Latest

హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!
Legal· 11 Jun 2026

హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!

అపార్ట్‌మెంట్ హౌసింగ్ సొసైటీలు, క్లబ్‌లు తమ మెంబర్స్ నుండి వసూలు చేసే మెయింటెనెన్స్ చార్జీలపై ఎలాంటి GST కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సొసైటీ అంటేనే మెంబర్స్ అందరూ కలిసి ఉంటరు కాబట్టి, మన సొంత డబ్బుపై మనమే ట్యాక్స్ కట్టడం ఏంటని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కట్టిన GSTని కూడా వెనక్కి తీసుకోవచ్చు. కానీ, బయటి వ్యక్తులకు ఏవైనా సర్వీసెస్ ఇస్తే మాత్రం GST కట్టాల్సిందే.

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్
Education· 11 Jun 2026

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్

TG: : ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన LLB సెమిస్టర్ ఫలితాల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం, అనంతరం రీవాల్యుయేషన్‌లో వారిలో ఎక్కువమంది పాస్ కావడంతో పేపర్ ఎవల్యూషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారం ప్రకారం LLB సెమిస్టర్ పరీక్షల్లో సుమారు 1,500 మంది ఫెయిలయ్యారు. వీరిలో గత సెమిస్టర్లలో మంచి మార్కులు సాధించిన వారు కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట ఫెయిలైనవారికి రీవాల్యుయేషన్ అనంతరం ఫస్ట్ గ్రేడ్ మార్కులు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్.. అసలు ఇతను ఏం మాట్లాడాడు?▶
Politics· 11 Jun 2026

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్.. అసలు ఇతను ఏం మాట్లాడాడు?

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మాటల్లోని నిలకడ లేకపోవడం గురించి ఈ వీడియోలో ఒక అతను క్లియర్ గా మాట్లాడాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. అభిమానులు ఆవేశపడకుండా, ఓపికగా తమ నాయకుడి మాటల్లోని మార్పులను గమనించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా ఫుల్ ట్రెండ్ అవుతోంది. Credits: Figuring Out by Jay youtube channel

మీ లైఫ్ స్టైలే మీ  బాడీని షేప్ చేస్తుందా?
Politics· 11 Jun 2026

మీ లైఫ్ స్టైలే మీ బాడీని షేప్ చేస్తుందా?

ఊబకాయం పెరగడానికి డిఎన్ఏని బ్లేమ్ చేయడం తగదు అంటున్నాయి మెడికల్ రిసెర్చ్ రిపోర్టులు. టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వాటికి జీన్స్ ఒక కారణం కావొచ్చు, కానీ అవే పూర్తిగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పలేం. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, యాక్టివ్ లైఫ్‌స్టైల్ పాటిస్తే మీ జెనెటిక్ ప్రొఫైల్ ఎలాంటిదైనా సరే, ఊబకాయాన్ని సులభంగా కంట్రోల్ చేయవచ్చంటున్నాయి రిసెర్చ్ లు.. కాబట్టి మీ బద్ధకానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. హుషారుగా మారిపోండి.అద్భుతమైన బాడీ షేప్ మీ సొంతం.

పార్టీ మీటింగ్ లో కుర్చీలతో కొట్టుకున్న TDP కార్యకర్తలు!▶
Politics· 11 Jun 2026

పార్టీ మీటింగ్ లో కుర్చీలతో కొట్టుకున్న TDP కార్యకర్తలు!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో TDP కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. మండల TDP ప్రెసిడెంట్ ప్రత్తిపాటి ఉమామహేశ్వరి మిగతా లీడర్లకు, కార్యకర్తలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఒక మీటింగ్ పెట్టారు. దీనిపై స్థానిక లీడర్స్ ఆమెను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

జీన్స్ కి ఒబేసిటీకి సంబంధం ఉందా?
Health· 11 Jun 2026

జీన్స్ కి ఒబేసిటీకి సంబంధం ఉందా?

