Latest

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజు అరెస్ట్▶
AP· 23 Jun 2026

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజు అరెస్ట్

AP: తీవ్ర సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CI నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలను, ఆర్థిక లావాదేవీల కోణాలను రాబట్టేందుకు సిట్ అధికారులు సీఐ నాగరాజును ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ గెస్ట్‌హౌజ్‌కు తరలించారు. సీఐను అరెస్ట్ చేశారనే సమాచారం బయటకు రావడంతో నాగరాజుకు మద్దతుగా ఆయన అభిమానులు, అనుచరులు, స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గుమిగూడారు. దీంతో ఆయన నివాసం వద్ద ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

తండ్రికి ఫోన్ చేసి ప్రాణాలు వదిలిన స్టూడెంట్!💔
News· 23 Jun 2026

తండ్రికి ఫోన్ చేసి ప్రాణాలు వదిలిన స్టూడెంట్!💔

లక్నోలో జరిగిన కోచింగ్ సెంటర్‌ ప్రమాదంలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే. సుఖ్మణి సింగ్ (23) అనే స్టూడెంట్ వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, "డాడీ.. ఇక్కడ మంటలు వచ్చేసాయి, ప్లీజ్ నన్ను కాపాడండి" అని ఏడుస్తూ కాల్ చేశాడు. కానీ, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకునే లోపే ఆ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు ఫోన్ కాల్ గుర్తుచేసుకుంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు.

ఈ చేప ధర వింటే షాక్ !
AP· 23 Jun 2026

ఈ చేప ధర వింటే షాక్ !

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 25కిలోల బరువున్న మగ కచిడి చేప చిక్కడంతో హార్బర్ వద్ద సందడి నెలకొంది. అరుదుగా లభించే ఈ చేపను హార్బర్‌లో వేలం వేయగా, పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2లక్షలకు కొనుగోలు చేశారు. కచిడి చేప పొట్ట భాగాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

చిరుని కలిసిన 'మా ఇంటి బంగారం' టీమ్..
Cinema· 23 Jun 2026

చిరుని కలిసిన 'మా ఇంటి బంగారం' టీమ్..

సమంత లీడ్ రోల్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా టీమ్ రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ మూవీ చూసిన చిరు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. జాయింట్ ఫ్యామిలీ స్టోరీకి యాక్షన్, ఎమోషన్స్ కలిపి డైరెక్టర్ నందినీ రెడ్డి సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారని చెప్పారు. ముఖ్యంగా సమంత శారీ కట్టుకుని చేసిన యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయన్నారు. అలాగే లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్న సమంత, రాజ్ కపుల్‌కి చిరు ఆల్‌ ది బెస్ట్ చెబుతూ కొన్ని ఫొటోలను తన X హ్యాండిల్‌లో షేర్ చేశారు.

మెదక్ జిల్లాలో జంట హత్యలు కలకలం
Politics· 23 Jun 2026

మెదక్ జిల్లాలో జంట హత్యలు కలకలం

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో ప్రాణ స్నేహితులైన శ్రీధర్, ప్రభు (ప్రభాకర్) మధ్య ఆర్థిక వివాదం, ఆపై కుటుంబ గొడవలు దారుణహత్యలకు దారితీశాయి. ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఒక ఆటోను EMI పద్ధతిలో తీసుకున్నాడు. రెండునెలల EMI బకాయిల విషయంలో వీరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు, పగ తీవ్రరూపం దాల్చాయి. ప్లాన్ ప్రకారం ప్రభు తన ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీధర్‌ను దారుణంగా హతమార్చారు. దీంతో శ్రీధర్ కుటుంబసభ్యులు ప్రభుపై కక్షతో అతని తండ్రి యాదగిరిని హత్యచేశారు.

పాత జ్ఞాపకాలను షేర్ చేసిన పవన్ కళ్యాణ్!
Politics· 23 Jun 2026

పాత జ్ఞాపకాలను షేర్ చేసిన పవన్ కళ్యాణ్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఓల్డ్ ఫొటోపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు చనిపోయినప్పుడు. బహుజన నేత అగస్టిన్, విప్లవ గాయకుడు గద్దర్ గారు తమ ఇంటికి వచ్చినప్పటి జ్ఞాపకం ఇదని చెప్పారు. ఇది ప్రజారాజ్యం పార్టీ (PRP) పెట్టకముందు నాటి ఫొటో అని. ఆ రోజుల్లో తామంతా కలిసి తెలంగాణ ఉద్యమం, 'సామాజిక తెలంగాణ', బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయంపై ఎన్నో చర్చలు జరిపేవారమంటూ పవన్ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.

అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన CM విజయ్! వీడియో వైరల్!▶
Politics· 23 Jun 2026

అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన CM విజయ్! వీడియో వైరల్!

