Latest
పవన్ కళ్యాణ్: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తమిళనాడు పాలిటిక్స్ అండ్ యాక్టర్ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. "నేను 2007 నుంచే పాలిటిక్స్‌లో ఉన్నాను, రాజకీయం నాకు కొత్తేమీ కాదు. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకుంటూ చాలా కష్టపడ్డాను. కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ వేరు, విజయ్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ గా వేరు" అని పవన్ అన్నారు. అలాగే తమిళనాడు పాలిటిక్స్ గురించి చెప్తూ. "మన దగ్గర ఉన్నట్టు అక్కడ గొడవలు ఉండవు, తమిళనాడులో అసలు కాస్ట్ పాలిటిక్స్ అనేవే ఉండవు" అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.

RBI బంగారం అమ్మలేదట..! కేంద్రం క్లారిటీ
రూపాయి విలువను కాపాడేందుకు RBI ₹1 లక్ష కోట్ల ($12 బిలియన్) విలువైన బంగారం అమ్మిందంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. Bloomberg Economics విశ్లేషణ ఆధారంగా ఈ ప్రచారం జరగగా, RBI బంగారం విక్రయించిందన్న వాదనలో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇటీవల ఫారెక్స్ నిల్వలు $681.4 బిలియన్లకు తగ్గినా, అందుకు బంగారం ధరల్లో మార్పులు, విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ తగ్గడమే కారణమని తాజా నివేదికలు చెబుతున్నాయి.
తెలంగాణపై పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్..
తెలంగాణపై తనకున్న కమిట్‌మెంట్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "తెలంగాణ కోసం నేను నిలబడటం అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది కాదు. 2009లోనే ప్రజారాజ్యం 'యువరాజ్యం' లీడర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్స్, గద్దర్ గారితో కలిసి 'తెలంగాణ సామాజిక న్యాయ సభ'లో పార్టిసిపేట్ చేశాను" అని పవన్ గుర్తు చేశారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అపోసిట్గా ఉన్నా, తాను ఓపెన్‌గా సపోర్ట్ ఇచ్చానని చెప్పారు. తన సపోర్ట్ ఎప్పుడూ రాజకీయం కోసం కాదని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ కోసమేనని పవన్ క్లారిటీ ఇచ్చారు.

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి సూసైడ్
TG: లోన్ ఏజెంట్ల వేధింపులకు ఓ యువతి సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన రోజా రమణి (26) దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆమె బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించకలేక సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రోజా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోజూ సైకిల్ తొక్కడం ప్రాక్టీస్ చేయండి : కేంద్ర క్రీడా శాఖ మంత్రి
ఇవాళ World Bicycle day. ఈ సందర్భంగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ దేశ యువతకి ఒక విజ్ఞప్తి చేశారు. సైకిల్ తొక్కడం వల్ల యువత గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుందని, వారికి ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవాటవుతుందని చెప్పారు. ప్రతీ రోజూ సైకిల్ తొక్కడం ప్రాక్టీసు చేయమన్నారు. సో ఫ్రెండ్స్ రోజుకో అరగంట సైకిల్ తొక్కండి బాస్.. పోయేదేముంది. మీ ఆరోగ్యం మెరుగడం తప్ప…

పెద్దపులి సంచారం.. పాడిరైతులు టెన్షన్ టెన్షన్
AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెం విలేజ్‌లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. మంగళవారం రాత్రి పశువులపై దాడి చేసి 16 దూడలు, ఒక గేదెను చంపేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో భారీగా పశువులు ఉండటంతో పాడి రైతులు టెన్షన్ పడుతున్నారు. పులి సంచారంతో సమీపంలోని గండి పోచమ్మ అమ్మవారి టెంపుల్‌కు వెళ్లే భక్తులను పోతవరం వద్ద ఫారెస్ట్ ఆఫీసర్స్ నిలిపేస్తున్నారు.

