Latest

ఈ రోజు గోల్డ్ రేట్స్ ఇవే!
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటనతో ఇరాన్ టెన్షన్స్ తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్ ఎఫెక్ట్‌తో భారత్‌లో గోల్డ్ రేట్స్ మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 15న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,070గా, 22 క్యారెట్ల ధర రూ.1,36,640గా ఉంది. AP లోని విజయవాడ, వైజాగ్‌లలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,48,580 వద్ద కొనసాగుతోంది. Note: గోల్డ్ కొనే ముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్.
కరెంట్ పోల్‌పై కూర్చొని లంచ్!
లైఫ్ కోసం ఎంతటి రిస్క్ అయినా చేయాలనేదానికి ఈ వైరల్ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎత్తైన ఎలక్ట్రిక్ పోల్‌పై చాలా డేంజరస్ కండిషన్స్‌లో వర్క్ చేస్తూ, అదే పోల్‌పై కూర్చొని లంచ్ చేస్తున్న ఒక యంగ్ వర్కర్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి హార్ట్స్ టచ్ చేస్తోంది. మనం డైలీ వాడుకునే కరెంట్ వెనుక ఇలాంటి వేలాది మంది వర్కర్స్ కష్టం, లైఫ్ రిస్క్ చేసే ధైర్యం ఉన్నాయి. ఈ రియల్ హీరోస్ కష్టానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.
కొడుకుని కాపాడబోయి తల్లి కూడా మృతి!
చిత్తూరు జిల్లా నెలవాయి గ్రామంలో ఘోర విషాదం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద తవ్విన ఒక ఫామ్ పాండ్ (వ్యవసాయ కుంట) లో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన సిద్ధు (15) అనే అబ్బాయి నీళ్లలో మునిగిపోయాడు. అది చూసి కొడుకుని కాపాడటానికి ట్రై చేసిన తల్లి రేవతి (35) కూడా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి, కొడుకు ఇద్దరూ చనిపోవడంతో ఆ విలేజ్‌లో తీవ్ర విషాదం నెలకొంది.

సీరియల్ యాక్ట్రెస్ సూసైడ్!
హిందీ టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఫేమస్ సీరియల్ 'కుంకుమ భాగ్య' ఫేమ్, పాపులర్ యాక్ట్రెస్ సంచిత ఉగలే (30) సూసైడ్ చేసుకున్నారు. ముంబై నలసోపారాలోని తన ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఆమె చీరతో ఉరివేసుకున్నారు. స్పాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆమె మృతితో ఫ్యాన్స్, కో-స్టార్స్ ఎమోషనల్ అవుతున్నారు.
చలిచీమలు కూడా పామును చంపగలవు: పవన్ కళ్యాణ్
కాక్రాచ్ పార్టీని చూస్తుంటే తనకు చలిచీమల పద్యం గుర్తొచ్చిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో పవర్‌ఫుల్ అయిన పామును సైతం చలిచీమలు గ్రూప్‌గా వచ్చి చంపేస్తాయని. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరిలోనూ ఆ పవర్ ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ ఇంకా మారలేదు: పవన్ కళ్యాణ్
గతంలో కాంగ్రెస్ పార్టీ AP, తెలంగాణలను విడదీసిన పద్ధతి అస్సలు కరెక్ట్ కాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ మైండ్‌సెట్ ఇంకా మారలేదని, దానికి ఉదాహరణే తమ జనసేన మీటింగ్‌కు పర్మిషన్ ఇవ్వకపోవడమేనని ఫైర్ అయ్యారు. విభజన సమయం నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఆర్మీ ఆఫీసర్‌కి CM విజయ్ బంపర్ ఆఫర్!
యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్‌లో రియల్ హీరోగా నిలిచిన కీర్తి చక్ర అవార్డు విన్నర్, లాన్స్ నాయక్ ఎ. మీనాక్షి సుందరంను తమిళనాడు CM విజయ్ సెక్రటేరియట్‌లో కలిసి అభినందించారు. ఆయన చూపించిన అద్భుతమైన ధైర్యానికి గుర్తింపుగా తమిళనాడు గవర్నమెంట్ తరపున ₹48 లక్షల భారీ చెక్కును అందజేశారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి ఫైట్ చేసిన మన ఆర్మీ ఆఫీసర్‌ని CM విజయ్ ఇలా గౌరవించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'కార్లలో తిరగడం కాదు, పాదయాత్ర చేయండి'
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద గోడలకు పోస్టర్లు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ రమ్య అనే మహళ ఈ వినూత్న నిరసనకు దిగినట్లు తెలిపింది. CM రేవంత్ రెడ్డి కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు, నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలి, చదువుకున్నవారికి జాబ్స్ ఇవ్వాలన్నారు. నాలుగు కార్లు వేసుకుని తిరగడం కాదు, మీ కాళ్లతో పాదయాత్ర చేయండి ప్రజల తిప్పలు అర్థం అవుతుందన్నారు. పల్లెటూర్లో కాదు హైదరాబాద్‌లో పాదయాత్ర చేయండి. అప్పుడే ఎంత మంది కిరాయికి ఉంటున్నారో మీకు అర్థం అవుతుందని పోస్టర్‌లో పేర్కొంది.
యూత్ కోసం యాక్టర్ ప్రకాష్ రాజ్ చేసిన డిమాండ్!
బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో జరిగిన కాక్రోచెస్ ప్రొటెస్ట్‌లో యాక్టర్ ప్రకాష్ రాజ్ రూలింగ్ పాలిటిషియన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న లీడర్స్ అందరూ తప్పుకొని. ఈ దేశ యూత్‌కి ప్లేస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన కిడ్స్, యంగ్ జనరేషన్ అంతా తమ ఫ్యూచర్ కోసం రోడ్లపైకి వచ్చి ఫైట్ చేస్తున్నారని గుర్తు చేశారు. యువత పోరాటాన్ని గౌరవించి, వాళ్లకు రూలింగ్ చాన్స్ ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

