దర్ గారు తమ ఇంటికి వచ్చినప్పటి జ్ఞాపకం ఇదని చెప్పారు. ఇది ప్రజారాజ్యం పార్టీ (PRP) పెట్టకముందు నాటి ఫొటో అని. ఆ రోజుల్లో తామంతా కలిసి తెలంగాణ ఉద్యమం, 'సామాజిక తెలంగాణ', బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయంపై ఎన్నో చర్చలు జరిపేవారమంటూ పవన్ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.
అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన CM విజయ్! వీడియో వైరల్!
తమిళనాడు అసెంబ్లీ సెషన్స్‌లో CM విజయ్‌కి సంబంధించిన ఒక క్రేజీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. CM విజయ్ తన స్పీచ్ క్లోస్ చేసేటప్పుడు. మాజీ CM, DMK అధినేత స్టాలిన్ గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చేసిన చేతి సైగ ను సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి!

మోదీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రి రిజైన్! రీజన్ ఏంటంటే?
మోదీ క్యాబినెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి (Union Minister of State) జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడం, రీసెంట్ ఎలక్షన్స్‌లో BJP ఆయనకు మళ్లీ సీటు ఇవ్వకపోవడమే దీనికి కారణం. ప్రధాని మోదీ సలహాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రాజీనామాను వెంటనే ఆమోదించారు. క్యాబినెట్‌లో ఏకైక క్రిస్టియన్ ఫేస్ అయిన కురియన్ మినిస్టర్ పదవితో పాటు ఫిషరీస్ (చేపల పెంపకం) డిపార్ట్‌మెంట్‌ని కూడా చూసుకునేవారు.
పెద్దాయన కల నెరవేర్చిన సీఎం
AP: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం కామదేను లంక గ్రామానికి చెందిన వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ(96)కు CM చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు సిద్ధాంతం సభలో స్వయంగా సత్యనారాయణను కలిసి నీకు ఏం కావాలని అడగగా తనకు ఇల్లు, గ్రామంలో డ్రైనేజీ సమస్యతో పాటు రహదారులు సరిగా లేవని తెలిపాడు. దీంతో సత్యానారాయణకు ఇల్లుతోపాటు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
TG: మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో వేలాది మంది రైతులు ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వేముల ప్రశాంత్ రెడ్డి బయల్దేరగా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను పోలీసులు ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు.
4th Day ప్రొటెస్ట్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే?
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు సక్సెస్‌ఫుల్‌గా 4వ రోజుకు చేరాయి. అయితే జూన్ 23 అర్ధరాత్రి 1 గంటకు ప్రొటెస్ట్ ఏరియాను తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు బారికేడ్లను జరపాలని చూశారు. ఒక ట్రక్కును కూడా లోపలికి తెచ్చేందుకు ట్రై చేశారు. కానీ అలర్ట్ అయిన కాక్రోచెస్ వెంటనే పోలీసుల ప్లాన్‌ను అడ్డుకున్నారు. అర్ధరాత్రి అయినా సరే తగ్గకుండా వాళ్లు సిస్టమ్‌తో ఫైట్ చేస్తున్నారు.

బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ
TG: నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతీ ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న మహంకాళి గుడిలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దొంగలు ఆలయ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోని అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్, CCTV ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణంలో గట్టి నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చోరీకి ముందు ఆలయంలోని CC కెమెరాలకు వస్త్రాలు కప్పినట్లు పోలీసులు గుర్తించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,45,910 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,750 గా ఉంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి!

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్
AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌పై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ స్పందించారు. ఇద్దరు కార్మికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని సంస్థల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.