Latest

ఆలయ సిబ్బందిని అయోధ్య వీడి వెళ్లొద్దని సిట్ ఆదేశాలు
అయోధ్య రామాలయంలో రూ.200 కోట్ల భక్తుల విరాళాల మాయం కేసులో ఆలయ సిబ్బంది అయోధ్యను వీడి వెళ్లరాదని సిట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.ట్రస్ట్ అధికారులు, ఇతర సిబ్బందిని విచారించిన నివేదికను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నందున ఎవరూ నగరం దాటి వెళ్లొద్దంది. రోజు వారీ నివేదికను సీఎం కార్యాలయానికి కూడా పంపుతున్నారు. ఆలయంలో నిఘా వ్యవస్థను,భద్రతా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆలయ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలాలలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

కొత్త మూవీకి అనిల్ రావిపూడి కత్తి పబ్లిసిటీ !
పబ్లిసిటీ ప్రమోషన్ లో డైరక్టర్ అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఇంకా కొత్త మూవీ మొదలు పెట్టకుండానే దానికి తనదైన శైలిలో పబ్లిసిటీ మొదలు పెట్టారు. ఆ కొత్త మూవీలో హీరోలయిన వెంకటేశ్, కల్యాణ్ రామ్ లతో తన రక్తాన్నే వీరతిలకం దిద్దినట్లుగా పబ్లిసిటీ హంగామా చేశారు. గతంలో మ్యూజిక్ డైరక్టర్, లిరిక్ రైటర్లను ఇసుకలో పాతిపెట్టినట్లు పబ్లిసిటీ కల్పించిన అనిల్ ఈ సారి ఏకంగా తన వేలు కోసుకుని వీరతిలకం దిద్దుకున్నట్లుగా పబ్లిసిటీ ప్రమోషన్ చేశారు. ఈ పబ్లిసిటీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

భాగ్యశ్రీ బోర్సే రిలేషన్ షిప్ కన్ ఫర్మ్? ఎవరా హీరో?
నటి భాగ్యశ్రీ బోర్సే లవ్ లో పడ్డారా? ఆమె రీసెంట్ కామెంట్స్ చూస్తే అలాగే అనిపిస్తోంది. హీరో రామ్ పోతినేనితో ఆమె రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్లు గుప్పు మంటున్న టైమ్ లో హైదరాబాద్ తన సెకండ్ హోమ్ లాంటిదని, తనకీ ఇక్కడొక ఇల్లుందని భాగ్యశ్రీ ప్రకటించింది. ఇటీవల ఒక చాట్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీని సుమ ఆట పట్టిస్తూ అందరూ హైదరాబాద్ లోనే సెటిల్ అవుతున్నారు.. మీరు కూడా అంతేనా అన్న ప్రశ్నకు ఆమె నవ్వుతూ సటిల్ గా రిప్లయ్ ఇచ్చింది. దాంతో రూమర్ దాదాపు కన్ఫర్మ్ అయిందనే అనుకోవాలేమో.

అయోధ్య దొంగల చేతిలో బందీ అయిందంటున్న మాజీ కరసేవక్ !
అయోధ్య రామాలయంలో భక్తులు సమర్పించిన దాదాపు ₹200 కోట్లకు పైగా విరాళాలు, బంగారు ఆభరణాలు పక్కదారి పట్టాయని 1980ల నాటి మాజీ కర సేవక్ సంతోష్ దూబే అయోధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్, మరికొందరు సిబ్బంది కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, "అయోధ్య ఎప్పటికీ దొంగల చేతుల్లోనే ఉండిపోతుందేమో" అని ఆందోళన వ్యక్తం చేశారు.యూపీ ప్రభుత్వం ఈ ఆరోపణలపై దర్యాప్తునకు SIT (ప్రత్యేక విచారణ బృందం) ను ఏర్పాటు చేసింది.

తమిళనాడు సీఫుడ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్: ఏడుగురు మృతి
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళెం సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి ఫ్యాక్టరీలో ఆదివారం భారీగా అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

టెన్నిస్ రారాజు రాఫెల్ నాదల్ పెయిన్ ఫుల్ స్టోరీ ఇదే !
టెన్నిస్ కోర్టులో రాఫెల్ నాదల్ అద్భుతమైన ఆటతీరు (Perfection) వెనుక ఎవరూ ఊహించని కష్టం దాగుంది. కెరీర్ పొడుగునా 'ముల్లర్-వైస్ సిండ్రోమ్' అనే అరుదైన పాదాల నొప్పితో ఆయన నరకం చూశారు. ఇంజెక్షన్స్ చేసుకుంటూ, శరీరం సహకరించకపోయినా ప్రతికూలతలను దాటుకుని (Around the edges) పోరాడారు. రికార్డుల కంటే, తీవ్రమైన నొప్పిని భరిస్తూ ఆయన చూపిన పట్టుదలే నాదల్‌ను నిజమైన టెన్నిస్ వీరుడిగా నిలబెట్టింది.