సెక్రటేరియట్ వద్ద పోస్టర్లు కలకలం
TG: హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద గోడలకు ఉచిత పథకాలు వద్దని పోస్టర్లు ప్రత్యక్షం అయ్యాయి. ప్రతిపేద వాడికి ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలని పోస్టర్లలో పేర్కొన్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో పోస్టర్లు అంటించడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బంది జగిత్యాల జిల్లాకు చెందిన రమ్య అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. గతరాత్రి ఎవరికీ తెలియకుండా తానే ఈ పోస్టర్లను అతికించినట్లు సదరు మహిళ స్వయంగా వెల్లడించింది.

వర్షాలకి ఆఫీసర్స్ రోడ్లపైనే ఉండాలి: CM రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో వర్షాలు పడినప్పుడు మున్సిపల్, పోలీస్ స్టాఫ్ కలిసి పని చేయకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మొన్న వర్షం పడితే అధికారులు సరిగా డ్యూటీ చేయలేదని ఫైర్ అయ్యారు. ఇకపై వర్షం వస్తే చిన్న స్టాఫ్ నుండి పెద్ద ఆఫీసర్స్ వరకు అందరూ రోడ్లపైనే ఉండాలని, అవసరమైతే తాను కూడా వస్తానని చెప్పారు. నీళ్లు నిలిచే చోట్ల, ఇబ్బంది ఉండే ఏరియాల్లో అలర్ట్‌గా ఉండాలని.. ట్రాఫిక్ జామ్స్ వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్
TG: రాష్ట్రంలో మొత్తం 1269 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌లో సోమవారం బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌లు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకంతో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలని పెంచుతున్నామని తెలిపారు.

తిరిగి వేడి చేయకూడని ఆహారాలు!
ఆహారాలు వేడిగా వడ్డించినప్పుడు చాలా రుచిగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడిచేసి తినకూడదని ఎక్స్‌పర్ట్స్ చేపుతున్నారు. పుట్టగొడుగులు, వండిన చికెన్‌ను తిరిగి వేడిచేసి తింటే జీర్ణ, గుండె సమస్యలు వస్తాయి. సెలెరీ, బచ్చలికూర కూడా వేడి చేయడం వల్ల క్యాన్సర్ సమస్యలు వస్తాయి. గుడ్డు కూర తిరిగి వేడి చేయడంతో జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వండిన వెంటనే అన్నం తినాలి. తిరిగి మళ్లీ వేడిచేస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందన్నారు. ఉడికించిన బంగాలదుంపల కూర తింటే కండరాల పక్షవాతం వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

అఖిలేష్ కూతురు పై ట్రోలింగ్: CM యోగి ఫైర్!
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూతురిపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని UP CM యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. అఖిలేష్ కూతురిని టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు పెట్టిన నిందితులపై వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆడపిల్లలు అందరికీ సమానమేనని. లీడర్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని పాలిటిక్స్‌లోకి లాగడం కరెక్ట్ కాదని, అఖిలేష్ కూతురు తనకు కూడా కూతురితో సమానమేనని CM యోగి స్పష్టం చేశారు.

