Latest

స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై డిపెండ్ అవకుండా ఇండియా- ఒమన్ కొత్త రూట్ !
భారత్-ఒమన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) నేటి నుండి అమలులోకి వచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిన వేళ, వ్యూహాత్మకంగా వెలుపల ఉన్న ఒమన్ భారత్‌కు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఈ ఒప్పందంతో భారత శ్రమశక్తి ఆధారిత ఎగుమతులకు ఒమన్ సున్నా-సుంకం (Zero-duty) ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఇది పెట్టుబడులను పెంచి, ఉద్యోగాల సృష్టికి హెల్ప్ అవుతుంది.

రాజ్యసభ ఎన్నికలు... బీజేపికి క్రాస్ ఓటింగ్ భయం ...
ఈనెల 18న 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 17-18 స్థానాలు గెలిచి, తమ బలాన్ని 150 దాటించాలని వ్యూహాలు రచిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయాల మధ్య ప్రధాని మోదీ అధ్యక్షతన వ్యూహాత్మక సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ వంటి ప్రముఖుల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బిడ్డని డ్రైనేజీలో పడేసిన సైకో ఫాదర్!
ఇండియాలో చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్ చాలా ఘోరంగా ఉంది అనడానికి ఈ వీడియోనే ఎగ్జాంపుల్. ఒక ఫాదర్ తన పిల్లాడు అంతలా ఏడుస్తున్నా వినకుండా, జస్ట్ పనిష్మెంట్ ఇవ్వడానికి ఓపెన్ డ్రైనేజీలో పడేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్ చేస్తోంది. ఇండియాలో చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
ప్రిగ్నెంట్ అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ ను అడ్డగించి...
కర్ణాటకలో గర్భవతిగా ఉన్న భార్యను తీసుకువెళ్లేందుకు..గవర్నర్ కాన్వాయ్‌ను అడ్డగించి ఓ యువకుడు సంచలనం సృష్టించాడు.. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ కాన్వాయ్ వెళ్లడం కోసం 30 నిమిషాల పాటు ట్రాఫిక్‌ను పోలీసులు నిలిపివేశారు. దాంతో ప్రిగ్నెంట్ అయిన తన భార్యను ఆస్పత్రికి తరలించాలంటూ ఓ వ్యక్తి గవర్నర్ కాన్వాయ్ వెళ్లే రూట్ లో నడిరోడ్డుపై బైఠాయించాడు. తన భార్యకు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెడుతుండగా ట్రాఫిక్ లో చిక్కుకు పోయానంటూ అసహనం వ్యక్తం చేశాడు.

కలెక్టరేట్‌లో గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది
TG: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని గ్రేవెన్స్ డే ప్రొగ్రామ్‌లో ఓ గవర్నమెంట్ ఎంప్లాయికి దేహశుద్ది జరిగింది. పర్వతగిరి విలేజ్‌కు చెందిన ఓ మహిళ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో తన భూమి పోవడంతో నష్టపరిహారం కోసం కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చింది. కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న మురళి నీ పనిచేసి పెడతాను, లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఊరు చివరికి తీసుకెళ్లి మిస్ బిహేవ్ చేయడంతో ప్రతిఘటించిన మహిళ అక్కడి నుంచి తప్పించుకుంది. అనంతరం తన కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్‌కి వచ్చి మురళిని పట్టుకుని చెప్పులతో సామూహికంగా దేహశుద్ది చేశారు.
పవన్ కళ్యాణ్‌ను 'వెధవ' అంటూ పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్!
"AP Diputy CMగా అక్కడ ఏం అయిన చేస్కో కానీ, ఇక్కడికొచ్చి నవ నిర్మాణ సభలు పెడితే వినేవాడు ఎవడు లేడు" అంటూ పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తినని వెదవవి నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఒచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు అని ఫైర్ అయ్యారు. ఇక్కడ పవన్ మొసలి కన్నీరు కారిస్తే ఎవరూ నమ్మరని స్ట్రెయిట్‌గా చెప్పారు. పొన్నం చేసిన ఈ shocking కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఉపాధి పనుల వద్ద ఎలుగుబంటి హల్‌చల్ (Video)
AP: ఉపాధి పనుల వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అల్లూరిసీతారామరాజు జిల్లా కడుతుల విలేజ్‌లో సోమవారం ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు కొత్త అనుభవం ఎదురైంది. కూలీలకు ఎలుగుబంటి కనిపించడంతో వారు టెన్షన్‌కు గురై పరుగులు తీశారు. అనంతరం కూలీలు, యువకులు దానిని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించగా అది వారిపైకే దూసుకొచ్చింది. చివరికి అందరూ పెద్దఎత్తున ఏకమై తరమడంతో ఫారెస్ట్‌లోకి పారిపోయింది.

సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు: సబితాఇంద్రారెడ్డి
TG: ఏ భూముల్లో ఏ పరిశ్రమలు పెట్టాలో, ఏ భూముల్లో చెత్త డంప్ యార్డులు ఏర్పాటు చేయాలో సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని మాజీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామశివారులో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిద్దాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన పాదయాత్రలో ఆమె పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన ల్యాండ్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు నడిపిస్తుందని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్!
Diputy CM పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ పైసలు ఇస్తే ఎలాంటి నటన అయినా చేస్తాడని, ఏ డ్రెస్ వేసుకొని అయినా ఎగురుతాడని కామెంట్ చేశారు. BJP డైరెక్షన్‌లోనే పవన్ ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు, నవ నిర్మాణ సభలను గుజరాత్, కేరళ, తమిళనాడులో ఎందుకు పెట్టడం లేదని క్వశ్చన్ చేశారు. ఈ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ముఖాముఖి బూతులు తిట్టుకున్న TDP మహిళా లీడర్స్!
అనంతపురం జిల్లా TDP ఆఫీస్‌లో వర్గపోరు పీక్స్‌కి చేరింది. MLA దగ్గుపాటి ప్రసాద్, EX MLA ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో ఇరువర్గాల మహిళా లీడర్స్ ఒకరినొకరు లకారాలు ఉపయోగిస్తూ ఘోరంగా బూతులు తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫైట్ చూసి సొంత పార్టీ క్యాడర్ షాక్ అయింది. పార్టీ లీడర్‌షిప్ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.
పవన్ కళ్యాణ్: కోట్ల బిజినెస్ చేసేవాళ్లని వదలొద్దు!
AP Diputy CM పవన్ కళ్యాణ్ టాక్స్ కలెక్షన్స్ సిస్టమ్‌పై చాలా ఓపెన్‌గా, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెలకి 10 వేలు సంపాదించే ఒక నార్మల్ ఎంప్లాయిపై మనం భారం వేస్తున్నాం. కానీ కోట్లలో బిజినెస్ చేసేవాళ్ల దగ్గర మాత్రం టాక్స్ కలెక్ట్ చేయలేకపోతున్నాం. అది కరెక్ట్ కాదు, ఒకవేళ అలా కోట్ల బిజినెస్ చేసేవాడు మన కూటమి పార్టీ లీడర్ అయినా సరే వదిలిపెట్టకుండా టాక్స్ కలెక్ట్ చేయాల్సిందే, అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సొంత కూటమి లీడర్ల గురించి కూడా ఇలా బ్యాలెన్స్ గా మాట్లాడటంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఇండియాకు రాబోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేశాడు. దేశంలో ఎగ్జామ్ పేపర్ లీక్స్ ఇష్యూపై ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలంటూ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం తాను జూన్ 6న ఇండియాకు తిరిగి వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఆల్రెడీ ఈ మూవ్‌మెంట్‌కు యూత్ నుండి విపరీతమైన సపోర్ట్ వస్తుండటంతో, ఈ ఢిల్లీ ప్రొటెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

‘సింగ్ గీతం’కు శ్రుతిహాసన్ సపోర్ట్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో రానున్న సినిమా ‘సింగ్ గీతం’ చిత్రానికి అందాల నటి శ్రుతి హాసన్ సపోర్ట్ అందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాని వార్తలలో నిలుపుతోంది. ఈ సినిమా నుంచి ‘ఏమైంది’ అనే పాటను శ్రుతి హాసన్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

