← Back to news

అత్యాచారం కేసు.. ఎట్టకేలకు లొంగిపోయిన సీఐ

By DK· 6 Jun 2026· Hmtvlive· పల్నాడు జిల్లా
అత్యాచారం కేసు.. ఎట్టకేలకు లొంగిపోయిన సీఐ

AP: పల్నాడు జిల్లా వినుకొండ PSలో సీఐ చినమల్లయ్య లొంగిపోయారు. తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఏప్రిల్‌ 29న ఫిర్యాదు చేసింది. దీంతో బ్రాహ్మణపల్లిలో సీఐ చిన్న మల్లయ్యపై కేసు నమోదైంది. ఘటన తర్వాత సీఐ చిన మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా, బెయిల్‌ పిటిషన్‌ను ఇరు కోర్టులు డిస్మిస్‌ చేశాయి. అరెస్ట్ తప్పదని భావించిన సీఐ చిన మల్లయ్య వినుకొండ పోలీస్‌స్టేషన్‌లో సరెండర్‌ అయ్యారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.