Latest

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదు: కడియం
TG: గత 12ఇయర్స్‌గా తెలంగాణ డెవలప్‌మెంట్‌కు కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణ స్టేట్ ఏర్పడడమే ప్రధాని మోడీకి, బీజేపీ పార్టీకి ఇష్టంలేదన్నారు. అందుకే తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల నిజంగా వివక్ష లేకుంటే వెంటనే కాజీపేట రైల్వే డివిజన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ప్రెస్‌మీట్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్‌ను తిట్టడానికే మంత్రి పదవులు ఇచ్చాడని ఏద్దేవా చేశారు.

అంగన్‌వాడీల్లో ఇకపై రోజూ బ్రేక్‌ఫాస్ట్!
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్న పిల్లల కోసం గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ తీసుకొస్తోంది. జూన్ 12 నుంచి అంగన్‌వాడీల్లో 'అల్పాహార పథకం' (బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్) స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ దీనిని ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా చిన్న పిల్లలకు ప్రతిరోజూ మంచి పోషకాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ పెడతారు. ఈ జిల్లాల్లో గనుక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, ఆ తర్వాత దీనిని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తారు.

మీ ఫ్రిడ్జ్ లో ఛీజ్, బటర్ ని స్టోర్ చేయండి ఇలా...
ఫ్రిజ్ లో ఛీజ్, బటర్ ప్లాస్టిక్ కవర్ లో పెట్టి స్టోర్ చేస్తున్నారా? బీ కేర్ ఫుల్.. అవి ఒక్కోసారి మీ ప్రాణాలే తీయచ్చు. చీజ్ ను ప్లాస్టిక్ కవర్ లో ఉంచడం వల్ల ఛీజ్ ఎండి పోకుండా ఉండొచ్చు..కానీ దానిపై ఏర్పడే తడి కారణంగా అక్కడ లిస్టీరియా లాంటి బాక్టీరియా డెవలప్ కావొచ్చు. తద్వారా మీ హెల్త్ రిస్క్ లో పడిపోతుంది. చీజ్, బటర్ లాంటివి తెచ్చిన వెంటనే సాధ్యమైనంత త్వరగా వాడేయటం మంచిది. పాజిబులిటీ లేకపోతే దానిని పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో ఉంచమంటున్నారు. న్యూట్రిషనిస్టులు. పేపర్ చుట్టడం వల్ల గాలి తగిలి బాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏర్పడే ఛాన్సెస్ తక్కువట.

పవన్ కళ్యాణ్‌కు సివియర్ బ్యాక్ పెయిన్!
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మీటింగ్ నుండి మధ్యలోనే వెళ్ళిపోయారు. అమరావతిలో Secretariat లో జరుగుతున్న మీటింగ్ కి ఆయన attend అయ్యారు. అయితే మీటింగ్ జరుగుతుండగానే పవన్ కళ్యాణ్‌కు సడన్‌గా seviour Back Pain రావడంతో ఆయన మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు సమాచారం. ఈ హెల్త్ ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటైల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
యాక్సిడెంట్ అయినా తగ్గేదేలే!
ఇది సినిమా స్టంట్ కాదు, AI Video అసలే కాదు. ట్రాఫిక్ కెమెరాలో రికార్డ్ అయిన రియల్ incident. రోడ్డుపై వెళ్తున్న ఒక స్కూటర్ రైడర్.. ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను గట్టిగా ఢీకొట్టాడు. ఆ ఇంపాక్ట్‌కి అతను గాల్లోకి లేచి, సరిగ్గా ఎదురుగా వస్తున్న ఒక పెద్ద ట్రక్ పై ఎగిరిపడ్డాడు. కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే! అంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ రైడర్ ఏమాత్రం కంగారు పడకుండా, వెంటనే తేరుకుని ఏమీ జరగనట్టు సైలెంట్‌గా లేచి అక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