డాటర్స్ లో కాన్ఫిడెన్స్ నింపుతున్న ఫ్రెండ్లీ డాడ్స్ !
రుతుస్రావం (Periods), ప్యాడ్ల వాడకం, అలాగే కౌమారదశలో వచ్చే శారీరక, మానసిక మార్పుల (Lads & Issues) గురించి మాట్లాడటానికి చాలామంది తండ్రులు సంకోచిస్తారు. కానీ, ఈ కాలపు తండ్రులు ఆ పాత పద్ధతులను బద్దలు కొడుతున్నారు. తమ కూతుళ్లకు ప్యాడ్లు కొనివ్వడం దగ్గర నుండి, వారి ప్రేమ, స్నేహ సంబంధాల వరకు ప్రతి విషయంలోనూ స్నేహితుడిలా మద్దతుగా నిలుస్తున్నారు. నాన్నల ఈ కొత్త తరం ఆలోచనా విధానం కూతుళ్లలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.

ఏఐ (AI) ఫ్యూచర్ అంతా స్పేస్ లోనే- ఎలన్ మస్క్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు భూమిపై కాకుండా అంతరిక్షంలోనే ఉంటుందని ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిపై స్థలం, విద్యుత్, మౌలిక వసతుల కొరత కారణంగా భవిష్యత్తులో ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు పరిమితులు ఏర్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే స్పేస్‌ఎక్స్ (SpaceX) ద్వారా చంద్రునిపై లేదా అంతరిక్షంలో 'ఆర్బిటల్ డేటా సెంటర్లను' (AI ఉపగ్రహాలను) ఏర్పాటు చేసి, ఏఐ సామర్థ్యాన్ని వేల రెట్లు పెంచవచ్చని మస్క్ సరికొత్త విజన్‌ను పంచుకున్నారు.

పోలీస్ జాబ్ కోసం స్విగ్గీ డెలివరీ చేస్తున్న లేడీ
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువతి. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కావాలనే కలను నిజం చేసుకోవడానికి ముంబై వీధుల్లో స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తోంది. పగలు ఎండనక, వాననక డెలివరీలు చేస్తూ.. రాత్రి వేళల్లో నిద్రకు దూరంగా ఉంటూ పోలీస్ ఉద్యోగ పరీక్షల కోసం శ్రమిస్తోంది. కష్టాలకు ఎదురొడ్డి నిలిచిన ఆమె పట్టుదల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

టాటా హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో హెల్త్ ప్రోబ్
తమిళనాడులోని హోసూర్ లో ఉన్న టాటా ఐఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్‌పై కేంద్ర కార్మిక శాఖ ఆరోగ్య, భద్రతాపరమైన దర్యాప్తుకు (Health Probe) ఆదేశించింది. ఇటీవల ఈ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం, ఆ తర్వాత ఉద్యోగుల్లో తలెత్తిన శ్వాసకోస సమస్యలు, అస్వస్థతపై కార్మిక శాఖకు ఫిర్యాదులు అందడమే దీనికి కారణం. ప్లాంట్‌లోని పని వాతావరణం, ఉద్యోగుల భద్రతా ప్రమాణాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

సరైన యోగా మ్యాట్‌ను ఎలా ఎంచుకోవాలి?
మార్కెట్‌లో రకరకాల మ్యాట్లు ఉన్నప్పటికీ, మీ శరీరానికి సరిపోయేదాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొనేటప్పుడు ఈ కింది విషయాలు గమనించండి: మందం (Thickness): సాధారణంగా 4mm నుండి 6mm మందం ఉన్న మ్యాట్ అనువుగా ఉంటుంది. ఇది మోకాళ్లకు, కీళ్లకు మంచి రక్షణ (Cushioning) ఇస్తుంది. పట్టు (Grip & Texture): మీరు ఆసనాలు వేసేటప్పుడు మ్యాట్ జారిపోకుండా ఉండాలి. నాన్-స్లిప్ (Non-slip) లేదా రబ్బర్ టెక్స్చర్ ఉన్న మ్యాట్లు గ్రిప్ ఇస్తాయి. మెటీరియల్ (Material): పర్యావరణానికి హాని చేయని Eco-friendly (TPE లేదా సహజ రబ్బరు) మ్యాట్లను ఎంచుకోవడం ఆరోగ్యానికి, ప్రకృతికి మంచిది. PVC మ్యాట్లను వాడకపోడం మంచిది..

నా తండ్రే నా హీరో అంటున్న క్రికెటర్ జెమీమా
భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ విజయం వెనుక ఆమె తండ్రి ఇవాన్ చేసిన త్యాగాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. కూతురిని కోచ్‌గా తీర్చిదిద్దేందుకు ఒక చిన్న 10x10 గదిలో కుటుంబంతో సర్దుకున్నారు. పగలు స్థలం లేక, అర్ధరాత్రి 1 గంటకు చర్చి బేస్‌మెంట్‌లో ప్రాక్టీస్ చేయించేవారు. వరల్డ్ కప్‌లో చోటు కోల్పోయి జెమిమా కుంగిపోయినప్పుడు, "సింహం లాంటి గుండెతో పోరాడు" అని ఆ తండ్రి ఇచ్చిన ధైర్యమే నేడు ఆమెను స్టార్‌ను చేసింది. తండ్రి ప్రేమే ఆమె అసలైన గెలుపు!

అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
TG: నీట్ ఎగ్జామ్‌లో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తప్పుగా పేర్కొనడంతో ముగ్గురు పరీక్ష రాయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. అధికారులు జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి రాజేంద్రనగర్‌కు బదులుగా జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి హయత్‌నగర్ అని హాల్‌టికెట్‌లో పేర్కొనడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. హయత్‌నగర్‌కు వెళ్లి అక్కడ అడ్రస్ దొరకపోవడంతో అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చేరుకున్నారు. శివరాంపల్లికి చేరుకునేలోగా టైమ్ గడిచిపోవడంతో పరీక్ష రాయడానికి అనుమతించలేదు.

16తులాల బంగారం ఉన్నా దోచుకోలేకపోయారు
TG: మేడ్చల్ జిలా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్‌పల్లికి చెందిన సంగిశెట్టి శ్రీనివాస్, సంతోష దంపతులు ఈ నెల 17న శిర్డీకి వెళ్లారు. దొంగల కన్ను బీరువాలపై పడుతుందని శ్రీనివాస్ 16తులాల బంగారు నగలు, రూ.3లక్షల నగదును బీరువాలో పెట్టకుండా విడివిడిగా దాచిపెట్టాడు. అతని భార్య సంతోష భర్తకు చెప్పకుండా రూ.30వేల నగదును బీరువాలోనే ఉంచేసింది. శిర్డీయాత్ర ముగించుకుని తిరిగి రాగా, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగలు పడినా 16తులాల బంగారం, రూ.3లక్షల నగదు సురక్షితంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపాడు. సంతోష బీరువాలో పెట్టిన 30వేలను దొంగలు దోచుకెళ్లారు.

అవగాహనా రాహిత్యంతో SBI భూములు వేలం
TG: SBI లాంటి దేశంలోని అతి పెద్ద బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసే తరహాలో అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితనానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో SBI భూములను వేలం వేసిందన్నారు. ఈ ప్రభుత్వానికి భూముల అమ్మకం మీద ఉన్న శ్రద్ధ వాటి సాంకేతిక, పర్యావరణ అంశాల మీద లేదన్నారు. రాయదుర్గం భూముల వేలంపై SBI బ్యాంకు కోర్టును ఆశ్రయించడాన్ని BRS పార్టీకి ఆపాదిస్తూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానన్నారు.

మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని RTC బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్‌లో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి పార్టీ పేరు, నాయకుడి ఫోటో లేదా సంస్థ వివరాలు లేకుండా కేవలం "అవునా?" అనే ప్రశ్నతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయ సందేశానికా, సామాజిక ప్రచారానికా, లేక మరేదైనా ప్రత్యేక కార్యక్రమానికి సంకేతమా? అనే చర్చలు పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. ఒక్క మాటతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం మదనపల్లెలో హాట్ టాపిక్‌గా మారాయి.
గడ్డకట్టే చలిలో నీటి అడుగున యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లద్దాఖ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉప్పునీటి సరస్సు పాంగాంగ్ త్సో తీరంలో గడ్డకట్టే చలిని లెక్క చేయకుండా 47వ ITBP బెటాలియన్ జవాన్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ, మంచు కొండల మధ్య జవాన్లు అత్యంత కఠినమైన యోగాసనాలను అలవోకగా వేసి తమ శారీరక, మానసిక దృఢత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు, ఇండియన్ నేవీ సబ్‌మెరైనర్లు సముద్ర గర్భంలో జలాంతర్గాములపై వినూత్నంగా యోగాసనాలు వేశారు.

క్రిమినల్స్ అయితే చంపేస్తారా ? : బొత్స
AP: కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయికృష్ణ కుటుంబానికి ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. YCP కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. కాపులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ డెడ్‌బాడీ కూడా లేకుండా చేశారని, పోలీస్‌ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. క్రిమినల్స్ అయితే చంపేస్తారా ?, రాజ్యాంగం చెప్పిందా అని నిలదీశారు.

పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క: TPCC చీఫ్
TG: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క అని, ఆయన BJP ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారన్నారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదు అన్నారు.

KUDA ఆఫీస్ ముట్టడి.. హన్మకొండలో ఉద్రిక్తత
TG: హన్మకొండలోని బాలసముద్రం కమర్షియల్ ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని BJP హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ఆఫీస్‌ను ముట్టడించారు. భూముల వేలంపాటను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నాయకులు లోపలికి వెళ్లడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, కొలను సంతోష్ రెడ్డి, ఇతర నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్: KTR
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయం ప్రజలు అందరికీ తెలిసిపోయి విసుక్కుంటున్నారని మాజీ మంత్రి KTR ఫైరయ్యారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో BRS నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం అయిపోయిందని, ఇంకా సగమే ఉందని తెలిపారు. CM రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ఒక సినిమా ఫెయిలైతే నిర్మాత ఒక్కరే నష్టపోతారు. కానీ రేవంత్ రెడ్డి సినిమాలో మొత్తం తెలంగాణ ప్రజలు అందరూ నష్టపోతున్నారని విమర్శించారు.