జీన్స్ (Genetic makeup) వల్లనే లావవుతున్నామనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని తాజా రిసెర్చ్ లు చెబుతున్నాయి. ఊబకాయానికి ప్రత్యేకంగా ఎలాంటి Obesity Gene బాధ్యత వహించదు. వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు మీ బరువును శాశ్వతంగా నిర్ణయించలేవు. సరైన ఆహారపు అలవాట్లు, యాక్టివ్ లైఫ్ స్టైల్, శారీరక శ్రమ ద్వారా మీ జన్యుపరమైన మార్పులను సైతం అధిగమించి బరువును ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ఫిట్‌నెస్ మీ చేతుల్లోనే ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం.

YS జగన్: మేమూ కాక్రోచెస్‌మే!▶
Politics· 11 Jun 2026

YS జగన్: మేమూ కాక్రోచెస్‌మే!

YCP అధినేత YS జగన్ ప్రెస్‌మీట్‌లో CM చంద్రబాబుని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. “గుర్తుపెట్టుకో చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో మేమూ కాక్రోచెస్‌మే! మమ్మల్ని ఇబ్బంది పెడితే కాక్రోచెస్ లేస్తాయి జాగ్రత్త” అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇది Gen Z టైమ్ అని, ఆల్ఫా జనరేషన్ కూడా వచ్చేసిందని చెప్పారు. జగన్ గారు చేసిన ఈ 'కాక్రోచ్' కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ DEO ఆఫీస్‌ ముట్టడి.. ఉద్రిక్తత
Education· 11 Jun 2026

హైదరాబాద్ DEO ఆఫీస్‌ ముట్టడి.. ఉద్రిక్తత

TG: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ABVP ఆధ్వర్యంలో హైదరాబాద్ DEO ఆఫీస్‌ను ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ నాయకులు అబిడ్స్‌లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. అధికారులు స్పదించకపోవడంతో ఆఫీస్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ రాజాలిద్దరిదీ అపూర్వ సహోదర బంధం !
Cinema· 11 Jun 2026

ఈ రాజాలిద్దరిదీ అపూర్వ సహోదర బంధం !

భారతీ రాజా, ఇళయ రాజాలది అపూర్వ స్నేహ బంధం.. అది చాలా ఆత్మీయ బంధం.. ఒకరిలో ఒకరు మమేకమైపోయే బంధం. ఇళయరాజా మద్రాస్ వచ్చిన కొత్తలో రూమ్ లేక ఇబ్బంది పడుతుంటే భారతీ రాజా ఏకంగా ఒక ఔట్ హౌస్ అద్దెకు తీసుకుని అందులో ఇళయ రాజాను ఉంచాడు. ఇళయ రాజా మ్యూజికల్ అక్విప్ మెంట్ ను జాగ్రత్త చేసుకోడానికి తన సొంత రూమ్ లో కొంత ప్లేస్ ఇచ్చాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే ప్లేట్ లో తిన్నారు ఒకే మంచంలో పడుకున్నారు కూడా. వారి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషనే కాదు.. అంతకుమించిన అనుబంధం ఉంది. మొదట్లో తిండి కష్టాల నుంచి సినిమా కష్టాల వరకూ చాలానే ఉన్నాయ్ ఇద్దరి మధ్యా!

కంటెంట్ క్రియేటర్ అవ్వాలా? ఈ స్కిల్స్ నేర్చుకోండి!
Technology· 11 Jun 2026

కంటెంట్ క్రియేటర్ అవ్వాలా? ఈ స్కిల్స్ నేర్చుకోండి!

ప్రస్తుతం డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేషన్ అనేది ఒక ప్రొఫెషనల్ కెరీర్ ఆప్షన్. ఇందులో సక్సెస్ అవ్వాలంటే కేవలం ఐడియాస్ ఉంటే సరిపోదు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వీడియో ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం డిజిటల్ మార్కెటింగ్ లేదా కంటెంట్ రైటింగ్ లాంటి కోర్సెస్ బాగా యూజ్ అవుతాయి. సొంతంగా యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్‌స్టా పేజ్ స్టార్ట్ చేసి, రెగ్యులర్‌గా కంటెంట్ పోస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. Note: ఇందులోని సమాచారం అవగాహన కోసం మాత్రమే.

