Latest

పోలీస్  జాబ్ కోసం స్విగ్గీ డెలివరీ చేస్తున్న లేడీ
Politics· 21 Jun 2026

పోలీస్ జాబ్ కోసం స్విగ్గీ డెలివరీ చేస్తున్న లేడీ

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తన ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువతి. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కావాలనే కలను నిజం చేసుకోవడానికి ముంబై వీధుల్లో స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తోంది. పగలు ఎండనక, వాననక డెలివరీలు చేస్తూ.. రాత్రి వేళల్లో నిద్రకు దూరంగా ఉంటూ పోలీస్ ఉద్యోగ పరీక్షల కోసం శ్రమిస్తోంది. కష్టాలకు ఎదురొడ్డి నిలిచిన ఆమె పట్టుదల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

టాటా హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో హెల్త్ ప్రోబ్
News· 21 Jun 2026

టాటా హోసూర్ ఐఫోన్ ప్లాంట్‌లో హెల్త్ ప్రోబ్

తమిళనాడులోని హోసూర్ లో ఉన్న టాటా ఐఫోన్ విడిభాగాల తయారీ ప్లాంట్‌పై కేంద్ర కార్మిక శాఖ ఆరోగ్య, భద్రతాపరమైన దర్యాప్తుకు (Health Probe) ఆదేశించింది. ఇటీవల ఈ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం, ఆ తర్వాత ఉద్యోగుల్లో తలెత్తిన శ్వాసకోస సమస్యలు, అస్వస్థతపై కార్మిక శాఖకు ఫిర్యాదులు అందడమే దీనికి కారణం. ప్లాంట్‌లోని పని వాతావరణం, ఉద్యోగుల భద్రతా ప్రమాణాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

సరైన యోగా మ్యాట్‌ను ఎలా ఎంచుకోవాలి?
General· 21 Jun 2026

సరైన యోగా మ్యాట్‌ను ఎలా ఎంచుకోవాలి?

మార్కెట్‌లో రకరకాల మ్యాట్లు ఉన్నప్పటికీ, మీ శరీరానికి సరిపోయేదాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొనేటప్పుడు ఈ కింది విషయాలు గమనించండి: మందం (Thickness): సాధారణంగా 4mm నుండి 6mm మందం ఉన్న మ్యాట్ అనువుగా ఉంటుంది. ఇది మోకాళ్లకు, కీళ్లకు మంచి రక్షణ (Cushioning) ఇస్తుంది. పట్టు (Grip & Texture): మీరు ఆసనాలు వేసేటప్పుడు మ్యాట్ జారిపోకుండా ఉండాలి. నాన్-స్లిప్ (Non-slip) లేదా రబ్బర్ టెక్స్చర్ ఉన్న మ్యాట్లు గ్రిప్ ఇస్తాయి. మెటీరియల్ (Material): పర్యావరణానికి హాని చేయని Eco-friendly (TPE లేదా సహజ రబ్బరు) మ్యాట్లను ఎంచుకోవడం ఆరోగ్యానికి, ప్రకృతికి మంచిది. PVC మ్యాట్లను వాడకపోడం మంచిది..

నా తండ్రే నా హీరో అంటున్న క్రికెటర్ జెమీమా
Motivational· 21 Jun 2026

నా తండ్రే నా హీరో అంటున్న క్రికెటర్ జెమీమా

భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ విజయం వెనుక ఆమె తండ్రి ఇవాన్ చేసిన త్యాగాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. కూతురిని కోచ్‌గా తీర్చిదిద్దేందుకు ఒక చిన్న 10x10 గదిలో కుటుంబంతో సర్దుకున్నారు. పగలు స్థలం లేక, అర్ధరాత్రి 1 గంటకు చర్చి బేస్‌మెంట్‌లో ప్రాక్టీస్ చేయించేవారు. వరల్డ్ కప్‌లో చోటు కోల్పోయి జెమిమా కుంగిపోయినప్పుడు, "సింహం లాంటి గుండెతో పోరాడు" అని ఆ తండ్రి ఇచ్చిన ధైర్యమే నేడు ఆమెను స్టార్‌ను చేసింది. తండ్రి ప్రేమే ఆమె అసలైన గెలుపు!

అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
Education· 21 Jun 2026

అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

TG: నీట్ ఎగ్జామ్‌లో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ తప్పుగా పేర్కొనడంతో ముగ్గురు పరీక్ష రాయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. అధికారులు జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి రాజేంద్రనగర్‌కు బదులుగా జిల్లాపరిషత్ హైస్కూల్ శివరాంపల్లి హయత్‌నగర్ అని హాల్‌టికెట్‌లో పేర్కొనడంతో విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. హయత్‌నగర్‌కు వెళ్లి అక్కడ అడ్రస్ దొరకపోవడంతో అక్కడి నుంచి రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లికి చేరుకున్నారు. శివరాంపల్లికి చేరుకునేలోగా టైమ్ గడిచిపోవడంతో పరీక్ష రాయడానికి అనుమతించలేదు.

16తులాల బంగారం ఉన్నా దోచుకోలేకపోయారు
Crime· 21 Jun 2026

16తులాల బంగారం ఉన్నా దోచుకోలేకపోయారు

TG: మేడ్చల్ జిలా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్‌పల్లికి చెందిన సంగిశెట్టి శ్రీనివాస్, సంతోష దంపతులు ఈ నెల 17న శిర్డీకి వెళ్లారు. దొంగల కన్ను బీరువాలపై పడుతుందని శ్రీనివాస్ 16తులాల బంగారు నగలు, రూ.3లక్షల నగదును బీరువాలో పెట్టకుండా విడివిడిగా దాచిపెట్టాడు. అతని భార్య సంతోష భర్తకు చెప్పకుండా రూ.30వేల నగదును బీరువాలోనే ఉంచేసింది. శిర్డీయాత్ర ముగించుకుని తిరిగి రాగా, బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగలు పడినా 16తులాల బంగారం, రూ.3లక్షల నగదు సురక్షితంగా ఉన్నాయని శ్రీనివాస్ తెలిపాడు. సంతోష బీరువాలో పెట్టిన 30వేలను దొంగలు దోచుకెళ్లారు.

అవగాహనా రాహిత్యంతో SBI భూములు వేలం
Politics· 21 Jun 2026

అవగాహనా రాహిత్యంతో SBI భూములు వేలం

TG: SBI లాంటి దేశంలోని అతి పెద్ద బ్యాంకును బ్లాక్ మెయిల్ చేసే తరహాలో అనుకూల మీడియాలో కథనాలు రాయిస్తుండడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితనానికి పరాకాష్ట అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో SBI భూములను వేలం వేసిందన్నారు. ఈ ప్రభుత్వానికి భూముల అమ్మకం మీద ఉన్న శ్రద్ధ వాటి సాంకేతిక, పర్యావరణ అంశాల మీద లేదన్నారు. రాయదుర్గం భూముల వేలంపై SBI బ్యాంకు కోర్టును ఆశ్రయించడాన్ని BRS పార్టీకి ఆపాదిస్తూ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నానన్నారు.

మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం
Local· 21 Jun 2026

మదనపల్లెలో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని RTC బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్‌లో "అవునా?" ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి పార్టీ పేరు, నాయకుడి ఫోటో లేదా సంస్థ వివరాలు లేకుండా కేవలం "అవునా?" అనే ప్రశ్నతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఫ్లెక్సీల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? రాజకీయ సందేశానికా, సామాజిక ప్రచారానికా, లేక మరేదైనా ప్రత్యేక కార్యక్రమానికి సంకేతమా? అనే చర్చలు పట్టణంలో జోరుగా సాగుతున్నాయి. ఒక్క మాటతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం మదనపల్లెలో హాట్ టాపిక్‌గా మారాయి.

