← Back to news

OG సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

By DK· 6 Jun 2026· Samayam· ప్రకాశం జిల్లా
OG సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

AP: ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కోటేశ్వరమ్మ అనారోగ్యంగా ఉండడంతో కుటుంబసభ్యులు వడ్లమూడిలోని డీవీసీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు న్యూరోసర్జన్ అరుణకుమార్ పలు వైద్యపరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు పరిశీలించి కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ ఉందని దానిని తొలగించాలని సూచించారు. మత్తు ఇవ్వకుండా మెలుకువగా ఉన్నప్పుడే సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. ఏదైనా సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తిచేయాలని నిర్ణయించారు. ఆమెకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా OGని డాక్టర్లు కోటేశ్వరమ్మకు చూపిస్తూ సర్జరీచేశారు.

More in AP