తమిళనాడు అసెంబ్లీ సెషన్స్‌లో CM విజయ్‌కి సంబంధించిన ఒక క్రేజీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతోంది. CM విజయ్ తన స్పీచ్ క్లోస్ చేసేటప్పుడు. మాజీ CM, DMK అధినేత స్టాలిన్ గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చేసిన చేతి సైగ ను సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి!

మోదీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రి రిజైన్! రీజన్ ఏంటంటే?
Politics· 23 Jun 2026

మోదీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రి రిజైన్! రీజన్ ఏంటంటే?

మోదీ క్యాబినెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి (Union Minister of State) జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడం, రీసెంట్ ఎలక్షన్స్‌లో BJP ఆయనకు మళ్లీ సీటు ఇవ్వకపోవడమే దీనికి కారణం. ప్రధాని మోదీ సలహాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రాజీనామాను వెంటనే ఆమోదించారు. క్యాబినెట్‌లో ఏకైక క్రిస్టియన్ ఫేస్ అయిన కురియన్ మినిస్టర్ పదవితో పాటు ఫిషరీస్ (చేపల పెంపకం) డిపార్ట్‌మెంట్‌ని కూడా చూసుకునేవారు.

పెద్దాయన కల నెరవేర్చిన సీఎం▶
AP· 23 Jun 2026

పెద్దాయన కల నెరవేర్చిన సీఎం

AP: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం కామదేను లంక గ్రామానికి చెందిన వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ(96)కు CM చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు సిద్ధాంతం సభలో స్వయంగా సత్యనారాయణను కలిసి నీకు ఏం కావాలని అడగగా తనకు ఇల్లు, గ్రామంలో డ్రైనేజీ సమస్యతో పాటు రహదారులు సరిగా లేవని తెలిపాడు. దీంతో సత్యానారాయణకు ఇల్లుతోపాటు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
Politics· 23 Jun 2026

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

TG: మాజీ మంత్రి, బాల్కొండ MLA వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు నిర్బంధించారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలంలో వేలాది మంది రైతులు ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు వేముల ప్రశాంత్ రెడ్డి బయల్దేరగా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన్ను పోలీసులు ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు.

4th Day ప్రొటెస్ట్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే?▶
Education· 23 Jun 2026

4th Day ప్రొటెస్ట్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే?

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు సక్సెస్‌ఫుల్‌గా 4వ రోజుకు చేరాయి. అయితే జూన్ 23 అర్ధరాత్రి 1 గంటకు ప్రొటెస్ట్ ఏరియాను తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు బారికేడ్లను జరపాలని చూశారు. ఒక ట్రక్కును కూడా లోపలికి తెచ్చేందుకు ట్రై చేశారు. కానీ అలర్ట్ అయిన కాక్రోచెస్ వెంటనే పోలీసుల ప్లాన్‌ను అడ్డుకున్నారు. అర్ధరాత్రి అయినా సరే తగ్గకుండా వాళ్లు సిస్టమ్‌తో ఫైట్ చేస్తున్నారు.

బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ
Crime· 23 Jun 2026

బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ

TG: నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతీ ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న మహంకాళి గుడిలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దొంగలు ఆలయ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోని అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీమ్స్, CCTV ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణంలో గట్టి నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చోరీకి ముందు ఆలయంలోని CC కెమెరాలకు వస్త్రాలు కప్పినట్లు పోలీసులు గుర్తించారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
Politics· 23 Jun 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు!

గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్! ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,45,910 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,33,750 గా ఉంది. బంగారం కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి!

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్
AP· 23 Jun 2026

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: పవన్

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌పై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ స్పందించారు. ఇద్దరు కార్మికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని అధికారులకు ఆయన సూచించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని సంస్థల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఒక్క స్కూల్‌కు రెండు పేర్లు
TG· 23 Jun 2026

ఒక్క స్కూల్‌కు రెండు పేర్లు

TG: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో ఏకశిల స్కూల్ వ్యవహారంలో MEO శ్రీనివాస్ స్పందన విమర్శలకు దారితీస్తోంది. పాఠశాల పేరు మార్పు, అనుమతులు, అడ్మిషన్లపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ యాజమాన్యం పేరు మార్పు కోసం దరఖాస్తు చేయగా ఫైల్ RJD వద్ద పెండింగ్‌లో ఉంది. అనుమతి వస్తుందని MEO చెప్పడం, మరోవైపు స్కూల్ కార్యకలాపాలు 'ఏకశిల అడ్వాన్స్‌డ్ లెర్నింగ్ స్కూల్' పేరుతో సాగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్కూల్ బోర్డులు, యూనిఫాంలు, బస్సులు అన్నీ ఏకశిల పేరుతో ఉండగా, అధికారికంగా మాత్రం సెయింట్ జోసెఫ్ పేరుతోనే అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CC ఫుటేజ్ మాయం
AP· 23 Jun 2026