మంటల్లో వెల్లి విరిసిన మానవత్వం... పరుపుల దుకాణం ఓనర్ పెద్ద మనసు
ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టేస్' హోటల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. అయితే, అక్కడ ఎదురుగా ఉన్న ఒక పరుపుల దుకాణం యజమాని రియాజుద్దీన్ మన్సూరి, అతని కుమారుడు అర్మాన్ చూపిన మానవత్వం మరిన్ని ప్రాణాలను కాపాడింది.తమ వ్యాపార నష్టాన్ని సైతం లెక్కచేయకుండా, సుమారు ₹2 లక్షల విలువైన 20-22 కొత్త పరుపులను, రగ్గులను బిల్డింగ్ కింద పరిచారు. దీనివల్ల పై అంతస్తుల్లో చిక్కుకున్న వారు కిందకు దూకి ప్రాణాలు దక్కించుకోగలిగారు.

నీటికుంటలో పడి నలుగురు చిన్నారులు గల్లంతు
AP: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం విలేజ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న నీటికుంటలో పడి గల్లంతయ్యారు. చిన్నారుల ఆర్తనాదాలు, కేకలు విన్న స్థానికులు నీటికుంటలో దూకి గాలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారులు దినేశ్(10), పొందిలి చిన్ను(11), కరేటి సుశాంత్(12), కరేటి అభిరామ్(14)లు గల్లంతైనట్లు గుర్తించారు. తమ పిల్లల ఆచూకీ దొరకకపోవడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఢిల్లీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్ లో కంటతడిపెట్టించే ఎమోషనల్ విజువల్స్ !!
ఢిల్లీలోనిFlourish Stay BnB హోటల్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో బాధితులు చనిపోయిన తీరు చాలా పెయిన్ ఫుల్ గా కనిపిస్తోంది. ఒక జంట ఒకరినొకరు హత్తుకుని కాలి బూడిదైపోయారు. మంటలనుంచి తప్పించుకోడానికి వారు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకున్నారు. రక్షించడానికి వచ్చిన మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి ఆ తలుపులు బద్దలుకొట్టి చూడగా.. వారు ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని చనిపోయారు. మంటల వల్ల కాకుండా, దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. మరొక రూమ్ లో ఒక జంట బెడ్ అంచుల్లో కూర్చున్న వారు అదే పొజిషన్ లో కాలిపోయారు.

PV సింధు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుకు ఇండోనేషియా ఓపెన్‌లో మరోసారి షాక్ తగిలింది. ఈరోజు జరిగిన రౌండ్-ఆఫ్-16 మ్యాచ్‌లో సౌత్ కొరియాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆన్ సే-యంగ్ చేతిలో సింధు ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆన్ సే-యంగ్ 17-21, 14-21 స్కోర్‌తో సింధుపై ఈజీగా గెలిచింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య జరిగిన మొత్తం 10 మ్యాచ్‌ల్లోనూ సింధు ఓడిపోయింది. లాస్ట్ వీక్ జరిగిన సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌లో కూడా సింధు ఓటమి ఫేస్ చేసిన సంగతి తెలిసిందే.

భార్యను చంపి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
TG: కుటుంబ కలహాలతో భర్త భార్యపై కత్తితో దాడిచేసి చంపాడు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న ఆస్మరా బేగం(24), షేక్ రహీంలకు 2024లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మ్యారేజ్ అయినప్పటి నుంచి వీరికి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో దంపతులిద్దరూ వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వారి మధ్య గొడవ జరగడంతో రహీం కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం డైరెక్ట్‌గా రహీం స్థానిక PSలో లొంగిపోయాడు.
పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేడు!
జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నిరుద్యోగ JAC లీడర్ జనార్ధన్ గట్టిగా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏ సభలో మాట్లాడినా స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేరని. ఆయనకు ప్రజా సమస్యలపై అస్సలు అవగాహన లేదని అన్నారు. పవన్ మాటల్లో ఓన్లీ సినిమా డైలాగులే ఉంటాయని, సమస్యల తీవ్రత గురించి ఆయనకు ఏమాత్రం తెలీదని కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 15ఇయర్స్ పైనే అయినా, ప్రెసెంట్ డిప్యూటీ CM పొజిషన్‌లో ఉన్నా. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాల్లోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారంటూ జనార్ధన్ సెటైర్లు వేశారు.

