ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. సంగం మండలం దువ్వూరు విలేజ్‌లో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు(65), ఆయన భార్య రత్నావళి(60), కుమారుడు సాయిసుకృత్(25) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చేతులకు తాళ్లు కట్టేసి ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



