Latest

కాక్రోచెస్ వస్తున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు!▶
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ వస్తున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాక్రోచ్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన వెంటనే రాజీనామా చేయాలంటూ గట్టిగా నినాదాలు చేశారు. మనం కట్టే టాక్స్‌ల నుంచే ఆయన శాలరీ తీసుకుంటున్నారని, కానీ ఆయన పదవిలో ఉన్నప్పుడే లక్షలాది మంది యూత్ భవిష్యత్తు చీకట్లోకి వెళ్ళిపోయిందని ప్రొటెస్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాక్రోచెస్ వస్తున్నారు.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’ అంటూ X లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్లోగన్స్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త
Crime· 6 Jun 2026

అనుమానంతో భార్యను కిరాతకంగా చంపిన భర్త

TG: భార్యపై అనుమానంతో భర్త రాడ్‌తో దాడిచేసి చంపాడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన కోమలి (31), అవినాష్‌ దంపతులు ఆరునెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. అత్తాపూర్‌ తేజస్వీనినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోమలి వాచ్‌మెన్‌‌గా చేస్తూ అదే భవనంలోని పలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తోంది. భర్త అవినాష్‌ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆలస్యంగా ఇంటికొస్తోందనే అనుమానంతో అవినాష్ కత్తి, స్క్రూడ్రైవర్, రాడ్‌తో దాడిచేసి భార్యను నడిరోడ్డుపై చంపాడు.

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ కి చేరుకున్న అభిజీత్ దీప్కే!
Politics· 6 Jun 2026

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ కి చేరుకున్న అభిజీత్ దీప్కే!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఫౌండర్ అభిజీత్ దీప్కే ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రొటెస్ట్ స్పాట్ కి చేరుకున్నారు. ఆయన రాకతో వేలాది మంది ప్రొటెస్టర్స్ ఒక్కసారిగా అక్కడ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి, పీఎం నరేంద్ర మోదీ కూడా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రొటెస్టర్స్ గట్టిగా నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

డిజిటల్ స్పీడ్ కి "స్లో లుకింగ్" సొల్యూషన్
General· 6 Jun 2026

డిజిటల్ స్పీడ్ కి "స్లో లుకింగ్" సొల్యూషన్

ఈ డిజిటల్ యుగంలో గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూడడం వల్ల మనకు ఫోకస్ బాగా తగ్గిపోయింది. యావరేజ్ అటెన్షన్ స్పాన్ కేవలం 8.25 సెకన్లకు పడిపోయింది. నిజానికి మన మెదడు బలహీనపడలేదు. డిస్ట్రాక్షన్లు పెరిగాయి. యాప్స్ వాడకం ఎక్కువైపోయి ఏ పనిపైనా ఎక్కువసేపు దృష్టి పెట్టలే కపోతున్నామని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే స్లో లుకింగ్ అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 5 నిమిషాలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒకే వస్తువును లేదా ప్రకృతిని గమనించడం వల్ల మెదడు రీఛార్జ్ అవుతుంది. ఏకాగ్రత పెరిగి మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Flowers తో కాక్రోచెస్ ప్రొటెస్ట్!▶
Politics· 6 Jun 2026

Flowers తో కాక్రోచెస్ ప్రొటెస్ట్!

జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో చేతిలో పూలు పట్టుకుని ఉన్న ఒక కాక్రోచ్ ని రిపోర్టర్ ఎందుకు పూలు తెచ్చావని అడిగారు. దానికి ఆ కాక్రోచ్ సమాధానమిస్తూ. మన దేశంలో ప్రొటెస్ట్ చేస్తే వెంటనే యాంటీ నేషనల్ అనే ముద్ర వేస్తారని. తాము కేవలం మిలియన్ల కొద్దీ స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై ఆక్షన్ తీసుకోవాలని, బాధ్యతగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడానికి మాత్రమే ఈ పూలు తెచ్చామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

OG సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ
AP· 6 Jun 2026

OG సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ

AP: ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కోటేశ్వరమ్మ అనారోగ్యంగా ఉండడంతో కుటుంబసభ్యులు వడ్లమూడిలోని డీవీసీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు న్యూరోసర్జన్ అరుణకుమార్ పలు వైద్యపరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు పరిశీలించి కోటేశ్వరమ్మ మెదడులో గడ్డ ఉందని దానిని తొలగించాలని సూచించారు. మత్తు ఇవ్వకుండా మెలుకువగా ఉన్నప్పుడే సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు. ఏదైనా సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తిచేయాలని నిర్ణయించారు. ఆమెకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమా OGని డాక్టర్లు కోటేశ్వరమ్మకు చూపిస్తూ సర్జరీచేశారు.

జంతర్ మంతర్ దగ్గర యంగ్ ప్రొటెస్టర్స్!▶
Politics· 6 Jun 2026

జంతర్ మంతర్ దగ్గర యంగ్ ప్రొటెస్టర్స్!

