← Back to news

పార్టీ మీటింగ్ లో కుర్చీలతో కొట్టుకున్న TDP కార్యకర్తలు!

By sahani· 11 Jun 2026· X· AndhraPradesh

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో TDP కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. మండల TDP ప్రెసిడెంట్ ప్రత్తిపాటి ఉమామహేశ్వరి మిగతా లీడర్లకు, కార్యకర్తలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఒక మీటింగ్ పెట్టారు. దీనిపై స్థానిక లీడర్స్ ఆమెను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

More in Politics