బీజేపీ నేతలే దాడి చేశారు: అభిషేక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తనపై జరిగిన దాడిపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. బీజేపీ నేతలే తనపై దాడి చేశారని, ఆ పార్టీ రాజకీయ హింస, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని బెదిరింపులు ఎదురైనా తాను ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తానని స్పష్టం చేశారు.