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న ప్రొటెస్ట్‌లో యూత్ భారీగా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు యంగ్ ప్రొటెస్టర్స్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో జరుగుతున్న ఇలాంటి సిట్యువేషన్స్ లో మనమందరం బయటకు వచ్చి సపోర్ట్ చేయడం చాలా ముఖ్యమని వాళ్ళు చెప్పారు. జెన్ జీ వాయిస్ వినిపించడానికే ఇక్కడికి వచ్చామన్నారు. ప్రస్తుతం ఈ యంగ్ ప్రొటెస్టర్స్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం లూటీ
AP· 6 Jun 2026

లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం లూటీ

AP: చిత్తూరు జిల్లాలో లిక్కర్ లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. చిత్తూరు-పుత్తూరు మార్గంలో బసిరెడ్డిపల్లి సమీపంలో వ్యాన్ బోల్తా పడడంతో మద్యం సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఆ దారిలో వెళ్లే వారు మద్యం బాక్సులు ఎత్తుకుపోయారు. మరికొందరు లుంగీలు, టవళ్లలో మద్యం సీసాలు దోచుకెళ్లారు. సీసాల కోసం ఎగబడిన వారిలో మహిళలు సైతం ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అంతా సర్దుకుపోయారు.

భారీ సెక్యూరిటీ మధ్య కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్!▶
Politics· 6 Jun 2026

భారీ సెక్యూరిటీ మధ్య కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్!

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రొటెస్ట్‌కి భారీగా జనాలు తరలివచ్చారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ సెక్యూరిటీ పెట్టారు. ఈ ప్రొటెస్ట్‌లో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ అందరూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రొటెస్ట్‌కు సంబంధించిన లైవ్ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

'జై భీమ్' స్టేట్మెంట్ తో ఎంట్రీ ఇచ్చిన కాక్రోచ్ పార్టీ చీఫ్!▶
Politics· 6 Jun 2026

'జై భీమ్' స్టేట్మెంట్ తో ఎంట్రీ ఇచ్చిన కాక్రోచ్ పార్టీ చీఫ్!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చీఫ్ అభిజీత్ దీప్కే అమెరికా నుండి ఇండియాకు తిరిగొచ్చారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వగానే ఆయన చేతిలో ‘అంబేద్కర్ బుక్’ పట్టుకుని, ‘జై భీమ్’ అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. జంతర్ మంతర్ దగ్గర జరగబోయే పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ కోసమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చిన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కాక్రోచెస్ ప్రొటెస్ట్ కి పోలీసులు గ్రీన్ సిగ్నల్!
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ ప్రొటెస్ట్ కి పోలీసులు గ్రీన్ సిగ్నల్!

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ కాబోతుందంటూ అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ (X) లో పోస్ట్ చేశారు. దీనికి పోలీస్ పర్మిషన్ కూడా దొరికిందని చెప్పారు. అయితే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కి కాకుండా, ప్రొటెస్టర్స్ అందరూ డైరెక్ట్‌గా జంతర్ మంతర్ దగ్గరికే రావాలని కోరారు. ఉదయం 10AM కే ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతుందని, ‘కాక్రోచెస్’ అందరూ వచ్చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు:  DK అరుణ
Politics· 6 Jun 2026

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు: DK అరుణ

TG: ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులకు ఇవ్వడంలేదని మహబూబ్‌నగర్ MP డీకే అరుణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ.. గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.

ముళ్లపొదళ్లో YSR విగ్రహం
Politics· 6 Jun 2026

ముళ్లపొదళ్లో YSR విగ్రహం

AP: కర్నూలు జిల్లా కోడుమూరులో YSR విగ్రహాన్ని దుండగులు ముళ్లపొదలలో వేశారు. మాజీ YCP ఎమ్మెల్యే సుధాకర్ అనుచరుడు అద్దుగల రాజశేఖర్ రెడ్డి కర్నూలు ప్రధాన రహదారిలో తన స్ధలంలో ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం రాజశేఖర్ రెడ్డి వైసీపీని వీడారు. సంవత్సరం క్రితం గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనుకుని ఎదురుచూసిన YSR అభిమానులకు నిరాశే మిగిలింది. స్ధల యజమానే తొలగించి వుంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ చేరుకున్న అభిజిత్ దీప్కే▶
India· 6 Jun 2026

ఢిల్లీ చేరుకున్న అభిజిత్ దీప్కే

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఫౌండర్ అభిజిత్ దీప్కే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు జరగాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఈ నిరసన జరుగుతోంది. ఢిల్లీ పోలీసులు కూడా ఈ కార్యక్రమానికి అనుమతినిచ్చారు.

