Latest

నేరస్థులను తయారు చేసే కర్మాగారం YCP: మంత్రి నిమ్మల
AP: నేరస్థులను తయారు చేసే కర్మాగారం YCP అని, నేతలను తయారు చేసే పార్టీ TDP అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు ద్రోహం చేసింది, చేస్తుంది YS జగన్మోహన్ రెడ్డేనని, కేంద్రం EWS కింద 10% రిజర్వేషన్లు ఇస్తే గత TDP ప్రభుత్వంలో చంద్రబాబు ఎవరికీ ఇబ్బంది లేనివిధంగా అందులో 5% కాపులకు కేటాయించారు. జగన్ CM అయ్యాక వాటిని రద్దు చేశారు. YCPలో కాపు నాయకులు అప్పుడు ఎందుకు ఆయన్ను నిలదీయలేదన్నారు. ఏ చెంపదెబ్బలు తినాల్సి వస్తుందోనని భయపడ్డారు అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.

బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం
హైదరాబాద్‌లోని పేదలకు ఖరీదైన వైద్యం ఇక ఉచితం కానుంది. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను పాలీ క్లినిక్‌లుగా మారుస్తూ ఈ డిసెషన్ తీసుకుంది. వీటికి ‘ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్’ అనే పేరు పెట్టింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిలో ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల నిపుణులతో బస్తీల్లోనే సేవలందించనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

సీఎం విజయ్ బర్త్ డే కు త్రిష ఎమోషనల్ విషెస్ !
నటి త్రిషకు, తమిళనటుడు, సీఎం విజయ్ కు మధ్య బ్రేకప్ అయిందన్న రూమర్లకు త్రిష ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టారు. సీఎం విజయ్ పుట్టిన రోజైన 22న కాకుండా మరుసటి రోజున ఆమె ఆయనకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టారు. అత్యంత విలువైన వ్యక్తికి హ్యాపీ బర్త్ డే అంటూ హార్ట్ సింబల్ గుర్తులతో మెసేజ్ చేశారు. ఆ క్యాప్షన్ వెంటే విజయ్ తనతో ఇంటిమేట్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో విజయ్ కేక్ వంక చూస్తుండగా త్రిష విజయ్ వంక చూస్తున్నట్లుగా ఉంది. ఈ ఒక్క బర్త్ డే మెసేజ్ తో వీరిద్దరికి మధ్య బ్రేకప్ అయిందన్న వార్తలకు చెక్ చెప్పినట్లయింది.

కీలక ప్రాజెక్టులకు AP కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు AP కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.30,353 కోట్ల పెట్టుబడితో 34,610 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. C-డాట్, ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ AI ఇండియా, ప్రూగల్ AI హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
హైదరాబాద్ లో మరో పోలీస్ అధికారి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకీ దొరికిపోయాడు..! సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరసింహ అవినీతికి పాల్పడ్డాడు..! ఒక కేసులో నిందితుడికి బెయిల్ ఒప్పించడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు..! అయితే అంత ఇచ్చుకోలేనని కాస్త తగ్గించాలని కోరినప్పటికీ నరసింహ ససేమిరా అన్నాడు..! దీంతో ముందుగా రూ. యాబై వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది..! అప్పటికే అతన్ని ఏసీబీకి పట్టించాలని డిసైడ్ అయిన నిందితుడి తరపువాళ్ళు ముందస్తు సమాచారంతో పక్కాగా ట్రాప్ చేసి పట్టుకున్నారు.

