Latest

తెలంగాణలో ప్రత్యామ్నాయం TRS: నల్లమాస శ్రీకాంత్
Politics· 3 Jun 2026

తెలంగాణలో ప్రత్యామ్నాయం TRS: నల్లమాస శ్రీకాంత్

TG: తెలంగాణ స్టేట్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలంగాణ రక్షణ సేననే అని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జ్ డాక్టర్ నల్లమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో రెండేళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ పవర్‌లోకి వస్తుందన్నారు. గిరిజన జిల్లాగా ఉన్న మానుకోటలో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.

'బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది'
Politics· 3 Jun 2026

'బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది'

TG: గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం విలేజ్‌లో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సబ్ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పేదలు ఆకలితో ఉండవద్దని ఒక్కోవ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం: మంత్రి అడ్లూరి
Politics· 3 Jun 2026

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం: మంత్రి అడ్లూరి

TG: తెలంగాణ మీ జాగీరా అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో గోదావరి పుష్కరాల పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీరేనని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను హీరోగా అందరూ అభిమానిస్తారని, కానీ తెలంగాణపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం సహించమన్నారు.

పవన్ కళ్యాణ్: హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉంది!▶
Politics· 3 Jun 2026

పవన్ కళ్యాణ్: హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉంది!

AP ప్రజలు ఓటు వేసి గెలిపించినా కూడా.. తన ఇల్లు ఉన్నది మాత్రం హైదరాబాద్‌లోనే అని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రెసెంట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. APలో పెద్ద పోస్ట్‌లో ఉంటూ, "హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉంది" అని పవన్ అనడం సోషల్ మీడియాలో పొలిటికల్ చర్చకు దారితీసింది.

పవన్ కళ్యాణ్: 100% తెలంగాణ మీదే!▶
Politics· 3 Jun 2026

పవన్ కళ్యాణ్: 100% తెలంగాణ మీదే!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా జరిగిన కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అనేది 100% అక్కడి మట్టి బిడ్డలదే అని స్పష్టం చేశారు. తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని కొందరు అంటున్నారని, అలాంటి వాళ్లను ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చిందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అసలు తెలంగాణ భారతదేశంలో భాగం కాదా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ప్రెసెంట్ #JanaSenaTelangana హ్యాష్‌ట్యాగ్‌తో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

డిజిటల్ ల్లో BRS మెంబర్‌షిప్!▶
Politics· 3 Jun 2026

డిజిటల్ ల్లో BRS మెంబర్‌షిప్!

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ మెంబర్స్‌కి ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల నుంచే BRS పార్టీ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను డిజిటల్ మోడ్‌లో స్టార్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రాబోయే ఒక నెల రోజుల పాటు పార్టీ కోసం ఫుల్ గా కష్టపడి పనిచేయాలని లీడర్స్, వర్కర్లకు పిలుపునిచ్చారు.

కన్నతల్లిపైనే అత్యాచార యత్నం!▶
Politics· 3 Jun 2026

కన్నతల్లిపైనే అత్యాచార యత్నం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగ్గదాపురంలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి ఫుల్‌గా ఆల్కహాల్ తీసుకొని, కన్నతల్లిపైనే రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ తల్లి గట్టిగా కేకలు వేయడంతో అలర్ట్ అయిన గ్రామస్తులు వెంటనే అక్కడికి వెళ్లారు. సీన్ చూసి షాక్ అయిన లోకల్స్. నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఇన్సిడెంట్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

కోమటిరెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓపెన్ చాలెంజ్!▶
Politics· 3 Jun 2026

కోమటిరెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓపెన్ చాలెంజ్!

మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌పై EX మినిస్టర్, BRS MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఆంధ్రా ప్రజలకు ఒక్క కాంట్రాక్ట్ కూడా దక్కకూడదని, దానికోసం ఒక చట్టం తెస్తానని కోమటిరెడ్డి అనడంపై తలసాని కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే మీ CMని ఒప్పించి ఒక చట్టం తీసుకురావాలని, అలా తెస్తే తాను వెంటనే MLA పోస్ట్‌కి రిజైన్ చేయడానికి రెడీ అని తలసాని ఓపెన్ చాలెంజ్ చేశారు. ప్రెసెంట్ ఈ పొలిటికల్ వార్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

కర్ణాటక CMగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం!▶
Politics· 3 Jun 2026

కర్ణాటక CMగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం!

