రాఘవ లారెన్స్: నేను ప్రజలను కుక్కలతో పోల్చలేదు!
రిసెంట్ ప్రెస్ మీట్‌పై వస్తున్న రూమర్స్‌కు హీరో రాఘవ లారెన్స్ ఫుల్ స్టాప్ పెట్టారు. తాను ప్రజలను కుక్కలతో పోల్చానంటూ కొందరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, అది అస్సలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. "కొత్త ఇంటికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణాన్ని, కుక్కలను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది" అనే ఉద్దేశంతోనే ఆ మాటలన్నానని చెప్పారు. తన అభిమానులు, ప్రజలు తన తల్లితో సమానమని.. దయచేసి ఫుల్ వీడియో చూసి అర్థం చేసుకోవాలని లారెన్స్ రిక్వెస్ట్ చేశారు.