రాజ్య సభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్ !!
తమిళనాడులో టీవీకే కి ఉన్న ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించారు సీఎం విజయ్. కాంగ్రెస్ సీనియర్ నేత గిరీష్ చోడంకర్ భేటీ అయిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ఈ రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ వ్యూహకర్త ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏఐఏడీఎంకే (AIADMK) నేత సి.వి. షణ్ముగం రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. మైనారిటీ టీవీకే ప్రభుత్వ స్థిరత్వానికి కాంగ్రెస్ మద్దతు చాలా ముఖ్యం. టీవీకేకు సొంతంగా పూర్తి మెజారిటీ లేకపోవడంతో, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఇక్కడ కీలకంగా మారింది.
తరతరాలకు స్ఫూర్తి వియత్నాం హ్యూమన్ బ్రిడ్జ్... ఎందుకో తెలుసా?
వియత్నాం యుద్ధ కాలం నాటి ఓ గగుర్పాటు కలిగించే చారిత్రక సత్యం ఇది. అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించి అక్కడి వంతెనలన్నింటినీ కూల్చేసింది. సైన్యం ముందుకు వెళ్లే దారి మూసుకుపోయింది. కానీ అక్కడి మహిళలంతా కలిసి స్వయంగా ఒక "హ్యూమన్ బ్రిడ్జ్"లా మారారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, వియత్నామీస్ సైనికులు నది దాటడానికి దారినిచ్చారు. చరిత్ర పుటల్లో ఇదొక చెరిగిపోని దృశ్యం! తుపాకులు, బాంబులు తాత్కాలిక భయాన్ని సృష్టించగలవేమో గానీ... ఒక జాతి సంకల్పాన్ని మాత్రం ఏ శక్తీ లొంగదీసుకోలేదు అనడానికి వియత్నాం మహిళల త్యాగమే అతిపెద్ద నిదర్శనం! సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
లైఫ్ రిస్క్ చేసి వాటర్ లోకి దూకిన పోలీస్!
ఉత్తరప్రదేశ్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడారు. వాటర్ లో మునిగిపోతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను చూసిన ఆ పోలీస్, ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వాటర్ లోకి దూకారు. చాలా స్పీడ్ గా ఆమె దగ్గరికి తాడు హెల్ప్ తో వెళ్ళి, సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు. కరెక్ట్ టైమ్‌లో రెస్పాండ్ అయ్యి ప్రాణాలు కాపాడిన ఈ పోలీస్‌ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ప్రెసెంట్ ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

లంగ్ కేన్సర్ రోగులకు వరం -7నిమిషాల్లో రిలీఫ్ ఇచ్చే ఇంజెక్షన్..
ఊపిరి తిత్తుల కేన్సర్ తో బాధపడేవారికి ఏడు నిమిషాల్లో పనిచేసే సరికొత్త ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ధర మాత్రం రూ.3.7 లక్షలు. అయితే దీనికి ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్ చేసుకునే వెసులు బాటు ఉంది. ఈ డ్రగ్ పేరు అటెజోలిజుమాబ్ (Atezolizumab).. దీనిని టెసెంట్రిక్ (Tecentriq) అనే బ్రాండ్ పేరుతో పిలుస్తారు. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి కేన్సర్ కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. గ్లోబల్ ఫార్మా కంపెనీ రోచ్ ఈ సరికొత్త ఇంజెక్షన్ ను ఇండియాలో కూడా విడుదల చేసింది.
మట్టిలో చిక్కుకున్న తాబేలు
సోషల్ మీడియాలో ఒక హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఒక బీచ్ పక్కన మట్టిలో పూర్తిగా ఇరుక్కుపోయి, కదలలేని స్థితిలో ఉన్న పెద్ద తాబేలును ఒక వ్యక్తి చూసి, తన చేతులతో మట్టిని తవ్వి కష్టపడి ఆ తాబేలును బయటకు తీశాడు. ఆ తర్వాత అది సముద్రంలో కలిసిపోయింది. జంతువుల పట్ల అతను చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

పులి సంచారం భయం భయం.. హైఅలెర్ట్
AP: పోలవరం జిల్లా దేవిపట్నం మండలం గంగపాలెం విలేజ్‌లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. స్థానిక కొండ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియోకాలర్ సిగ్నల్స్ ఆధారంగా, డ్రోన్ల సాయంతో దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారంతో గండిపోచమ్మ టెంపుల్‌కు వెళ్లే రహదారులను అధికారులు క్లోజ్ చేశారు. గంగపాలెం చుట్టుపక్కల ఉన్న గిరిజన, మైదాన ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ అనౌన్స్ చేశారు. ఎవరూ ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని సూచించారు.

అమీర్‌పేట్ KSR షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫైర్ యాక్సిడెంట్
TG: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ KSR ఫ్యాషన్స్‌లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్‌లో ఎగిసిపడ్డ మంటలు క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఆన్‌లైన్ నుండి గ్రౌండ్ లెవెల్ ల్లో 'కాక్రోచెస్ జనతా పార్టీ’
ఓన్లీ సోషల్ మీడియా లోనే కాకుండా.. ‘కాక్రోచెస్ జనత పార్టీ’ (CJP) ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌లో స్ట్రాంగ్ ఆర్గనైజేషన్‌గా మారుతోంది. ఆల్రెడీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్‌ని అనౌన్స్ చేసిన CJP, జూన్ 6న ఢిల్లీ ప్రొటెస్ట్‌కి ఫుల్ గా ప్రిపేర్ అవుతోంది. లీగల్ యాక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని తెలిసినా ఫౌండర్ అభిజీత్ దిప్కే ఇండియాకి రిటర్న్ వస్తున్నారు. వీళ్ళ మూమెంట్‌కి మెయిన్ పొలిటికల్ పార్టీల నుండి కూడా రెస్పాన్స్ వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కాక్రోచెస్ జనత పార్టీ ఫస్ట్ ప్రెస్ మీట్ updates!
కాక్రోచెస్ జనతా పార్టీ (CJP) స్పోక్స్ పర్సన్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ ఢిల్లీలో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. జూన్ 6th మార్నింగ్ 8AM కి అభిజీత్ దిప్కే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కాబోతున్నారని అనౌన్స్ చేశారు. అక్కడి నుండి సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి అందరూ పార్లమెంట్ స్ట్రీట్‌కి చేరుకుంటారని, జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ కోసం పర్మిషన్ అడుగుతామని చెప్పారు. ఈ ప్రొటెస్ట్‌కి అన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు.
యంగ్ కాక్రోచెస్ తో సోనమ్ వాంగ్‌చుక్!
"మనం కాకపోతే ఇంకెవరూ? ఇప్పుడే కాకపోతే ఇంకెప్పుడు?" అంటూ ప్రముఖ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ సోషల్ మీడియాలో ఒక పవర్‌ఫుల్ పోస్ట్ చేశారు. లక్షలాది మంది యూత్ ఫ్యూచర్ spoile అవుతుంటే, కనీస గౌరవం ఉన్న ఏ మినిస్టర్ అయినా రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 5 లోపు పరిస్థితులు మారకపోతే, జూన్ 6th ఢిల్లీలో 'CJP' మెంబర్స్‌తో కలవబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ పోస్ట్ ప్రెసెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.