వెయిట్ లాస్  మందులతో ఫుడ్ బిల్స్‌కు బ్రేక్!
Health· 11 Jun 2026

వెయిట్ లాస్ మందులతో ఫుడ్ బిల్స్‌కు బ్రేక్!

యూత్‌లో ఇప్పుడు Weight-Loss Drugs వాడకం తెగ పెరిగిపోతోంది. బ్రిటన్‌లో ఈ మందుల ఎఫెక్ట్‌తో జనాలు జంక్ ఫుడ్, స్నాక్స్ తినడం బాగా తగ్గించేశారు. దీనివల్ల అక్కడ ఏకంగా $1 Billion (సుమారు 8,300 కోట్ల రూపాయలు) విలువైన ఫుడ్ బిల్స్ మిగిలాయని ఓ సర్వేలో తేలింది. ఫిట్‌నెస్ క్రేజ్‌తో ఫుడ్ ఇండస్ట్రీ మార్కెట్ కూడా మారిపోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!

20 ఏళ్లుగా ఫీవరే రాలేదు: బండి సంజయ్▶
TG· 11 Jun 2026

20 ఏళ్లుగా ఫీవరే రాలేదు: బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. PM మోదీ గారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని తాను లాస్ట్ 20 ఇయర్స్ నుండి అసలు ఫీవర్ లేకుండా హెల్తీగా ఉన్నానని చెప్పారు. కానీ, మొన్న హైదరాబాద్‌లో మిల్క్ తాగిన తర్వాత తనకు ఫీవర్ వచ్చి, మూడు రోజులు బెడ్ మీద ఉండిపోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కల్తీ పాల గురించే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

అనుమానం తో స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు!
Crime· 11 Jun 2026

అనుమానం తో స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు!

పంజాబ్‌లోని లుధియానాలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడనే అనుమానంతో జనాలు అతనిపై దారుణంగా అటాక్ చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి, గుండు కొట్టించి, కనుబొమ్మలు కూడా తీసేశారు. అంతటితో ఆగకుండా ‘నేను దొంగను’ అని రాసి ఉన్న బోర్డును అతని చేతిలో పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో, వాళ్లు జూన్ 10న కేసు ఫైల్ చేశారు, దాడి చేసిన వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు.

నందుర్బార్ మహిళల నీటి కష్టం తీరింది!
India· 11 Jun 2026

నందుర్బార్ మహిళల నీటి కష్టం తీరింది!

మహారాష్ట్రలోని నందుర్బార్ గిరిజన ప్రాంత మహిళల దశాబ్దాల నీటి కష్టాలపై 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనానికి అధికారులు స్పందించారు. సుదూర ప్రాంతాల నుండి తలపై భారీ బరువుతో నీళ్లు మోయడం వల్ల అక్కడి మహిళలు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ వార్తతో కదిలిన యంత్రాంగం వెంటనే గ్రామాలకు వాటర్ ట్యాంకర్లను పంపింది. 'ఇన్నాళ్లకు మా ఊరికి ట్యాంకర్ రావడం కలలా ఉందంటూ' స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'మిర్జాపూర్ ది మూవీ' అనౌన్స్‌మెంట్!
Cinema· 11 Jun 2026

'మిర్జాపూర్ ది మూవీ' అనౌన్స్‌మెంట్!

పాపులర్ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై రూపంలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వంటి స్టార్ కాస్టింగ్ యాక్ట్ చేస్తున్నారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం మేకర్స్ ఈ యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి.

AP లిక్కర్ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్!
AP· 11 Jun 2026

AP లిక్కర్ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్!

