Latest

ముఖాముఖి బూతులు తిట్టుకున్న TDP మహిళా లీడర్స్!▶
Politics· 1 Jun 2026

ముఖాముఖి బూతులు తిట్టుకున్న TDP మహిళా లీడర్స్!

అనంతపురం జిల్లా TDP ఆఫీస్‌లో వర్గపోరు పీక్స్‌కి చేరింది. MLA దగ్గుపాటి ప్రసాద్, EX MLA ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో ఇరువర్గాల మహిళా లీడర్స్ ఒకరినొకరు లకారాలు ఉపయోగిస్తూ ఘోరంగా బూతులు తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫైట్ చూసి సొంత పార్టీ క్యాడర్ షాక్ అయింది. పార్టీ లీడర్‌షిప్ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

పవన్ కళ్యాణ్: కోట్ల బిజినెస్ చేసేవాళ్లని వదలొద్దు! ▶
Politics· 1 Jun 2026

పవన్ కళ్యాణ్: కోట్ల బిజినెస్ చేసేవాళ్లని వదలొద్దు!

AP Diputy CM పవన్ కళ్యాణ్ టాక్స్ కలెక్షన్స్ సిస్టమ్‌పై చాలా ఓపెన్‌గా, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెలకి 10 వేలు సంపాదించే ఒక నార్మల్ ఎంప్లాయిపై మనం భారం వేస్తున్నాం. కానీ కోట్లలో బిజినెస్ చేసేవాళ్ల దగ్గర మాత్రం టాక్స్ కలెక్ట్ చేయలేకపోతున్నాం. అది కరెక్ట్ కాదు, ఒకవేళ అలా కోట్ల బిజినెస్ చేసేవాడు మన కూటమి పార్టీ లీడర్ అయినా సరే వదిలిపెట్టకుండా టాక్స్ కలెక్ట్ చేయాల్సిందే, అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సొంత కూటమి లీడర్ల గురించి కూడా ఇలా బ్యాలెన్స్ గా మాట్లాడటంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఇండియాకు రాబోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్!▶
Politics· 1 Jun 2026

ఇండియాకు రాబోతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ చేశాడు. దేశంలో ఎగ్జామ్ పేపర్ లీక్స్ ఇష్యూపై ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలంటూ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇందుకోసం తాను జూన్ 6న ఇండియాకు తిరిగి వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఆల్రెడీ ఈ మూవ్‌మెంట్‌కు యూత్ నుండి విపరీతమైన సపోర్ట్ వస్తుండటంతో, ఈ ఢిల్లీ ప్రొటెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

‘సింగ్ గీతం’కు శ్రుతిహాసన్‌ సపోర్ట్
Cinema· 1 Jun 2026

‘సింగ్ గీతం’కు శ్రుతిహాసన్‌ సపోర్ట్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో రానున్న సినిమా ‘సింగ్ గీతం’ చిత్రానికి అందాల నటి శ్రుతి హాసన్ సపోర్ట్ అందించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌.. సినిమాని వార్తలలో నిలుపుతోంది. ఈ సినిమా నుంచి ‘ఏమైంది’ అనే పాటను శ్రుతి హాసన్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

YS షర్మిలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్!
Politics· 1 Jun 2026

YS షర్మిలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్!

APCC చీఫ్ YS షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన టైమ్‌లోనే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని ఢిల్లీ పెద్దలు ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆమెను పార్లమెంట్‌కు పంపేందుకు కాంగ్రెస్ లీడర్‌షిప్ అంతా రెడీ చేసింది. ఈ డెసిషన్‌తో AP, కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్‌లో ఫుల్ డిస్కషన్ నడుస్తోంది.

రోడ్లపై RCB ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్.. హద్దులు దాటిన అభిమానం!▶
Viral· 1 Jun 2026

రోడ్లపై RCB ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్.. హద్దులు దాటిన అభిమానం!

RCB వరుసగా 2nd టైమ్ కప్ గెలవడంతో కర్నూల్‌లో ఫ్యాన్స్ చేసిన హంగామా కాస్త ఓవర్‌ అయింది. విపరీతమైన అభిమానంతో కొంతమంది ఫ్యాన్స్ రోడ్ల మీదకు వచ్చి ఫుల్ రచ్చ చేశారు. ఆ సెలబ్రేషన్స్ కాస్త హద్దులు దాటడంతో రోడ్లపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయి ట్రాఫిక్‌కు పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. కప్ గెలిచారనే హ్యాపీనెస్ ఓకే కానీ, ఇలా రోడ్లపై విధ్వంసం క్రియేట్ చేయడం ఏంటంటూ లోకల్స్ అండ్ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

ఇదెక్కడి ట్రెండ్? ఇంట్లోనే పందులను పెంచుకుంటున్న బెంగాలీలు!▶
News· 1 Jun 2026

ఇదెక్కడి ట్రెండ్? ఇంట్లోనే పందులను పెంచుకుంటున్న బెంగాలీలు!

