Latest

AP లిక్కర్ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్!
AP లిక్కర్ స్కామ్ కేసులో ED అధికారులు స్పీడ్ పెంచారు. ఈ స్కామ్‌లో మాజీ మంత్రి, YCP లీడర్ కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన ఇంట్లో ED అరెస్ట్ చేసింది. ఈరోజు మార్నింగ్ సిటీలో పది చోట్ల ఒకేసారి ED రైడ్స్ జరిగాయి. ఈ కేసులో మెయిన్ నిందితుడు రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి ED ఆఫీస్‌కి తీసుకెళ్లారు. ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఇప్పుడు AP, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్‌లో మళ్లీ 'మల్టీస్టారర్'ల ట్రెండ్!
బాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిన మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ మళ్లీ ఊపందుకుంటోంది. స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే బిగ్-టికెట్ సినిమాలు భారీ తారాగణంతో, క్రేజీ కాంబినేషన్లతో రెడీ అవుతున్నాయి. . బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా మేకర్స్ ఈ ఫార్ములాను నమ్ముకుంటున్నారు. అక్షయ్ కుమార్ ట్రయో కాంబోలో వెల్కమ్ టుది జంగిల్, సంజయ్ లీలా భన్సాలీ మూవీ లవ్ అండ్ వార్, రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి కాంబోలో రామాయణ ఇలా చాలా మూవీసే వస్తున్నాయి.
USA ఆర్మీ దాడిలో ముగ్గురు ఇండియన్స్ బలి!
ఒమన్ తీరంలో ఇరాన్ ఆయిల్ తీసుకెళ్తున్న నౌకపై అమెరికా సైన్యం అటాక్ చేసింది. ఈ దాడిలో సముద్రంలో గల్లంతైన ముగ్గురు భారతీయులు చనిపోయినట్లు షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ గారు చెప్పారు. చనిపోయిన వారిలో ఆదిత్య శర్మ, శివానంద్, సురేష్ ఉన్నారు. నౌకలో ఉన్న మిగతా 21 మందిని రెస్క్యూ టీమ్ కాపాడింది. ఇరాన్‌పై ఉన్న ఆంక్షల వల్లే అమెరికా ఈ దాడులు చేస్తోంది.

ఎండిపోయిన నిమ్మకాయలా? పారేయకుండా ఇలా వాడండి!
నిమ్మకాయలు ఎండిపోతే వేస్ట్ అని పారేయకండి, వాటితో చాలా యూజెస్ ఉన్నాయి. ఎండిన నిమ్మకాయ ముక్కలతో సింక్‌ని రుద్దితే మురికి, బ్యాక్టీరియా క్లీన్ అవుతాయి. వీటిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి ఫ్రిజ్ లేదా షూ ర్యాక్‌లో పెడితే బ్యాడ్ స్మెల్ పోతుంది. అలాగే, కొంచెం ఉప్పు వేసి రాగి, ఇత్తడి పాత్రలను రుద్దితే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. కిచెన్ మూలల్లో వీటిని పెడితే చీమలు, కీటకాలు కూడా రావు!

'ఉప్పల్ భగాయత్ భూములను ఆక్రమించుకుంటాం'
TG: జులై 2న ఉప్పల్ భగాయత్ భూములను భూపోరాటం ద్వారా ఆక్రమించుకుంటామని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల స్థలంపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఫైరయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ భూమి ఉద్యమకారులదేనని, భూమి కోసం కొట్లాడింది తామే అని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసమే ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు.

మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్..
రాజ్యసభ నామినేషన్ రిజెక్షన్‌పై మీనాక్షి నటరాజన్ వేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. అయితే, ఇప్పుడే ఎలాంటి ఇంటర్మీడియట్ ఆర్డర్స్ ఇవ్వలేమని కోర్ట్ క్లియర్ గా చెప్పేసింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను రేపటికి పోస్ట్‌పోన్ చేశారు. మీనాక్షి నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది, రేపు కోర్టులో ఏం జరగబోతోంది అనే దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.
ఢిల్లీలో రేవంత్ రెడ్డి, విజయ్!
తెలంగాణ CM రేవంత్ రెడ్డి, తమిళనాడు CM విజయ్ న్యూ ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఇంపార్టెంట్ మీటింగ్‌లో స్టేట్ డెవలప్‌మెంట్, ఫండ్స్, అలాగే కొత్త ప్రాజెక్ట్స్‌పై డిస్కస్ చేయబోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల CM లు, టాప్ పొలిటికల్ లీడర్స్ ఈ మీటింగ్‌కి అటెండ్ అయ్యారు.