తెలంగాణలోకి 9న నైరుతి !
General· 6 Jun 2026

తెలంగాణలోకి 9న నైరుతి !

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కదలికల ఆధారంగా తెలంగాణలోకి ఈ నెల 9న నైరుతి ప్రవేశించవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళూరు, ఊటీ, కొడైకెనాల్, తూత్తుకూడి మీదుగా నైరుతి కదులుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇంకా అనుకూల వాతావరణం ఏర్పడితే ఒక్క రోజు ముందుగా 8నే రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది.

అర్హతలు లేకుండా వైద్యం.. నకిలీ డాక్టర్ గుట్టురట్టు
Crime· 6 Jun 2026

అర్హతలు లేకుండా వైద్యం.. నకిలీ డాక్టర్ గుట్టురట్టు

TG: హన్మకొండలోని ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడి చేశారు. బత్తుల రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మొత్తం 41రకాల మందులను స్వాధీనం చేసుకున్నారు. యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి ముప్పు అని మందుల శాంపిల్స్‌ను విశ్లేషణకు పంపారు. కేసు నమోదు చేసినట్లు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

భారత్ గ్రాండ్ మాస్టర్ కొత్త హిస్టరీ
Sports· 6 Jun 2026

భారత్ గ్రాండ్ మాస్టర్ కొత్త హిస్టరీ

భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రతిష్టాత్మకమైన Norway Chess 2026 టైటిల్‌ను గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమెర్ ను ఓడించి 18 పాయింట్లతో ఛాంపియన్‌గా నిలిచాడు. టోర్నీ మధ్యలో ప్రజ్ఞానంద్ వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుని టైటిల్ సొంతం చేసుకున్నాడు. విశేషమేమిటంటే, ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్లసన్ సొంత గడ్డపైనే ఈ ఘనత సాధించాడు.

హార్మూజ్ లో మళ్లీ యుద్ధ వాతావరణం
World· 6 Jun 2026

హార్మూజ్ లో మళ్లీ యుద్ధ వాతావరణం

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లు వాణిజ్య నౌకలకు ముప్పుగా మారుతుందని అమెరికా సైన్యం వాటిని సక్సెస్ ఫుల్ గా కూల్చేసింది. ఆ తర్వాత ఇరాన్‌ తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులకు దిగింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన జలసంధిలో యుద్ధవాతావరణం నెలకొనడం ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది.

 రజనీ భార్య కొత్త సామాజిక వేదిక.. - మక్కల్ మడై !
Politics· 6 Jun 2026

రజనీ భార్య కొత్త సామాజిక వేదిక.. - మక్కల్ మడై !

సూపర్ స్టార్ రజనీ కాంత్ భార్య లత తమిళనాట మక్కల్ మడై అనే సరికొత్త సామాజిక వేదికను ప్రారంభించారు.. ప్రజల సమస్యలను వినడానికి, మహిళలు, పిల్లలు, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడేందుకు దీనిని ఏర్పాట్లు చేసినట్లు ఆమె ప్రకటించారు.రాస్ట్రం కోసం పనిచేయాలనుకునే వారంతా ఇందులో భాగం కావచ్చని ప్రకటించారు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదని లత అన్నారు. అయితే దీనిని భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. సీఎం విజయ్ కూడా ఇలాంటి వేదికతోనే బాగా పాపులర్ అయి ఆ తర్వాత పొలిటికల్ అరంగేట్రం చేశారు.

ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న నైజీరియన్ జంట !
India· 6 Jun 2026

ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న నైజీరియన్ జంట !

ఢిల్లీలో హోటల్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో ఓ నైజీరియా జంట ఈ యాక్సిడెంట్ నుంచి సేఫ్ గా బయటపడింది.ఫైర్ యాక్సిడెంట్స్ అప్పుడు సెఫ్టీ మెజర్స్ మీద ఐడియా ఉన్న ఆ జంట బాత్ రూమ్ లో షవర్ ఆన్ చేసి నేలపై తువ్వాళ్లు పరుచుకుని రన్నింగ్ వాటర్ కింద తక్కువ ఎత్తులో పడుకుని సహాయం అందే వరకూ అలాగే ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ పైకి లేచి గదిలో పై భాగంలో పేరుకు పోతుంది. అందువల్ల షవర్ ఆన్ చేసి నేలకు దగ్గరగా ఉంటే ప్రమాదం బారిన పడకుండా ఉండొచ్చని తెలిపారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆన్‌లైన్ క్యాంపెయిన్..!
Politics· 6 Jun 2026

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆన్‌లైన్ క్యాంపెయిన్..!

'గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌'పై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆన్ లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. #GreenOverGreed, #NicobarMatters హ్యాష్‌ట్యాగ్స్‌తో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. నికోబార్ దీవుల్లో స్కూబా డైవింగ్‌తో పగడపు దిబ్బలను విధ్వంసం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.