తప్పులే మన అసలైన గురువులు!
గ్లోబల్ సింగర్ టెయ్‌లర్ స్విఫ్ట్ న్యూయార్క్ యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న టైమ్‌లో స్టూడెంట్స్‌కి ఒక మెసేజ్ ఇచ్చారు. లైఫ్‌లో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదని, ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం కామన్ అని చెప్పారు. మనం చేసే ఆ తప్పులే మనకు లైఫ్‌లో అసలైన గురువులని, వాటి నుంచే కొత్త విషయాలు నేర్చుకుంటామని గుర్తు చేశారు. తప్పులు జరిగినప్పుడు కుంగిపోకుండా, పర్‌ఫెక్షన్ కోసం ప్రాకులాడకుండా. రిలాక్స్‌గా ముందుకు సాగాలని టెయ్‌లర్ స్విఫ్ట్ అడ్వైజ్ ఇచ్చారు.

ఫుడ్ ఫోటో తీస్తే చాలు.. AI అన్ని వివరాలు చెప్పేస్తుంది!
ఇండియాలోని డిఫరెంట్ ఏరియా వంటకాలు, బిర్యానీల రుచులను డిజిటల్‌గా రికార్డ్ చేయడానికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్లు ఒక క్రేజీ AI ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దీని పేరే 'భారత్ టేస్ట్ అట్లాస్'. కంప్యూటర్ విజన్, AI టెక్నాలజీతో మన ఇండియన్ థాలీ, బిర్యానీలపై వీళ్లు స్టడీ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో వచ్చే మొబైల్ యాప్‌లో ఫుడ్ ఫోటో తీస్తే చాలు. అందులోని పదార్థాలు, కేలరీలు, పోషక విలువలని ఈ AI సిస్టమ్ ఈజీగా లెక్కగట్టి చెప్పేస్తుంది.

స్మార్ట్‌ఫోన్లతోనే 'జెన్ ఆల్ఫా' లోకం!
ఇప్పటి జనరేషన్ అంటే 'జెన్ ఆల్ఫా' కిడ్స్ ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లకి ఎంతలా అడిక్ట్ అయ్యారో జనవరి 2026 'జీ5 సర్వే'లో తెలిసింది. వీళ్లు రోజుకు యావరేజ్‌గా 3.6 గంటలు ఫోన్లలోనే గడుపుతున్నారు. ఇందులో 72% మంది ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుంటే, 57% మంది సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, చదువు పక్కన పెట్టి.. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఎక్కువ టైమ్ వేస్ట్ చేస్తూ కిడ్స్ ఇంటర్నెట్ బానిసలుగా మారుతున్నారని ఈ స్టడీ హెచ్చరించింది.
రాఘవ లారెన్స్: నేను ప్రజలను కుక్కలతో పోల్చలేదు!
రిసెంట్ ప్రెస్ మీట్‌పై వస్తున్న రూమర్స్‌కు హీరో రాఘవ లారెన్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. తాను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ కొందరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, అది అస్సలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. "కొత్త ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని, కుక్కలను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది" అనే ఉద్దేశంతోనే ఆ మాటలన్నానని చెప్పారు. తన అభిమానులు, ప్రజలు తన తల్లితో సమానమని.. దయచేసి ఫుల్ వీడియో చూసి అర్థం చేసుకోవాలని లారెన్స్ రిక్వెస్ట్ చేశారు.

తెలంగాణలో ఈ–కేబినెట్ మీటింగ్స్
TG: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ ఇకపై ఎలక్ట్రానిక్ విధానంలో జరగనున్నాయి. పరిపాలనలో పేపర్‌లెస్ విధానాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అన్ని కార్యాలయాల్లో ముఖ్యంగా సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్ కార్యాలయాల్లో పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో అత్యాధునిక ట్యాబ్‌లు కొనుగోలు చేయడం, వాటికి అవసరమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లను సమకూర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) నుంచి సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
AP: నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. సంగం మండలం దువ్వూరు విలేజ్‌లో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు(65), ఆయన భార్య రత్నావళి(60), కుమారుడు సాయిసుకృత్(25) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చేతులకు తాళ్లు కట్టేసి ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్ విద్యార్థుల కోసం AP విద్యాశాఖ కీలక నిర్ణయం
AP విద్యాశాఖ ఇంటర్ విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలతో పోటీపడేలా ఉత్తీర్ణత శాతం పెంచేందుకు స్పెషల్ క్లాసులు నిర్వహణ, మెటీరియల్‌ను అందిస్తోంది. గతేడాది IIT, JEE, NEET, తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను కాస్త ఆలస్యంగా అందజేయగా, ఈసారి మాత్రం ముందుగానే అందజేశారు. ఈ మెటీరియల్ ఉచితంగానే ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే నిపుణులైన సబ్జెక్టు లెక్చరర్లతో మెటీరియల్‌ను రూపొందించారు.