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CC ఫుటేజ్ మాయం

AP: సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు కీలకమైన విషయాన్ని గుర్తించారు. కేసులో CCTV ఫుటేజ్‌ మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణ మిస్సింగ్ ఉదంతంలో నిజానిజాలు రాబట్టేందుకు CCTV విజువల్స్ ఎంతో కీలకంగా మారాయి. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు (నెల రోజుల పాటు) ఉన్న పూర్తి సీసీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. నెలరోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట, కేవలం రెండురోజుల ఫుటేజ్‌ మాత్రమే ఉంచి, మిగతాదంతా డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

బొలెరో టైర్ పేలి ముగ్గురు స్పాట్‌డెడ్
Crime· 23 Jun 2026

బొలెరో టైర్ పేలి ముగ్గురు స్పాట్‌డెడ్

AP: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామం నుంచి గుంటూరు జిల్లాకు రెడీమేడ్ ప్రహరీ గోడలు తీసుకొని వెళ్లుతున్న బొలెరో వాహనం టైర్ పేలింది. రంగంపేట మండలం వడిశలేరు ADB రోడ్డు వద్ద బొలెరో వెనక టైర్ పేలడంతో వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు కాగా పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు మురమళ్ళ రాజు, తాతపూడి రాజేష్, మసకపల్లి బాలుగా గుర్తించారు.

చంద్రబాబుకు BP డౌన్ కాగానే, పవన్‌కు BP పెరుగుతోంది
Politics· 23 Jun 2026

చంద్రబాబుకు BP డౌన్ కాగానే, పవన్‌కు BP పెరుగుతోంది

AP: పవన్ కళ్యాణ్ డిప్యూటీ CM హోదాలో ఉండి YSRCP నేతలను గూండాలతో పోల్చటం సిగ్గుచేటు అని వైఎస్సాఆర్ సీపీ నేత TJR సుధాకర్ ఫైరయ్యారు. YSRCP ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని తొక్కి నార తీస్తా అనటం ఏంటి?. ప్లేస్, టైం చెబితే మేమే వస్తాం.. నార తీయండి చూస్తామని సవాల్ విసిరారు. CM చంద్రబాబుకు బీపీ డౌన్ కాగానే, పవన్ కళ్యాణ్‌కు BP పెరుగుతోందన్నారు. సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని అతని తల్లి చేసిన రోదనలు వినపడలేదా పవన్ అంటూ TJR నిలదీశారు. ఆ తల్లికి మద్దతుగా YS జగన్ నిలబడ్డారన్నారు.

ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !
Education· 23 Jun 2026

ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !

AP: తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన తుపాకుల మణికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలనకు YSR కడప జిల్లా ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు వెళ్తుండగా దారిలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మణి కాళ్లకు గాయాలయ్యాయి. హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్నా ప్రవేశపత్రం పొందాలని ఆటోలోనే క్యాంపస్‌కు చేరుకుంది. క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్ స్వయంగా ఆటో వద్దకు వచ్చి ఆమెకు ప్రవేశపత్రం అందించారు.

నగరంలో అర్ధరాత్రి కుండపోత వర్షం
TG· 23 Jun 2026

నగరంలో అర్ధరాత్రి కుండపోత వర్షం

హైదరాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ కుండపోత వానకు నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్పురా, BHEL, పటాన్చెరు, మియాపూర్‌లో వాన కురిసింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి
Crime· 23 Jun 2026

మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి

AP: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేటకోటూరుకు చెందిన దామోదరం(35), నిర్మల(28)లకు దిలీప్(12), శ్రీవిద్య(10) సంతానం. నిర్మల బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతుంది. అప్పటికే అప్పులు పెరిగిపోయాయి. CMRF నుంచి రూ. లక్ష వచ్చినా సరిపోలేదు. ఇటీవల చెన్నైలోని ఓ హాస్పిటల్‌కు వెళ్లగా రూ.7లక్షలు ఖర్చవుతుందని, అయినా కోలుకుంటారనే నమ్మకంలేదని డాక్టర్స్ చెప్పారు. దీంతో భార్యాభర్తలు కుంగిపోయారు. ఇద్దరు చిన్నారులకు నిర్మల విషం తాగించి తర్వాత తానూ తాగింది. దామోదరం ఉరేసుకున్నాడు. అంత్యక్రియలకు తమ డబ్బులే వినియోగించాలని కాగితంపై రాసి పెట్టారు.