← Back to news

ఉపాధి పనుల వద్ద ఎలుగుబంటి హల్‌చల్ (Video)

By dk yamjala· 1 Jun 2026· అల్లూరిసీతారామరాజు జిల్లా

AP: ఉపాధి పనుల వద్ద ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అల్లూరిసీతారామరాజు జిల్లా కడుతుల విలేజ్‌లో సోమవారం ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు కొత్త అనుభవం ఎదురైంది. కూలీలకు ఎలుగుబంటి కనిపించడంతో వారు టెన్షన్‌కు గురై పరుగులు తీశారు. అనంతరం కూలీలు, యువకులు దానిని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించగా అది వారిపైకే దూసుకొచ్చింది. చివరికి అందరూ పెద్దఎత్తున ఏకమై తరమడంతో ఫారెస్ట్‌లోకి పారిపోయింది.

More in Local