గడ్డకట్టే చలిలో నీటి అడుగున యోగాసనాలు▶
Viral· 21 Jun 2026

గడ్డకట్టే చలిలో నీటి అడుగున యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లద్దాఖ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉప్పునీటి సరస్సు పాంగాంగ్ త్సో తీరంలో గడ్డకట్టే చలిని లెక్క చేయకుండా 47వ ITBP బెటాలియన్ జవాన్లు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ, మంచు కొండల మధ్య జవాన్లు అత్యంత కఠినమైన యోగాసనాలను అలవోకగా వేసి తమ శారీరక, మానసిక దృఢత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు, ఇండియన్ నేవీ సబ్‌మెరైనర్లు సముద్ర గర్భంలో జలాంతర్గాములపై వినూత్నంగా యోగాసనాలు వేశారు.

క్రిమినల్స్ అయితే చంపేస్తారా ? :  బొత్స
Politics· 21 Jun 2026

క్రిమినల్స్ అయితే చంపేస్తారా ? : బొత్స

AP: కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో వైసీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయికృష్ణ కుటుంబానికి ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. YCP కాపు నేతలు రౌడీలు అనుకుంటున్నారా అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. కాపులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ డెడ్‌బాడీ కూడా లేకుండా చేశారని, పోలీస్‌ను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. క్రిమినల్స్ అయితే చంపేస్తారా ?, రాజ్యాంగం చెప్పిందా అని నిలదీశారు.

పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క: TPCC చీఫ్
Politics· 21 Jun 2026

పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క: TPCC చీఫ్

TG: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కమలం పువ్వులో ఒక రెక్క అని, ఆయన BJP ఆడిస్తున్న ఆటలో పావుగా మారి వారు చెప్పినట్లు ఆడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారన్నారు. రాజకీయంగా పవన్ కల్యాణ్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవట్లేదు అన్నారు.

KUDA ఆఫీస్‌ ముట్టడి.. హన్మకొండలో ఉద్రిక్తత
Politics· 21 Jun 2026

KUDA ఆఫీస్‌ ముట్టడి.. హన్మకొండలో ఉద్రిక్తత

TG: హన్మకొండలోని బాలసముద్రం కమర్షియల్ ప్లాట్ల వేలాన్ని నిలిపివేయాలని BJP హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(KUDA) ఆఫీస్‌ను ముట్టడించారు. భూముల వేలంపాటను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ నాయకులు లోపలికి వెళ్లడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ, కొలను సంతోష్ రెడ్డి, ఇతర నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్: KTR
Politics· 21 Jun 2026

రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్: KTR

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఈ విషయం ప్రజలు అందరికీ తెలిసిపోయి విసుక్కుంటున్నారని మాజీ మంత్రి KTR ఫైరయ్యారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో BRS నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం అయిపోయిందని, ఇంకా సగమే ఉందని తెలిపారు. CM రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా ఒక సినిమా ఫెయిలైతే నిర్మాత ఒక్కరే నష్టపోతారు. కానీ రేవంత్ రెడ్డి సినిమాలో మొత్తం తెలంగాణ ప్రజలు అందరూ నష్టపోతున్నారని విమర్శించారు.

సాయికృష్ణ కేసు.. CI నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్దం ?
AP· 21 Jun 2026

సాయికృష్ణ కేసు.. CI నాగరాజు అరెస్ట్‌కు రంగం సిద్దం ?

AP: విజయవాడ సాయికృష్ణ కేసు విచారణ కొనసాగుతున్న వేళ నిందితుడిగా ఉన్న CI నాగరాజు గత మూడురోజులుగా ఓ కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం. నాగరాజును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆయన అనుచరులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీస్ అధికారి కోర్టు సిబ్బంది ఇంట్లో ఆశ్రయం పొందడం పలు అనుమానాలకు తావిస్తుంది. నాగరాజు అక్కడ ఎందుకు ఉంటున్నారు? , ఆయనకు ఎలాంటి సహకారం అందుతోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సిల్లీ రీజన్ చూపి నన్ను MP కాకుండా చేశారు
Politics· 21 Jun 2026