కర్ణాటక పాలిటిక్స్‌లో ఎన్నో రోజుల నుండి wait చేస్తున్న బిగ్ మూమెంట్ రానే వచ్చింది. కర్ణాటక కొత్త CMగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు కాంగ్రెస్ టాప్ లీడర్స్ అంతా వచ్చారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేరళ CM సతీశన్, అలాగే తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా ఈ సెర్మనీకి అటెండ్ అయి డీకే శివకుమార్‌కి కంగ్రాట్స్ చెప్పారు. ప్రెసెంట్ ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కూతురు కౌంటర్!▶
Politics· 3 Jun 2026

పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కూతురు కౌంటర్!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు. పవన్ మాటలను ఖండిస్తూ. "తెలంగాణ కచ్చితంగా మా ముత్తాతల జాగీరే,ఇప్పుడు మా జాగీరు, రేపు పొద్దున మా పిల్లల జాగీరే అవుతుంది. ఎన్నో త్యాగాలు చేసి మేము తెలంగాణను సాధించుకున్నాం అంతే తప్ప. ఎవరో డబ్బులు ఇచ్చి, లాబీయింగ్ చేసి తెచ్చింది కాదు" అని వెన్నెల ఫైర్ అయ్యారు. గద్దర్ కూతురు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.

సింగిల్ ఎగ్జిట్.. ఇల్లీగల్ రూమ్స్ ... ఢిల్లీ ఘోరానికి రీజన్స్
India· 3 Jun 2026

సింగిల్ ఎగ్జిట్.. ఇల్లీగల్ రూమ్స్ ... ఢిల్లీ ఘోరానికి రీజన్స్

ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగిన బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ BnB దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ రూమ్స్ నిర్మించడంతో ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంది. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో బయటపడే మార్గం లేక అది కాస్తా డెత్ ట్రాప్ గా మారింది. కనీసం ఫైర్ సేఫ్టీ లేకపోవడమే ఈ ఘోరానికి కారణమని తేలింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

తెలంగాణ లో 91 మంది ఖైదీలు రిలీజ్!▶
News· 3 Jun 2026

తెలంగాణ లో 91 మంది ఖైదీలు రిలీజ్!

తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. జైల్లో మంచిగా ఉంటూ గుడ్ behaviour చూపించిన 91 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ రిలీజ్ అయిన వాళ్లలో 85 మంది మెన్, అలాగే ఆరుగురు ఉమెన్ ఖైదీలు ఉన్నారని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా చెప్పారు. ఖైదీల మైండ్‌సెట్‌లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడమే కాకుండా, జైళ్లను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మారుస్తున్నామని ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఈ ఫేక్ న్యూస్ అస్సలు నమ్మొద్దు!
Politics· 3 Jun 2026

ఈ ఫేక్ న్యూస్ అస్సలు నమ్మొద్దు!

సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక మెసేజ్‌పై IPS ఆఫీసర్ V.C. సజ్జనార్ గట్టిగా రియాక్ట్ అయ్యారు. వాట్సాప్ కాల్స్ అన్నీ రికార్డ్ అవుతున్నాయంటూ వస్తున్న న్యూస్ లో అస్సలు నిజం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. "ఇలాంటి విషయాలపై పాస్ట్‌లోనే చాలా సార్లు క్లారిటీ ఇచ్చాం. అయినా సరే కొందరు కావాలనే ఈ అబద్ధాలను షేర్ చేస్తున్నారు" అని ఆయన చెప్పారు. రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్స్‌గా ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని, ఎవరికీ షేర్ చేయొద్దని సజ్జనార్ చెప్పారు. ఇలాంటి తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లపై పోలీస్ యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

ఈ అడిషనల్ SP కి ఆదాయానికి మించిన ఆస్తులు?
Politics· 3 Jun 2026

ఈ అడిషనల్ SP కి ఆదాయానికి మించిన ఆస్తులు?

తెలంగాణలో ACB టీమ్స్ బిగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆల్రెడీ సస్పెండ్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ ఎన్. భుజంగరావు టార్గెట్‌గా ACB రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, సూర్యాపేటలోని ఆయన ఇల్లు, అలాగే ఆయన బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 15 లొకేషన్లలో ACB టీమ్స్ ఒకేసారి చెకింగ్ చేస్తున్నాయి. ఈ ఆస్తుల కేసులో ACB ఇలాంటి యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు పోలీస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

CM విజయ్ విగ్రహం వైరల్!▶
Politics· 3 Jun 2026

CM విజయ్ విగ్రహం వైరల్!