ఘోర ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
TG: నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి వద్దనున్న నేషనల్ హైవేపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. నాగ్‌పూర్ వైపు నుంచి ఆలుగడ్డల లోడ్‌తో హైదరాబాద్ వైపు వస్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కన నిలిపివేశాడు. జొన్నల లోడ్‌తో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ, పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన లారీ డ్రైవర్ జవారి సింగ్ లారీ క్యాబిన్‌లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.

హైదరాబాద్‌లో భారీ స్కామ్.. ఆరుగురు దొరికేశారు!
హైదరాబాద్‌లో క్యూనెట్ పేరుతో జరిగిన ఒక పెద్ద మోసాన్ని CCS పోలీసులు పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మెయిన్‌గా జాబ్స్ లేని వాళ్లని, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌ని టార్గెట్ చేసింది. కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించి, ఒక్కొక్కరి దగ్గర ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు వసూలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ల్యాప్‌టాప్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని పోలీసులు సీజ్ చేశారు. ఈ స్కామ్ ఫుల్ డీటెయిల్స్‌ని బంజారాహిల్స్ ICCC ఆఫీస్‌లో జరిగే ప్రెస్‌మీట్‌లో, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చెప్పబోతున్నారు.

ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొటీన్ పౌడర్స్ బదులు, ఇంట్లోనే నాచురల్‌గా తయారు చేసుకోవచ్చు. బాదం, వేయించిన వేరుశెనగ, జీడిపప్పు (ఒక్కో కప్పు), ఓట్స్, అవిసె గింజలు (అర కప్పు), గుమ్మడి గింజలను లైట్‌గా ఫ్రై చేసి, చల్లార్చాక మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి మిక్స్ చేసి ఎయిర్ టైట్ జార్‌లో దాచుకోవచ్చు. రోజూ 1-2 స్పూన్ల పౌడర్‌ను మిల్క్ తో తీసుకుంటే మజిల్ గ్రోత్ బాగుంటుంది, బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది. Note: ఇందులోని ఇన్ఫర్మేషన్ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది.

మళ్లీ పడిపోయిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ధరలివే!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ వరుసగా రెండో రోజు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,45,640 కి, 22 క్యారెట్ల ధర ₹1,33,500 కి పడిపోయింది. US-ఇరాన్ టెన్షన్స్ వల్ల డాలర్ వాల్యూ పెరగడంతోనే గోల్డ్ మార్కెట్ డౌన్ అయిందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సిల్వర్ రేట్స్‌లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. సో, గోల్డ్ కొనే ముందు రేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి!

ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45), రేణుక దంపతులు. రేణుకకు గంగాశేఖర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అడ్డుగా ఉన్న రాజయ్యను తొలగించుకోవాలని, అంతేకాకుండా రాజయ్య చనిపోతే ఆయన పేరు మీదున్న ఇన్సూరెన్స్ సొమ్ము తమకే దక్కుతుందని ప్లాన్ వేశారు. రేణుక, గంగాశేఖర్ పథకం ప్రకారం రాజయ్యకు మద్యం తాగించి ఐరన్ రాడ్‌తో కొట్టి హత్యచేశారు. అనుమానం రాకుండా రోడ్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. నేరం అంగీకరించడంతో నిందితులు రేణుక, గంగాశేఖర్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హత్య చేసి డెడ్‌బాడీని గోనె సంచిలో కట్టి..
AP: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామపరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య తీవ్ర కలకలం రేపింది. మృతుడు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భూవివాదానికి సంబంధించి రవికుమార్ శతకోడు గ్రామంలోని పొలానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం డెడ్‌బాడీని గోనె సంచిలో పెట్టి బండరాళ్లతో కట్టి నీటిలో పడేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భూవివాదమే హత్యకు కారణమా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
TG: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామశివారులోని నాగార్జునసాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు కార్లు నుజ్జునుజ్జవగా ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇరాన్ దాడిలో ఇద్దరు పైలట్లు సేఫ్.. ఆపరేషన్ సక్సెస్
వాషింగ్టన్: ఇరాన్ దాడిలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను కాపాడిన మానవరహిత డ్రోన్ బోట్ (సీ బోట్) హిస్టరీ క్రియేట్ చేసింది. అమెరికాకు చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ హర్మూజ్ జలసంధి సమీపంలో ప్యాట్రోలింగ్ చేస్తుండగా ఇరాన్ దాడిచేసింది. హెలికాప్టర్ ఒమన్ తీరం దగ్గరలో కూలిపోయింది. పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికా నౌకాదళ టాస్క్‌ఫోర్స్ 59 రంగంలోకి దిగింది. కోర్ ఎయిర్ అటానమస్ డ్రోన్ బోట్ సహాయంతో వారిద్దరినీ నీటిలో నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అమెరికా తొలిసారిగా చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