వెస్ట్ బెంగాల్‌లోని కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ నడుస్తోంది. నార్మల్‌గా అందరూ డాగ్స్, క్యాట్స్ లేదా బర్డ్స్‌ని పెట్స్‌గా పెంచుకుంటారు కదా. కానీ అక్కడ మాత్రం కొంతమంది ఏకంగా Pigsని, వేరే పెంపుడు జంతువులను పెట్స్‌గా ఇంట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ల లోకల్ అలవాట్లు, పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ లైఫ్‌స్టైల్ ఛేంజెస్ వల్లే ఇలా చేస్తున్నారట. రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో ప్లేస్ ఉండటం, యానిమల్ కేర్‌పై ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ డిఫరెంట్ పెట్స్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీని వెనుక ఎలాంటి సోషల్ రీజన్స్ లేవని, ఓన్లీ వాళ్ల పర్సనల్ ఛాయిస్ మాత్రమేనని టాక్.

కోహ్లీని ఓదారుస్తున్న అనుష్క శర్మ!▶
Sports· 1 Jun 2026

కోహ్లీని ఓదారుస్తున్న అనుష్క శర్మ!

IPL ట్రోఫీ గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ ఫుల్ ఎమోషనల్ అవ్వడం చూసి అనుష్క శర్మ అతన్ని ఓదారుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతన్ని చూసి ఫ్యాన్స్ హ్యాపీ టియర్స్ అంటూ వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

షుగర్ పేషెంట్స్ carrot తినొచ్చా?▶
Health· 1 Jun 2026

షుగర్ పేషెంట్స్ carrot తినొచ్చా?

షుగర్ వ్యాధి సోకితే అన్నీ డౌట్స్.. ఏం తినాలి? ఏం తినకూడదు? ఇలా సందేహాలు వస్తోనే ఉంటాయి. కంటికి బాగా మేలు చేసే carrot తినొచ్చా? Dr దీప్తి ఏమి చెబుతున్నారో మీరే చూడండి..

 డి- గ్యాంగ్ కి కోపమొచ్చింది... ఎందుకో తెలుసా?
Crime· 1 Jun 2026

డి- గ్యాంగ్ కి కోపమొచ్చింది... ఎందుకో తెలుసా?

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' సక్సెస్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (D-Company)కి తెగ కోపం తెప్పించింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, దావూద్‌ను పోలిన 'బడే సాహెబ్' అనే క్యారెక్టర్‌ను మరణశయ్య పై చూపించారు. దీంతో దావూద్ ఇంకా బతికే ఉన్నాడని నమ్మించడానికి ముంబైలో వీళ్ళు మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొత్తగా మనుషులను రిక్రూట్ చేసుకుని, పాకిస్తాన్ ISI సాయంతో ట్రైనింగ్ ఇప్పించి, మున్నా జింగాడా అనే షూటర్ ద్వారా ఒక పెద్ద టెర్రర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి'
Politics· 1 Jun 2026

'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి'

TG: ఉద్యమకారులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని TUJAC స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ రాజేంద్రప్రసాద్‌ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కే.రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ప్రతీ ఉద్యమకారునికి 250 గజాల ప్లాటు, రూ.25,000 గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.

GT టీమ్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్లేయర్స్ సేఫ్!
India· 1 Jun 2026

GT టీమ్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్లేయర్స్ సేఫ్!

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకి అతిపెద్ద ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ప్రమాదాన్ని గమనించిన వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది, ప్లేయర్స్ అందరినీ సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్లేయర్స్ అంతా సేఫ్‌గా ఉన్నారని మేనేజ్మెంట్ కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

మేము ఎవరినీ పోక్ చేయం : కొహ్లీ ▶
Sports· 1 Jun 2026

మేము ఎవరినీ పోక్ చేయం : కొహ్లీ

IPLలో వరసగా రెండోసారి RCB కప్పు కొట్టాక తమ టీమ్ కల్చర్ గురించి విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మేము ఎప్పుడూ ఇతర టీమ్‌లను టార్గెట్ చేసి పోక్ చేయం, మా ఫోకస్ ఎప్పుడూ మా ఆటపైనే ఉంటుందని కోహ్లీ చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీని కొట్టిన ఆనందంలో కోహ్లీ డప్పులకి ఇలా స్టెప్పులేస్తూ కనిపించాడు.