తమిళనాడులో దళపతి విజయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ మైండ్ బ్లోయింగ్ వీడియో చూడండి. తిరుచిరాపల్లికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే ఒక ఫ్యాన్ ఏకంగా తన ఇంట్లోనే విజయ్ విగ్రహాన్ని పెట్టుకున్నాడు. అంతేకాదు, తన పూజ గదిలో ఆ విగ్రహాన్ని పెట్టి దేవుడిలాగే డైలీ హారతి ఇస్తూ, స్పెషల్ పూజలు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో ఫుల్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు "విజయ్ మీద అభిమానం పీక్స్ కి వెళ్తుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఢిల్లీ రెస్టారెంట్ అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవ దహనం▶
India· 3 Jun 2026

ఢిల్లీ రెస్టారెంట్ అగ్ని ప్రమాదంలో 21 మంది సజీవ దహనం

ఢిల్లీలో మాలవీయ నగర్ లో ఒక రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. అయిదు అంతస్తున్నలున్న BnB రెస్టారెంట్ లో ఉదయం 9 గంటల ప్రాంతంలో బేస్ మెంట్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టి 40 మంది వరకు ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఫారిన్ టూరిస్టులు అధికంగా ఉన్నారు.

BJP కంటే వాళ్లకే ఎక్కువ ఫాలోవర్స్!▶
Politics· 3 Jun 2026

BJP కంటే వాళ్లకే ఎక్కువ ఫాలోవర్స్!

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR BJPని టార్గెట్‌ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "పాస్ట్ లో ఒక ప్రోగ్రామ్‌లో నేను GenZ మూవ్‌మెంట్ వస్తుందని చెప్తే అందరూ నవ్వారు. కానీ ఈరోజు CJI అన్న ఒక మాటను పట్టుకుని 'కాక్రోచ్ జనతా పార్టీ' అని పెడితే. సోషల్ మీడియాలో అసలైన BJP కంటే కూడా దానికే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు" అని KTR గుర్తు చేశారు. ఇప్పుడున్న యూత్‌లో BJP గవర్నమెంట్ మీద ఫుల్ డిస్సపాయింట్‌మెంట్ ఉంది అంటూ KTR కామెంట్స్ చేశారు.

రోడ్ యాక్సిడెంట్‌లో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు
AP· 3 Jun 2026

రోడ్ యాక్సిడెంట్‌లో పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు

TG: విశాఖపట్నం జిల్లా లొడగలవానిపాలెం హైవైపై జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో డాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. రియాలిటీ షో ఢీ జోడి ఫేం డాన్స్ మాస్టర్ పండు తగరవలసలో పదహారేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఊరిపండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో హైవేపై కారు దిగి రోడ్డు పక్కన నిల్చున్నారు. అదే టైమ్‌లో వేగంగా వచ్చిన బొలెరో వాహనం పండు మాస్టర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో మాస్టర్ రెండుకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

చంద్రబాబు చెప్పిన 20 ఏళ్ల ప్లాన్ ఇదే!▶
Politics· 3 Jun 2026

చంద్రబాబు చెప్పిన 20 ఏళ్ల ప్లాన్ ఇదే!

AP CM చంద్రబాబు నాయుడు అమరావతి గురించి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. "నేను ఈ రోజు చెబుతున్నా. రాబోయే 20-25 years లో వరల్డ్ లో ఎక్కడ ఉన్న పేషెంట్లు అయినా సరే, ట్రీట్‌మెంట్ కోసం మన అమరావతికే వచ్చే సిట్యువేషన్ వస్తుంది" అని ఆయన ఫుల్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. అమరావతిని నెక్స్ట్ లెవెల్ మెడికల్ హబ్‌గా మార్చబోతున్నామనే రేంజ్‌లో CM చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ ఫ్లాగ్ ని అవమానించిన అమెరికన్స్! ▶
Viral· 3 Jun 2026

ఇండియన్ ఫ్లాగ్ ని అవమానించిన అమెరికన్స్!

అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లో ఒక లోకల్ పర్సన్ దారుణమైన పని చేశాడు. ఇండియన్ ఫ్లాగ్ ను రోడ్డుపై కొంతమంది చూస్తుండగా చింపేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ పర్సన్ చేసిన పని చూసి ఇండియన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.

భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్‌.. అలిపిరిలో టెన్షన్
Politics· 3 Jun 2026

భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్‌.. అలిపిరిలో టెన్షన్

AP: వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ సమీపంలో వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన అభినయ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకుంది. అభినయ్ రెడ్డితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్, పసుపులేటి సురేష్, మల్లం రవిచంద్ర రెడ్డి, గీతా యాదవ్, వాసు యాదవ్‌లను అరెస్ట్ చేసి అలిపిరి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో వీధి వ్యాపారుల సమస్యలపై రాజకీయ రగడ స్టార్ట్ అయింది.