విశాఖ బీచ్‌లో యువకుడు గల్లంతు
AP: విశాఖ బీచ్‌లో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు వుడా పార్కు వెనుక సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన డెడ్‌బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అది మన్ కుమార్(19) మృతదేహమేనని గుర్తించి నిర్ధారించారు. పోస్టుమార్టం నిమ్మితం కింగ్ జార్జ్ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మామిడిపండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి
TG: మామిడిపండ్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురై ఆస్పతిపాలైన అక్కాచెల్లెళ్లు చికిత్స పొందుతూ మరణించారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన వైజినాథ్, ఇందుమతి దంపతులకు మొత్తం నలుగురు కుమార్తెలు. వీరు ఉపాధి కోసం బీదర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. నారాయణగూడలోని విఠల్‌వాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమార్తెలు భువనేశ్వరి (17), సంధ్య (10) మామిడి పండ్లను తిని అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

CM అసమర్థతతోనే నగరవాసులకు నరకయాతన: KTR
TG: CM రేవంత్‌రెడ్డి అసమర్థత, బాధ్యతారాహిత్యంతో హైదరాబాద్ నగరవాసులు నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైరయ్యారు. వర్షంతో ఎదురైన ఇబ్బందులను చక్కదిద్దాల్సిన సీఎం తొలి వానకే నగరం అతలాకుతలమైందని అంగీకరించడం సిగ్గుచేటు అని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. వర్షానికి హైదరాబాద్ వాసులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి నాలుగు గంటల పాటు నరకయాతన పడితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరంటే ఒక్కరూ స్పందించలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలర్ పట్టుకుని సర్పంచ్‌పై మహిళ దాడి
TG: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామ సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్‌పై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ కాలర్ పట్టుకొని దాడి చేసింది. జోగిపేట తహసీల్దార్ ఆఫీస్‌లో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం సుశీల అనే మహిళకు చెందిన భూమిని సర్పంచ్ కుటుంబీకులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని సర్పంచ్‌పై దాడి చేసింది. సర్పంచ్ అనుచరుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా ఆ మహిళ అతని కాలర్ పట్టుకొని కొద్దిదూరం ఈడ్చుకొచ్చి దాడి చేసింది.

శాఖల సమన్వయ లోపం.. వాహనదారులకు నరకం
TG: వర్షాకాలం నేపథ్యంలో అన్నిశాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన సంస్థ ఆధ్వర్యంలో జరగాల్సిన సన్నద్ధతపై దృష్టిసారించలేదు. హైడ్రా హడావుడి చూసి.. అన్ని పనులను హైడ్రానే చూసుకుంటుందని మూడు కార్పొరేషన్లు చేతులెత్తేశాయి. గతంలో నగరంలో GHMC ఒక్కటే ఉండేది. తర్వాత హైడ్రా వచ్చింది. తాజాగా మరో రెండు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వరదలో చిక్కుకొని సుమారు మూడులక్షల మంది వాహనదారులు అర్థరాత్రి వరకు రోడ్లపై పడిగాపులు కాస్తే అధికారులు కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైటెక్ సిటీలో 15ఏకరాల భూమికి కంచె
TG: హైటెక్ సిటీలోని ఖానామెట్ గ్రామంలో అరబిందో టవర్స్ పక్కనున్న 15ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్‌లోని సర్వే నంబర్లు 41/12, 13, 14లో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమి సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. స్థలాన్ని ఖాళీ చేయాలంటూ 2016లో TGIIC ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ భూమి తమదేనంటూ ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పిటిషనర్ సమర్పించిన పట్టా పత్రాలు నకిలీవి అని తేలింది.