← Back to news

మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం

By డీకే· 21 Jun 2026· Hmtvlive· మదనపల్లె
మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని RTC బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్‌లో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి పార్టీ పేరు, నాయకుడి ఫోటో లేదా సంస్థ వివరాలు లేకుండా కేవలం "అవునా?" అనే ప్రశ్నతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయ సందేశానికా, సామాజిక ప్రచారానికా, లేక మరేదైనా ప్రత్యేక కార్యక్రమానికి సంకేతమా? అనే చర్చలు పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. ఒక్క మాటతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం మదనపల్లెలో హాట్ టాపిక్‌గా మారాయి.

More in Local