సిల్లీ రీజన్ చూపి నన్ను MP కాకుండా చేశారు

TG: BJP నిర్దాక్షిణ్యంగా తన రాజ్యసభ సీటు చోరీకి పాల్పడిందని, ఎన్నికల కమిషన్ కూడా కాంప్రమైజ్ అయిందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సన్సేషనల్ కామెంట్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే తన నామినేషన్ వెంటనే తిరస్కరించారని ఫైరయ్యారు. నారాయణపేటలో మహిళ ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు. సిల్లీ రీజన్ చూపి తనకు రాజ్యసభ ఎంపీ కాకుండా చేశారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌‌లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్
TG· 21 Jun 2026

హైదరాబాద్‌‌లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్

HYDలోని KBR పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలుచేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలను బసవతారకం ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్45 మీదుగా దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి చేపడుతున్న హెచ్-సిటీ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం
Crime· 21 Jun 2026

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

TG: ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలోని గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి 9ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. లింగరాజు పాల వ్యాపారంతో పాటు, ఖమ్మంలోని మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి ఖమ్మంలోని పంపింగ్ వెల్ రోడ్‌లో అద్దెకు ఉంటున్నారు. భార్యాభర్తలకు గొడవ జరగడంతో, స్వాతి ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తాగించి, తాను కూడా తాగింది. స్థానికులు వెంటనే ముగ్గుర్నీ హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరు కుమారులు వేదిక్(7), తనుష్(5) మృతి చెందారు. తల్లి స్వాతి చికిత్స పొందుతోంది.

ప్రకృతి ఒడిలో యోగా.. వావ్ అనాల్సిందే !▶
India· 21 Jun 2026

ప్రకృతి ఒడిలో యోగా.. వావ్ అనాల్సిందే !

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పశ్చిమబెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకృతి ఒడిలో నిర్వహించారు. నదీ తీరాన, పచ్చని అడవి మధ్య అటవీ సిబ్బంది ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. వీరితో పాటు మావటిలతో ఉన్న ఏనుగులు కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ప్రకృతితో మమేకమై చేసిన ఈ యోగా ప్రదర్శన వీడియో నెటిజన్‌లను ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. క్షణాల్లోనే దగ్ధం▶
TG· 21 Jun 2026

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. క్షణాల్లోనే దగ్ధం

TG: కరీంనగర్ డిపోకు చెందిన RTC ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు 41 మంది ప్రయాణికులతో బయల్దేరింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏ ఒక్క పరీక్ష జీవితానికి అంతిమం కాదు: KA పాల్▶
India· 21 Jun 2026

ఏ ఒక్క పరీక్ష జీవితానికి అంతిమం కాదు: KA పాల్

నీట్ (NEET) పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఎవరూ సూసైడ్ చేసుకోవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ KA పాల్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, వారి భవిష్యత్తును ఒక్క పరీక్షతో ముడిపెట్టవద్దని తల్లిదండ్రులకు సూచించారు. పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏ ఒక్క పరీక్ష కూడా విద్యార్థుల జీవితానికి అంతిమం కాదని, యువత ఆత్మహత్యలు తీసుకోవద్దన్నారు.

మూవీ సీన్‌ను తలపించేలా బంగారం చోరీ
Crime· 21 Jun 2026

మూవీ సీన్‌ను తలపించేలా బంగారం చోరీ

AP: మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నంద్యాల జిల్లా డోన్ హైవేపై శనివారం అర్థరాత్రి భారీ మొత్తంలో బంగారంతో ప్రయాణిస్తున్నాడు. విషయాన్ని ముందే పసిగట్టిన దొంగల ముఠా స్కార్పియో కారులో ఆ ప్రైవేట్ బస్సును ఫాలో చేస్తూ వచ్చింది. బస్సు డోన్ హైవేపై ఉన్న భారత్ డాబా దగ్గర ఆగడంతో బంగారం ఉన్న బ్యాగ్ అపహరించుకుని స్కార్పియోలో పరారయ్యారు. బస్సు జడ్చర్ల చేరుకున్న తర్వాత మోతిలాల్ బ్యాగ్‌ కన్పించకపోవడంతో డోన్ PSలో ఫిర్యాదు చేశాడు. 2.750 కిలోల బంగారం చోరీ చేశారని, దానివిలువ రూ.4.50 కోట్లు ఉంటుందని బాధితుడు తెలిపాడు.