← Back to news

తెలంగాణలోకి 9న నైరుతి !

By AR· 6 Jun 2026
తెలంగాణలోకి 9న నైరుతి !

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కదలికల ఆధారంగా తెలంగాణలోకి ఈ నెల 9న నైరుతి ప్రవేశించవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళూరు, ఊటీ, కొడైకెనాల్, తూత్తుకూడి మీదుగా నైరుతి కదులుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో ఇంకా అనుకూల వాతావరణం ఏర్పడితే ఒక్క రోజు ముందుగా 8నే రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది.

More in General