AP లిక్కర్ స్కామ్ కేసులో ED అధికారులు స్పీడ్ పెంచారు. ఈ స్కామ్‌లో మాజీ మంత్రి, YCP లీడర్ కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన ఇంట్లో ED అరెస్ట్ చేసింది. ఈరోజు మార్నింగ్ సిటీలో పది చోట్ల ఒకేసారి ED రైడ్స్ జరిగాయి. ఈ కేసులో మెయిన్ నిందితుడు రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి ED ఆఫీస్‌కి తీసుకెళ్లారు. ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఇప్పుడు AP, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్‌లో మళ్లీ 'మల్టీస్టారర్'ల ట్రెండ్!
Cinema· 11 Jun 2026

బాలీవుడ్‌లో మళ్లీ 'మల్టీస్టారర్'ల ట్రెండ్!

బాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిన మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది. స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే బిగ్-టికెట్ సినిమాలు భారీ తారాగణంతో, క్రేజీ కాంబినేషన్లతో రెడీ అవుతున్నాయి. . బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా మేకర్స్ ఈ ఫార్ములాను నమ్ముకుంటున్నారు. అక్షయ్ కుమార్ ట్రయో కాంబోలో వెల్కమ్ టుది జంగిల్, సంజయ్ లీలా భన్సాలీ మూవీ లవ్ అండ్ వార్, రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి కాంబోలో రామాయణ ఇలా చాలా మూవీసే వస్తున్నాయి.

USA ఆర్మీ దాడిలో ముగ్గురు ఇండియన్స్ బలి!▶
Politics· 11 Jun 2026

USA ఆర్మీ దాడిలో ముగ్గురు ఇండియన్స్ బలి!

ఒమన్ తీరంలో ఇరాన్ ఆయిల్ తీసుకెళ్తున్న నౌకపై అమెరికా సైన్యం అటాక్ చేసింది. ఈ దాడిలో సముద్రంలో గల్లంతైన ముగ్గురు భారతీయులు చనిపోయినట్లు షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ గారు చెప్పారు. చనిపోయిన వారిలో ఆదిత్య శర్మ, శివానంద్, సురేష్ ఉన్నారు. నౌకలో ఉన్న మిగతా 21 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఇరాన్‌పై ఉన్న ఆంక్షల వల్లే అమెరికా ఈ దాడులు చేస్తోంది.

ఎండిపోయిన నిమ్మకాయలా? పారేయకుండా ఇలా వాడండి!
News· 11 Jun 2026

ఎండిపోయిన నిమ్మకాయలా? పారేయకుండా ఇలా వాడండి!

నిమ్మకాయలు ఎండిపోతే వేస్ట్ అని పారేయకండి, వాటితో చాలా యూజెస్ ఉన్నాయి. ఎండిన నిమ్మకాయ ముక్కలతో సింక్‌ని రుద్దితే మురికి, బ్యాక్టీరియా క్లీన్ అవుతాయి. వీటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి ఫ్రిజ్ లేదా షూ ర్యాక్‌లో పెడితే బ్యాడ్ స్మెల్ పోతుంది. అలాగే, కొంచెం ఉప్పు వేసి రాగి, ఇత్తడి పాత్రలను రుద్దితే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. కిచెన్ మూలల్లో వీటిని పెడితే చీమలు, కీటకాలు కూడా రావు!

'ఉప్పల్ భగాయత్ భూములను ఆక్రమించుకుంటాం'
Politics· 11 Jun 2026

'ఉప్పల్ భగాయత్ భూములను ఆక్రమించుకుంటాం'

TG: జులై 2న ఉప్పల్ భగాయత్ భూములను భూపోరాటం ద్వారా ఆక్రమించుకుంటామని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలంపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఫైరయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ భూమి ఉద్యమకారులదేనని, భూమి కోసం కొట్లాడింది తామే అని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసమే ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు.

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్..
Politics· 11 Jun 2026

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్..

రాజ్యసభ నామినేషన్ రిజెక్షన్‌పై మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. అయితే, ఇప్పుడే ఎలాంటి ఇంటర్మీడియట్ ఆర్డర్స్ ఇవ్వలేమని కోర్ట్ క్లియర్ గా చెప్పేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను రేపటికి పోస్ట్‌పోన్ చేశారు. మీనాక్షి నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది, రేపు కోర్టులో ఏం జరగబోతోంది అనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.