నటుడు ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
నటుడు ప్రకాశ్ రాజ్ కు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులున్నాయన్న ఆరోపణల కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019లో దిలీప్ కుమార్ అనే లాయర్ ప్రకాశ్ రాజ్ కు నాలుగు ఓటర్ ఐడీ కార్డులున్నాయని కేసు పెట్టారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఏపీలలో ఓటు హక్కు ఉందని ఆయన ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై బెంగళూరు మున్సిపాలిటీకి కూడా కంప్లయింట్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆ లాయర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనేక మార్లు విచారణకు రావాలని పిలిచినా ప్రకాశ్ రాజ్ స్పందించలేదు. దాంతో బెంగళూరు హై కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
శ్రీశైలం హైవేపై దారుణం.. 3 పరిస్థితి సీరియస్!
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం మెయిన్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ జీపు కంట్రోల్ తప్పి ఏకంగా 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. అమ్రాబాద్ నుండి గవర్నమెంట్ టీచర్స్, చిన్నపిల్లలతో అచ్చంపేట వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ప్రస్తుతం బాధితులందరినీ ట్రీట్‌మెంట్ కోసం అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ యాక్సిడెంట్ న్యూస్ లోకల్‌గా తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో దారుణం.. కాబోయే భర్తను చంపేసిన యువతి!
పుణెలో జరిగిన కేతన్ విశాల్ డెత్ కేస్‌లో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. కొండ పైన ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తూ కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని అంతా అనుకున్నారు. కానీ, ఇదొక ప్లాన్డ్ మర్డర్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కేతన్ కాబోయే భార్య, తన లవర్ చేతన్ చౌదరితో కలిసి ఈ మర్డర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు చేస్తున్నారు. ఈ ఇయర్ నవంబర్‌లో వీరికి జైపూర్‌లో గ్రాండ్ గా వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇంతలోనే లవర్‌తో కలిసి కాబోయే భర్తను కొండపై నుండి నెట్టేసింది.
మురళీ మోహన్‌కు ‘పద్మశ్రీ’.. టాలీవుడ్‌లో ప్రౌడ్ మూమెంట్!
ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. మూవీ ఇండస్ట్రి లో ఆయన అందించిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రెజెంట్ చేసింది. నటుడిగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేయడమే కాకుండా, ప్రొడ్యూసర్‌గానూ టాలీవుడ్‌లో మురళీ మోహన్ తనదైన మార్క్ క్రియేట్ చేశారు. ఈ వండర్‌ఫుల్ ఆనర్ దక్కడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా హార్ట్‌ఫుల్ కంగ్రాట్స్ చెప్తున్నారు.
యాక్టర్ మాధవన్‌కు 'పద్మశ్రీ' అవార్డు!
వర్సటైల్ యాక్టర్ మాధవన్‌కు రేర్ హానర్ దక్కింది. ఇండియన్ సినిమాలో ఆయన అందించిన వండర్‌ఫుల్ కాంట్రిబ్యూషన్‌కు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులమీదుగా మాధవన్ ఈ అవార్డు అందుకున్నారు. లవర్ బాయ్‌గా, విలన్‌గా, డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసిన మాధవన్‌కు ఈ హానర్ దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు!
ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రేర్ హానర్ దక్కింది. దేశంలోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ‘పద్మశ్రీ’ని ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అఫీషియల్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రోహిత్‌కు ఈ అవార్డును ప్రెజెంట్ చేశారు. క్రికెట్‌లో రోహిత్ క్రియేట్ చేసిన రికార్డ్స్ కి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ ప్రౌడ్ మూమెంట్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు.
మమ్ముట్టికి 'పద్మభూషణ్'.. రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు!
మలయాళం సూపర్ స్టార్, ఇండియన్ సినిమా లెజెండ్ మమ్ముట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే థర్డ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ‘పద్మభూషణ్’ను ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులమీదుగా మమ్ముట్టి ఈ అవార్డు తీసుకున్నారు. 5 దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా మూవీస్ చేసి ఆడియన్స్‌ను మెప్పించినందుకు ఈ హానర్ దక్కింది. ఈ స్పెషల్ మూమెంట్‌లో మమ్ముట్టితో పాటు ఆయన వైఫ్, కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. మమ్ముట్టి కి ఈ ఆనర్ దక్కడం ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు అప్డేట్!
అయోధ్య రామ మందిరంలో రూ. 5 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల విరాళాల దొంగతనం జరిగిందంటూ UP మాజీ మంత్రి పవన్ పాండే చేసిన ఆరోపణలతో జూన్ 7న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన SIT అధికారులు 150 మంది అనుమానితులను గుర్తించగా, 25 మందిపై చర్యలకు సిద్ధమయ్యారు. లవ్ కుష్, అవనీష్, అనుకల్ప్, కరుణే, తిన్ను యాదవ్ అనే ఐదుగురు ప్రధాన నిందితుల సమాచారంతో రూ. 2 కోట్లు రికవరీ చేశారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం కూడా సీజ్ చేశారు. ఓ మహిళా భక్తురాలు మందిరానికి ఇచ్చిన ఆభరణాల మాయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ బిగ్ స్కామ్ వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.

