కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు: DK అరుణ

TG: ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప నిజమైన అర్హులకు ఇవ్వడంలేదని మహబూబ్‌నగర్ MP డీకే అరుణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ.. గాలి మాటలు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు.


