← Back to news

బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ

By డీకే· 23 Jun 2026· Samayam· నిర్మల్ జిల్లా
బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ

TG: నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతీ ఆలయ పైఅంతస్తులో కొలువై ఉన్న మహంకాళి గుడిలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దొంగలు ఆలయ తాళాలు పగులగొట్టి గర్భగుడిలోని అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు డాగ్ స్క్వాడ్‌, క్లూస్ టీమ్స్, CCTV ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణంలో గట్టి నిఘా ఉన్నప్పటికీ చోరీ జరగడం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చోరీకి ముందు ఆలయంలోని CC కెమెరాలకు వస్త్రాలు కప్పినట్లు పోలీసులు గుర్తించారు.

బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ
బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 22h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.