హజ్‌ తరువాత జీవితం ఎలా ఉండాలి?
Infotainment· 31 May 2026

హజ్‌ తరువాత జీవితం ఎలా ఉండాలి?

హజ్‌ అనేది ముస్లింలకు ఒక పవిత్ర ప్రయాణం. హజ్‌కు వెళ్ళినవారు తమ జీవితాన్ని కొత్తగా ఆరంభించే అవకాశాన్ని పొందుతారు. అయితే హజ్‌ తరువాత జీవితం ఎలా ఉండాలనేదే అసలు ప్రశ్న. హజ్‌కు వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నామో, ఆ తరువాత కూడా అదే విధంగా ఉంటే ఆ యాత్ర ప్రభావం మన మీద పడలేదని అర్థం. మన మాటలను, నడవడికను, ఆలోచనలను, జీవన శైలిని మార్చడం, దైవంపై విశ్వాసం మరింత పెరగడం ఇవీ హజ్‌ నుంచి పొందవలసిన ప్రయోజనాలు.

కర్ణాటకలో భారీ యాక్సిడెంట్..ఐదుగురు మృతి
Crime· 31 May 2026

కర్ణాటకలో భారీ యాక్సిడెంట్..ఐదుగురు మృతి

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒక మహింద్రాథార్, ఆటో, క్యాంటర్ వాహనాలు ఒకటినొకటి ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఒకేసారి బలంగా ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం
Politics· 31 May 2026

గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

TG: తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలపై కమిటీ చర్చిస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కామారెడ్డి జిల్లా నాయకుల మధ్య తలెత్తిన వివాదాలపై కమిటీ దృష్టి సారించింది. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.

బీజేపీ నేతలే దాడి చేశారు: అభిషేక్ బెనర్జీ
India· 31 May 2026

బీజేపీ నేతలే దాడి చేశారు: అభిషేక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తనపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. బీజేపీ నేతలే తనపై దాడి చేశారని, ఆ పార్టీ రాజకీయ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాను ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తానని స్పష్టం చేశారు.

ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ రెస్పాన్స్
General· 31 May 2026

ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ రెస్పాన్స్

ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వ్యవస్థలో సైబర్‌ సెక్యూరిటీ సమస్యలున్నాయన్న ఆరోపణలపై సీబీఎస్‌ఈ రెస్పాండ్ అయ్యింది. ఓఎస్‌ఎంలో బయటపడ్డ లోపాలపై దృష్టిపెట్టామని ఎక్స్‌లో చెప్పింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు బృందం ఓఎస్‌ఎం వ్యవస్థ భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కొన్ని రోజులుగా ట్రై చేస్తోందని తెలిపింది. ఇప్పటికే బయటపడ్డ లోపాలను పరిష్కరించామని తెలిపింది. ఇతరత్రా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

జూన్‌లో కొత్తగా 5606 వితంతు పెన్షన్లు
AP· 31 May 2026

జూన్‌లో కొత్తగా 5606 వితంతు పెన్షన్లు

AP: జూన్‌లో కొత్తగా 5606 మందికి స్పౌజ్‌ కేటగిరీ కింద వితంతు పెన్షన్లు మంజూరు చేసినట్లు సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ పెన్షన్ల కోసం రూ.2.24 కోట్లు అదనంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ 1న 62,34,445 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు రూ.2728 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్‌తో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ.65,886 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

ఇకపై పదేళ్లలో ఎంబీబీఎస్ పూర్తి
General· 31 May 2026

ఇకపై పదేళ్లలో ఎంబీబీఎస్ పూర్తి

ఎంబీబీఎస్ (MBBS) కోర్సు పూర్తి చేసేందుకు విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా జాతీయ వైద్య కమిషన్ కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సును, తప్పనిసరి రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్‌తో కలిపి 9 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉండగా, ఆ గడువును 10 సంవత్సరాలకు పెంచాలని NMC ప్రతిపాదించింది.

300 శాతం లాభాలంటూ..రూ.85 లక్షలకు టోకరా
Crime· 31 May 2026

300 శాతం లాభాలంటూ..రూ.85 లక్షలకు టోకరా

AP: కాకినాడ జిల్లా పెద్దాపురంలో భారీ ఆన్‌లైన్ మోసం జరిగింది. సురే వేణు దంపతులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ‘ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్’ మేనేజర్‌నని నమ్మించి, 3 నెలల్లో 300 శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పాడు. ఆ మాటలు నమ్మి విడతల వారీగా రూ.85 లక్షలు డిపాజిట్ చేశారు. తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అకౌంట్ బ్లాక్ అయింది. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.