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరో కీలక ప్రాజెక్టును పూర్తి చేసింది. ఐటీ కారిడార్ వైపు వెళ్లే ఎంప్లాయిస్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మియాపూర్ - గండిమైసమ్మ కారిడార్‌లో రద్దీ ప్రాంతమైన బాచుపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు.
ఖాన్ సర్ కోచింగ్ పై దాడి... ప్రత్యర్థుల ప్లానేనా ?
పాట్నాలో ఫేమస్ యూట్యూబర్, ఎడ్యుకేటర్ 'ఖాన్ సార్' కోచింగ్ సెంటర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో కోచింగ్ సెంటర్ బోర్డులు, ఆస్తులు ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపింది. మొదట కాల్పులు జరిగాయని వార్తలు వచ్చినా అలాంటిదేం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇటీవల బీహార్ పోలీస్ నియామకాల్లో ఖాన్ సార్ కోచింగ్ నుంచి వేల మంది ఎంపిక కావడం, తక్కువ ఫీజులతో విద్య అందించడం కొందరికి నచ్చక ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లే ఈ దాడి వెనుక ఉండొచ్చని ఖాన్ సర్ ఆరోపించారు. దాడి విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున స్టూడెంట్ల్ వచ్చి ఖాన్ సర్ కి మద్దతుగా నినాదాలు చేశారు.

తెలంగాణలోనూ పెద్ది మూవీ టిక్కెట్ ధరల పెంపు
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ రేట్లు తెలంగాణలోనూ పెరిగాయి. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 పెంచుకునే వీలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెరిగిన ధరలు 10 రోజుల వరకు అమల్లో ఉంటాయి. 3వ తేదీ రాత్రి ప్రీమియర్ షో టికెట్ ధరలు రూ.600 ఫిక్స్ చేస్తూ అనుమతినిచ్చింది. జూన్ 4 న ఈ మూవీ రిలీజ్ కానుంది.

భారత్ పై అమెరికా మరో టారిఫ్ బాంబ్..!
భారత్ సహా 60 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన వస్తువుల దిగుమతుల్ని అడ్డుకోవడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయంటూ అమెరికా ట్రేడ్ రిప్రజెంటిటివ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియాపై అదనంగా 12.5% టారిఫ్ విధించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన దేశాలపై 10శాతం సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధమవుతోంది.

RBI లక్ష కోట్ల బంగారం అమ్మిందా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు $12 బిలియన్ల (సుమారు ₹1.03 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని రెండు వారాల తేడాలో విక్రయించి ఉండొచ్చని Bloomberg Economics విశ్లేషణ వెల్లడించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావంతో రూపాయి బలహీనపడటం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ పెరగడంతో ఫారెక్స్ నిల్వలను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆ కథనం వెల్లడించింది. ఇటీవల భారత్ ఫారెక్స్ నిల్వలు $681.4 బిలియన్లకు పడిపోగా, బంగారం నిల్వల విలువ కూడా తగ్గింది. అయితే RBI ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు.

జూన్-ఆగస్ట్ మధ్య ఎల్ నినో ఎంట్రీ.. WMO అలర్ట్
ఎండల వేడికి ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని వెయిట్ చేస్తున్న వారికి ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) గట్టి షాకిచ్చింది. ఫసిఫిక్ మహా సముద్రంలో జూన్-ఆగస్టు మధ్య ఎల్‌నినో ఏర్పడే అవకాశం 80% ఉందని తాజాగా స్పష్టం చేసింది. దాని ప్రభావం నవంబర్ వరకు కొనసాగే అవకాశం 90%కు పైగా ఉందని WMO తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గడం, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే IMD ఈ ఏడాది వర్షం అంచనాను 90%కు తగ్గించింది. దీంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఆ చిన్నారులపై 700 మంది రేప్ : బ్రిటన్ పార్లమెంట్ ఎంపీ షాకింగ్ నిజాలు
బ్రిటన్ లో చిన్నారులపై లైంగిక దాడులకి సంబంధించి ఎంపీ రూపర్ట్ లోవ్ పార్లమెంట్‌లో బయటపెట్టిన సంచలన నిజాలు వణుకు తెప్పిస్తున్నాయి. కొందరు బాధితులు తమపై ఏకంగా 700 మంది లైంగిక దాడి జరిపారని చెప్పినట్టు ఆ ఎంపీ పార్లమెంటులో చెప్పారు. ఆ బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆయన చదివి వినిపించారు. పాకిస్థాన్ సంతతికి చెందిన గ్రోమింగ్ గ్యాంగ్ ఈ దారుణాలకు పాల్పడినట్టు ఆయన చెప్పారు. ఇకనైనా ఆ ముఠాల ఆట కట్టించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