YS షర్మిలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్!
APCC చీఫ్ YS షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన టైమ్‌లోనే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని ఢిల్లీ పెద్దలు ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను పార్లమెంట్‌కు పంపేందుకు కాంగ్రెస్ లీడర్‌షిప్ అంతా రెడీ చేసింది. ఈ డెసిషన్‌తో AP, కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్‌లో ఫుల్ డిస్కషన్ నడుస్తోంది.
రోడ్లపై RCB ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్.. హద్దులు దాటిన అభిమానం!
RCB వరుసగా 2nd టైమ్ కప్ గెలవడంతో కర్నూల్‌లో ఫ్యాన్స్ చేసిన హంగామా కాస్త ఓవర్ అయింది. విపరీతమైన అభిమానంతో కొంతమంది ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి ఫుల్ రచ్చ చేశారు. ఆ సెలబ్రేషన్స్ కాస్త హద్దులు దాటడంతో రోడ్లపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయి ట్రాఫిక్‌కు పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. కప్ గెలిచారనే హ్యాపీనెస్ ఓకే కానీ, ఇలా రోడ్లపై విధ్వంసం క్రియేట్ చేయడం ఏంటంటూ లోకల్స్ అండ్ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
ఇదెక్కడి ట్రెండ్? ఇంట్లోనే పందులను పెంచుకుంటున్న బెంగాలీలు!
వెస్ట్ బెంగాల్‌లోని కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నడుస్తోంది. నార్మల్‌గా అందరూ డాగ్స్, క్యాట్స్ లేదా బర్డ్స్‌ని పెట్స్‌గా పెంచుకుంటారు కదా. కానీ అక్కడ మాత్రం కొంతమంది ఏకంగా Pigsని, వేరే పెంపుడు జంతువులను పెట్స్‌గా ఇంట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ల లోకల్ అలవాట్లు, పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ లైఫ్‌స్టైల్ ఛేంజెస్ వల్లే ఇలా చేస్తున్నారట. రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో ప్లేస్ ఉండటం, యానిమల్ కేర్‌పై ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ డిఫరెంట్ పెట్స్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీని వెనుక ఎలాంటి సోషల్ రీజన్స్ లేవని, ఓన్లీ వాళ్ల పర్సనల్ ఛాయిస్ మాత్రమేనని టాక్.
కోహ్లీని ఓదారుస్తున్న అనుష్క శర్మ!
IPL ట్రోఫీ గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ ఫుల్ ఎమోషనల్ అవ్వడం చూసి అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతన్ని చూసి ఫ్యాన్స్ హ్యాపీ టియర్స్ అంటూ వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
షుగర్ పేషెంట్స్ carrot తినొచ్చా?
షుగర్ వ్యాధి సోకితే అన్నీ డౌట్స్.. ఏం తినాలి? ఏం తినకూడదు? ఇలా సందేహాలు వస్తోనే ఉంటాయి. కంటికి బాగా మేలు చేసే carrot తినొచ్చా? Dr దీప్తి ఏమి చెబుతున్నారో మీరే చూడండి..

డి- గ్యాంగ్ కి కోపమొచ్చింది... ఎందుకో తెలుసా?
బాలీవుడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' సక్సెస్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (D-Company)కి తెగ కోపం తెప్పించింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, దావూద్‌ను పోలిన 'బడే సాహెబ్' అనే క్యారెక్టర్‌ను మరణశయ్య పై చూపించారు. దీంతో దావూద్ ఇంకా బతికే ఉన్నాడని నమ్మించడానికి ముంబైలో వీళ్ళు మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొత్తగా మనుషులను రిక్రూట్ చేసుకుని, పాకిస్తాన్ ISI సాయంతో ట్రైనింగ్ ఇప్పించి, మున్నా జింగాడా అనే షూటర్ ద్వారా ఒక పెద్ద టెర్రర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి'
TG: ఉద్యమకారులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని TUJAC స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కే.రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ప్రతీ ఉద్యమకారునికి 250 గజాల ప్లాటు, రూ.25,000 గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.

GT టీమ్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్లేయర్స్ సేఫ్!
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకి అతిపెద్ద ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది, ప్లేయర్స్ అందరినీ సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్లేయర్స్ అంతా సేఫ్‌గా ఉన్నారని మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.