కాక్రోచెస్ నిరసనలపై ఎడ్యుకేషన్ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్!
నీట్ (NEET) నిర్వహణపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ టైమ్ స్పందించారు. స్టూడెంట్స్‌లో భయం పెంచిన రాహుల్ గాంధీ, ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాట్లాడారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే కొందరు ఈరోజు జంతర్‌మంతర్‌లో డప్పు కొడుతూ నిరసనలు చేస్తున్నారు, కానీ 'అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వారిలో ఒక్క స్టూడెంట్ అయినా ఉన్నాడా?' అని CJP ని ఉద్దేశించి ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు

తెలంగాణ అంగన్‌వాడీల్లో భారీ నోటిఫికేషన్!
తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టుల భర్తీకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,100 టీచర్లు, 12,882 సహాయకుల ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. ఈసారి అప్లై చేయడానికి 'ఇంటర్మీడియట్' క్వాలిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే కొత్తగా 10 మార్కులకు ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. లోకల్ వార్డు లేదా గ్రామానికి చెందిన మహిళలకే ఇందులో ఛాన్స్ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులతో పాటు వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఖాళీల పూర్తి వివరాల కోసం మీ జిల్లా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డకు గోల్డ్ రింగ్ ఫ్రీ!
తమిళనాడులో CM విజయ్ గవర్నమెంట్ 'వెట్రి తమిళగం విజన్'లో భాగంగా మేనమామ బంగారు ఉంగరం పథకం అనే స్కీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ కింద తమిళనాడులో ఎలిజిబుల్ ఫ్యామిలీస్‌కి చెందిన మహిళలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అయితే, పుట్టిన ప్రతి బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇస్తారు. జూన్ 22, 2026 తర్వాత పుట్టిన పిల్లలందరూ దీనికి ఎలిజిబుల్. సెప్టెంబర్ 15, 2026న ఈ స్కీమ్‌ను అఫీషియల్‌గా స్టార్ట్ చేయనున్నారు. ఇందుకోసం గవర్నమెంట్ ఏటా రూ.755.83 కోట్లు ఖర్చు చేయనుంది. విజయ్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ గురుంచి మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.
మూడు అడుగుల కోడిని చూశారా!
బ్రెజిల్‌కు చెందిన 'ఇండియో జిగాంటే' అనే కోడి జాతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కోడిగా ఫుల్ ఫేమస్ అయింది. ఈ కోడి సాధారణంగా మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీని కాళ్లు చాలా పొడవుగా, సన్నగా ఉండడం వల్ల చూడటానికి వింతగా అనిపిస్తుంది. దీని గంభీరమైన నడక, రాజసమైన రూపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు నవ్వుతూ దీనికి "KFC ఫైనల్ బాస్!" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?
బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులతో పాటు వారి చిన్న కూతురు సుప్రియ దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో పెద్ద కూతురు శ్వేత, ఆమె బాయ్‌ఫ్రెండ్ కెన్నెత్ కలిసి ఈ హత్యలు చేసినట్లు డౌట్ పడుతున్నారు. శ్వేత చేసిన అప్పులు, కెన్నెత్‌తో కలిసి ఉండడం పేరెంట్స్‌కి నచ్చకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం ముగ్గురిని కత్తితో పొడిచి చంపేసి, ఆ ఇద్దరూ పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ల కోసం వెతుకుతున్నారు.

జగన్‌కు పరామర్శించడానికి కూడా తీరిక లేదా?
AP: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. YS జగన్ YSR CPలో రౌడీలకు, గంజాయ్ బ్యాచ్‌లకు ఇచ్చిన విలువ.. జగన్ కోసం తన పేరును సైతం మార్చుకున్న తన తండ్రికి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. గత 10 రోజులుగా తన తండ్రి ముద్రగడ పద్మనాభం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే.. కనీసం పరామర్శించడానికి కూడా జగన్‌కు తీరిక లేదా? అంటూ ప్రశ్నించారు.
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజు అరెస్ట్
AP: తీవ్ర సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CI నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలను, ఆర్థిక లావాదేవీల కోణాలను రాబట్టేందుకు సిట్ అధికారులు సీఐ నాగరాజును ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ గెస్ట్‌హౌజ్‌కు తరలించారు. సీఐను అరెస్ట్ చేశారనే సమాచారం బయటకు రావడంతో నాగరాజుకు మద్దతుగా ఆయన అభిమానులు, అనుచరులు, స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గుమిగూడారు. దీంతో ఆయన నివాసం వద్ద ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

తండ్రికి ఫోన్ చేసి ప్రాణాలు వదిలిన స్టూడెంట్!💔
లక్నోలో జరిగిన కోచింగ్ సెంటర్ ప్రమాదంలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే. సుఖ్మణి సింగ్ (23) అనే స్టూడెంట్ వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, "డాడీ.. ఇక్కడ మంటలు వచ్చేసాయి, ప్లీజ్ నన్ను కాపాడండి" అని ఏడుస్తూ కాల్ చేశాడు. కానీ, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకునే లోపే ఆ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు ఫోన్ కాల్ గుర్తుచేసుకుంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు.