Latest

పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్స్!
తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై యాక్టర్ ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ సెటైర్లు వేశారు. "మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి బాస్.. కానీ వచ్చే ముందు సింగిల్ గా వస్తున్నారా? లేదా ఎవరితోనైనా పొత్తుతో వస్తున్నారా? అది చెప్పి రండి" అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రెసెంట్ ఈ పొలిటికల్ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రకాష్ రాజ్: షూటింగ్‌లో ఉన్నా సరే.. ఆ రోజు అక్కడికి వస్తా!
ఈ నెల 6న జరగబోయే 'కాక్‌రోచ్ మూమెంట్' ప్రోగ్రామ్‌కి యాక్టర్ ప్రకాష్ రాజ్ తన మద్దతు ప్రకటించారు. ప్రెసెంట్ ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కొంచెం దూరంగా ఉన్నానని, అయినప్పటికీ ఆ రోజు ఎలాగైనా అక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "యంగ్ కాక్రోచెస్ అందరూ అక్కడికి రండి" అంటూ యూత్‌కి పిలుపునిచ్చారు.

ఈ రోజు గోల్డ్ రేట్ ఎంతో తెలుసా?
గోల్డ్ రేట్స్ వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.110 తగ్గి రూ.1,56,110 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,100 గా ఉంది. ఇక సిల్వర్ రేట్ అయితే భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో ఇప్పుడు ధర రూ.2,85,000 కి చేరింది. మిగతా నగరాల్లోనూ ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి. నోట్: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి, సో కొనే ముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.

చేపల చెరువులో విషప్రయోగం.. 4 లక్షల నష్టం
TG: చేపల చెరువులో దుండగులు విషం కలపడంతో 3క్వింటాళ్ల చేపలు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పేరుమాండ్ల సంకీస గ్రామ శివారులోని రెడ్డి చేపల చెరువులో గుర్తుతెలియని వ్యక్తులు విషం కలిపారు. సుమారు 3 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడడంతో దాదాపు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రామాపురం బీచ్‌లో యువతి గల్లంతు
AP: సముద్ర తీర విహారం ఓ ఫ్యామిలికి విషాదంగా మారింది. చీరాల మండలం రామాపురం బీచ్‌లో పల్నాడు జిల్లా రావులపాలెం విలేజ్‌కు చెందిన నాగలక్ష్మి(26) తన కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లింది. సముద్రంలో దిగగా ఒక్కసారిగా పెద్దఎత్తున వచ్చిన అలల ధాటికి ఆమె గల్లంతయింది. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, గజ ఈతగాళ్లు వెంటనే నాగలక్ష్మి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బయటపడుతున్న యూట్యూబర్ మోసాల చిట్టా
AP: ఉద్యోగాలు, వీసా రెన్యువల్ పేరుతో యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరుకు చెందిన జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. 'నందూస్ వరల్డ్ పేరుతో నందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వీరికి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, తదితర ఏరియాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ ఆఫీస్‌లు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.20లక్షల వరకు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని, 50మందికిపైగా బాధితులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని రమానందన పేర్కొన్నారు.

వైరల్ ప్రపోజల్.. ఇప్పుడు ఆర్మీ షోకాజ్ ?
ఆర్మీ అధికారి కెప్టెన్ భరత్ భరద్వాజ హెలికాప్టర్ దగ్గర మోకాళ్లపై గర్ల్ ఫ్రెండ్ ప్రొపోజల్ SMలో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. కానీ ఆ లవ్ స్టోరీ కొత్త ట్విస్ట్ తీసుకుంది. ఆయన ఆర్మీ నిబంధనలు ఉల్లంఘించారా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ పూర్తయిన వెంటనే ఆర్మీ హెలికాఫ్టర్ ముందు కూర్చొని యూనిఫామ్ లో పర్సనల్ కార్యక్రమాలు చేయడం ఎంతవరకు రైట్ అన్న దిశగా విచారణ జరుగుతోంది. నెటిజన్లు వారి ప్రేమను ప్రశంసిస్తూ ఉంటే ఆర్మీ మాత్రం ఆయనకు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి సిద్దమవుతోంది.

పవన్.. అలా చేస్తే మరో కేఏ పాల్ అవుతారు: చనగాని దయాకర్
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ స్పందించారు. తెలంగాణకు వచ్చి సినీ గ్లామర్‌ను పాలిటిక్స్‌కు వాడుకుంటాను అనుకుంటే జనం దృష్టిలో మరో కేఏ పాల్ అవుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో ఫ్యాన్స్ ఉన్నారని, ఆయన ఇక్కడి ప్రజలతో హుందాగా వ్యవహరించాలన్నారు. తెలంగాణను ఎలా డెవలప్ చేసుకోవాలో తమకు తెలుసని, పక్క స్టేట్ నుంచి పెయిడ్ ఆర్టిస్టులు, అద్దె లీడర్లు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదన్నారు.

ఏపీలో ఇన్వెస్ట్ చేయండి- ఎలిమెంట్ గ్రూప్ కు లోకేష్ ఇన్విటేషన్
రష్యా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి లోకేష్ రాష్ట్రంలోకి కొత్త ఇన్వెస్ట్ మెంట్స్ ను ఆహ్వానించడానికి ట్రై చేస్తున్నారు. ఎలిమెంట్ గ్రూప్ రిప్రజెంటేటివ్స్ తో భేటి అయిన లోకేష్ విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్, నెల్లూరులో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రం,శ్రీ సిటీలో రోబోటిక్స్ అండ్ ఆటో మేషన్ సేవల విస్తరణకు ఆహ్వానించారు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో ఇన్ వాల్వ్ అవ్వాలని కోరారు. ఏపి ప్రభుత్వం ప్రపోజల్స్ పరిశీలించి పాజిటివ్ గా రియాక్ట్ అవుతామని ఎలిమెంట్ గ్రూప్ రిప్రజెంటేటివ్స్ చెప్పారు.

NEETలో మరో భారీ స్కామ్ ..! ప్రభుత్వ కాలేజీలో సీటుకి రూ.20 లక్షల డీల్
NEET రీ ఎగ్జామ్ కి స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతున్న వేళ మరో సంచలన స్కామ్ వెలుగులోకి వచ్చింది. రూ.20 లక్షలు ఇస్తే గవర్నమెంట్ కాలేజీల్లో మెడికల్ సీటు ఇప్పిస్తామని కొందరు బ్రోకర్లు వల వేస్తున్నారు. దీనికి స్టూడెంట్ చేయాల్సిందల్లా ఎగ్జామ్ లో OMR షీట్‌లో ఆన్సర్స్ ఖాళీగా వదిలేస్తే.. ఆ తర్వాత వాటిని మానిప్యులేట్ చేసి గవర్నమెంట్ మెడికల్ సీటు ఇప్పిస్తారట. అలా 20 లక్షలకు డీల్ మాట్లాడిన ఒక బ్రోకర్ బండారాన్ని అలహాబాద్ కు చెందిన శుభమ్ బయటపెట్టాడు. ఫోన్ కాల్ రికార్డు చేసి దానిని పంపించి నీట్ కు ఫిర్యాదు చేశాడు.

6న జంతర్ మంతర్ వద్ద CJP భారీ నిరసన
ఇన్‌స్టాగ్రామ్‌లో కోటిమందికి పైగా ఫాలోవర్లతో వైరల్ అయిన Cockroach Janta Party (CJP) భారీ నిరసనకు సిద్ధమైంది. ఈ పార్టీ ప్రతినిధులు విజేత దహియా, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. NEET పేపర్ లీక్స్, CBSE ఎగ్జామ్స్ వివాదాలపై వీరు గళమెత్తబోతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే వీరి ప్రధాన డిమాండ్. అమెరికా నుంచి వస్తున్న పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే నేతృత్వంలో ఈ నిరసన జరగనుంది. ప్రధాన్ రాజీనామా చేసేదాక నిరసనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఈ పార్టీలో ఎవరైనా చేరవచ్చునని వారు పిలుపునిచ్చారు.

డ్రోన్ దాడులతో కంపించిన కువైట్ ఎయిర్ పోర్ట్... ఎటు చూసినా పొగే !!
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. విమానాశ్రయం టెర్మినల్-1 పూర్తిగా దెబ్బతినడంతో విమాన రాకపోకలను నిలిపివేశారు. దీనిని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ "నేరపూరిత ఇరాన్ దురాక్రమణ"గా ఖండించింది. భద్రతా చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు. విమానాశ్రయ భవనం దట్టమైన పొగతో నిండిపోగా, లోపలి గోడలు, అద్దాలు ధ్వంసమైనట్లు దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ట్రంప్‌కు సొంత పార్టీ షాక్
ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగించడానికి వీల్లేదంటూ War Powers Resolutionను అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. 215-208 ఓట్లతో ఆమోదం పొందిన ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ అనుమతి లేనిదే ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకోకూడదు. అయితే ఇది అమల్లోకి రావాలంటే సెనేట్ ఆమోదం, ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది.

ప్రతీ ఉదయం.. ప్రతిఒక్కరికీ ఎంతో ప్రత్యేకం
ప్రతీ ఉదయం ప్రతిఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైంది. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించడానికి ఉదయం చాలా ముఖ్యమైన సమయం. నిద్ర లేవడం ఫోన్ పట్టుకుని స్టేటస్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్లతో మునిగిపోకుండా సూర్యోదయం ముందే లేవాలి. ఇలా తొందరగా నిద్ర లేవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచి, శక్తిని పెంచుతుంది. ఆలస్యంగా లేవడం అలసటకు, నీరసానికి కారణమవుతుంది. బాల్కనీలో లేదా బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. ఉదయపు వ్యాయామం లేదా యోగా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ డైలీ ఫోలో అయితే శరీరం ఆరోగ్యంగా, మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ పై కామెడీ చేసి దుబాయ్ లో ఇరుక్కున్న స్టాండప్ కమెడియన్
సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో కారణంగా ముంబైకి చెందిన స్టాండప్ కమెడియన్ యశ్ భరద్వాజ్ దుబాయ్‌లో 47 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత మే 5న ఆయనను భారతదేశానికి డిపోర్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో దుబాయ్‌లో గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదంటూ ఆయన సరదాగా ఒక కామెడీ రీల్ అప్‌లోడ్ చేశారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అక్కడ జీపీఎస్ సమస్యలు తలెత్తుతున్న సమయంలో ఈ వీడియో పెట్టడంతో, దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన దుబాయ్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తన జీవితంలో ఇది అత్యంత కష్టమైన కాలమని యశ్ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

త్వరలో గాళ్ ఫ్రెండ్ ను పెళ్లాడబోతున్న ఆమీర్ ఖాన్
బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ జులై 5న తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ గౌరీ స్ప్ర ట్ ను మ్యారేజ్ చేసుకోబోతున్నారు.గతేడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ తన ప్రేయసిని మీడియాకు పరిచయం చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో గౌరీ తన ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.దాదాపు 18 నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆయన, గత సంవత్సరం మీడియాతో మాట్లాడుతూ.. "ఆమె బెంగళూరులో ఉండేది, కాబట్టి నేను ఆమెను కలవడానికి అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మీడియా నిఘా తక్కువగా ఉండటం వల్ల మా విషయం బయటకు రాలేదు" అని సరదాగా జోక్ చేశారు. గతంలో ఆమీర్ రీనా దత్తా, కిరణ్ రావులను పెళ్లి చేసుకున్నారు.

టీఎంసీలో క్రైసిస్... మమతా బెనర్జీకి ట్రబుల్స్ !!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో పెను సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ రతీంద్ర బోస్ గుర్తించారు. పార్టీలోని 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఆయనకు మద్దతు పలికారు. దీంతో మమతా బెనర్జీ పార్టీపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు, మమతా బెనర్జీ సమర్పించిన లేఖలోని సంతకాలు ఫోర్జరీ అని తేలడంతో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ తన పదవికి రాజీనామా చేశారు.
కేటిఆర్ కామెంట్స్ పై పవన్ కల్యాణ్ రిప్లయ్ !!
కేటీఆర్ ఏమన్నారో తనకు తెలియదని, తాను వినలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్నటి తన ప్రెస్ మీట్ పై బీఆర్ ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ ను ఆయన దృష్టికి తేగా ఈ కామెంట్స్ చేశారు. కేటీఆర్ తనకు మంచి దోస్త్ అనీ, చాలా సార్లు ఆయన్ను కలసినట్లు, ఇద్దరికీ మంచి టేస్ట్ లు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆయన మంచిగానే మాట్లాడి ఉంటారని అన్నారు.

AP రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు!..మరో 500 సిఎన్జి బస్సులు
ఆర్టీసీలో కాలం చెల్లిన, ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దశలవారీగా మొత్తం 6వేల బస్సులు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందులో విద్యుత్ బస్సులు 5,500, సీఎన్జీ బస్సులు 500 ఉంటాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సిటీ బస్సుల్లో కాలం చెల్లినవి ఏవేవి ఉన్నాయో, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అవే సర్వీసులుగా నడపనున్నారు. ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు రాష్ట్రానికి కేటాయించారు. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. వీటిలో 300 బస్సులు జులైలో రోడ్డెక్కనున్నాయి.

అమెరికాలో మధు యాష్కీ భార్యకు కారు ప్రమాదం ః తీవ్రగాయాలు
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సతీమణికి అమెరికాలో కారు యాక్సిడెంట్ అయ్యింది.కుమార్తె గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. బోస్టన్ నుంచి న్యూయార్క్ కు వస్తుండగా భారీ వర్షం కారణంగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది.డాక్టర్ కూడా అయిన సుచీ యాష్కీకి రిబ్స్ విరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి జంట రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. లగేజీ ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ వేర్వేరు కార్లలో ట్రావెల్ చేస్తున్నారు. మధు యాష్కీ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ సుచీ పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు..

వైసీపీ ఆఫీస్‌పై దాడికి యత్నం.. ఉద్రిక్తత
AP: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ లీడర్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వైసీపీ ఆఫీస్‌పై దాడికి యత్నించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు టౌన్‌లోని వైఎస్సాఆర్ సీపీ ఆఫీస్‌పై టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు వెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.