వరల్డ్స్ స్వీటెస్ట్ మ్యాంగో ఏదో తెలుసా ?
మామిడి పళ్ల సీజన్ వస్తే చాలు మన దగ్గర అల్ఫాన్సో, బంగినపల్లికి క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం ఫిలిప్పీన్స్‌కు చెందిన కారాబావో మామిడి పండుదే హవా. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత తియ్యనైన మామిడి పండు అంటే ఇదే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి కూడా ఈ మామిడి పండు ఎక్కింది. ఇప్పుడు ఈ పండు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.

గల్ఫ్ లో మళ్లీ మిస్సైల్ మోత..!
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి. ఇరాన్‌కు చెందిన Qeshm దీవిలోని సైనిక కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా, ప్రతీకారంగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్ పై మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో చాలావాటిని గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు మరింత ఆందోళన పెంచుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పాకిస్తాన్‌లో ఉండాల్సిన వ్యక్తి: జగదీష్ రెడ్డి
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్‌లో ఉండాల్సిన వ్యక్తి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సన్సెషనల్ కామెంట్ చేశారు. హైదరాబాద్‌లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు పవన్ వివాదాన్ని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకోటి కాదన్నారు.

భార్యాభర్తల బంధాన్ని గెలిపించే '1-1-1-1'
చిన్నచిన్న గొడవలతో విడిపోయే ఈ కాలపు జంటల కోసం నిపుణులు '1-1-1-1 రూల్' సూచిస్తున్నారు. దీని ప్రకారం.. ఏడాదికోసారి ఇద్దరే కలిసి వారం రోజుల పాటు వెకేషన్ వెళ్లాలి. వారానికి ఒకసారి డేట్ నైట్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే, వారంలో కనీసం ఒక్క రోజైనా శృంగారానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రతి రాత్రీ గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి డిజిటల్ డీటాక్స్ పాటిస్తూ కాసేపైనా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈ నాలుగు సూత్రాలు దంపతుల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి.

తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే-పవన్ కు పొన్నం కౌంటర్
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే, ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరే అని నొక్కి చెప్పారు. పవన్ మరోసారి అహంకారం ప్రదర్శించారన్నారు. తనకు ఏపీలోనే దిక్కు లేదని పవన్ అంగీకరించారని , తెలంగాణకు పవన్ ఏనాడూ మద్దతు ఇవ్వలేదని అన్నారు పొన్నం. తెలంగాణపై అక్కసు వెళ్ల గక్కారని, అమర వీరులకు అండగా నిలిచిన పాపాన పోలేదని విమర్శించారు.

2029లో తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తాం..-పవన్
2029ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.అప్పుడు ఎవరు కలిసివస్తారో ఇప్పుడు తెలియదు తెలంగాణలో నేను పోటీ చేయను..మా వాళ్లు గెలిస్తే చాలు అన్నారు. GHMC ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం

ఐపీఎస్ సునీల్ కుమార్ పై రఘురామ ఫుల్ ఫైర్.. ఎందుకంటే...
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని అన్నారు. తానే స్వయంగా 4,000 ఎస్సీ, ఎస్టీ కేసులపై ఛార్జిషీటు వేయించానని సునీల్ కుమార్ మాట్లాడటంపై రఘురామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీ సీఐడీకీ, సాధారణ ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎలాంటి సంబంధం ఉండదని... అత్యంత సంచలనమైన కేసులు ఉంటే తప్ప, సీఐడీ పరిధిలోకి 200 కేసులకు మించి తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్విషా శర్మ కేసులో గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ
భోపాల్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మరణం కేసులో వీరిద్దరి పోలీస్ రిమాండ్ ముగియడంతో భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ట్విషా శర్మ కుటుంబ సభ్యులు వీరిపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ రోజు కోర్టులో జరిగిన విచారణ తీవ్ర ఉత్కంఠ రేపింది. రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కోర్టులో స్వయంగా తీవ్ర ఆవేశంతో వాదనలు వినిపించడంతో, కోర్టు హాల్ నాటకీయ పరిణామాలకు, వాదోపవాదాలకు వేదికైంది.