Latest

డ్యాన్స్ అదరగొట్టేసిన తేజస్విని▶
Viral· 30 May 2026

డ్యాన్స్ అదరగొట్టేసిన తేజస్విని

నటుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని డ్యాన్స్ అదరగొట్టేసింది. ఆమె డ్యాన్స్ మాస్టర్ తో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

భార్యని కోడిపుంజు పొజిషన్ లో (Rooster)  కూర్చోమన్న శాడిస్ట్ !!
Crime· 30 May 2026

భార్యని కోడిపుంజు పొజిషన్ లో (Rooster) కూర్చోమన్న శాడిస్ట్ !!

ముంబైలో ఒక కిరాతక భర్త తన భార్యను గృహనిర్బంధం చేసి, గంటల తరబడి క్రూరంగా హింసించాడు. గృహవివాదం నేపథ్యంలో 25 ఏళ్ల అర్బాజ్ సయ్యద్ అనే రౌడీషీటర్, తన భార్యను కత్తితో బెదిరించి దాదాపు నాలుగు గంటల పాటు 'కోడిపుంజు' (Rooster) పొజిషన్‌లో ఉంచాడు. యాసిడ్ పోస్తానని, చంపేస్తానని భయపెట్టాడు. ఆమె ప్రాణాలు దక్కించుకుని పుట్టింటికి పారిపోగా, అక్కడికి కూడా వెళ్ళి ఆమెపై కత్తితో దాడి చేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్రంప్ హెల్త్ రిపోర్ట్: బరువు పెరిగినా బాస్ ఫిట్‌గా ఉన్నారట!
Health· 30 May 2026

ట్రంప్ హెల్త్ రిపోర్ట్: బరువు పెరిగినా బాస్ ఫిట్‌గా ఉన్నారట!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (79) రీసెంట్‌గా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు. 22 మంది డాక్టర్ల టీమ్ చేసిన టెస్టుల ప్రకారం ఆయన ప్రెజెంట్ బరువు 108 kg కాగా, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 6kg పెరిగారు. బరువు కొంచెం ఎక్కువ ఉన్నా ఆయన మైండ్ అండ్ బాడీ యాక్టివ్‌గా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కంటిన్యూస్‌గా ప్రజలతో షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం, హార్ట్ మెడిసిన్స్ వాడడం వల్ల కాళ్ల వాపు, చేతులపై చిన్న మచ్చలు వచ్చాయట. దీంతో డైట్ కంట్రోల్, ఎక్సర్‌సైజ్ చేయాలని డాక్టర్లు సజెస్ట్ చేశారు.

అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
Crime· 30 May 2026

అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలోని నెబ్రాస్కాలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో గుజరాత్‌కు చెందిన హోటల్ ఉద్యోగి కవన్‌కుమార్ పటేల్ (27) అనే ఇండియన్ కి అ క్కడి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హోటల్ గది అద్దె తగ్గించడం కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) ముఠాకు హోటల్ డ్రాయర్ నుంచి డబ్బులు చెల్లించి, మైనర్ బాలికపై పటేల్ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పనిష్ మెంట్ పూర్తయ్యాక అతడిని భారత్‌కు డిపోర్ట్ (నగరం నుంచి బహిష్కరణ) చేస్తారు.

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: 9 మంది అరెస్ట్
Politics· 30 May 2026

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: 9 మంది అరెస్ట్

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ISI), అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న తొమ్మిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ, ముంబై నగరాల్లోని అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లపై దాడులకు వీరు స్కెచ్ వేశారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఈ ముఠాను పట్టుకోగా, వీరి వెనుక ఉన్న విదేశీ హ్యాండ్లర్ల లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూ్క్లియర్ మిసైల్స్ కోసం లాంచ్ పాడ్లు, బంకర్లు సిద్ధం చేస్తున్న చైనా
World· 30 May 2026

న్యూ్క్లియర్ మిసైల్స్ కోసం లాంచ్ పాడ్లు, బంకర్లు సిద్ధం చేస్తున్న చైనా

చైనా తన అణ్వాయుధ సంపత్తిని రక్షించుకోవడానికి జింజియాంగ్ ఎడారిలో భారీ సైనిక కేంద్రాన్ని నిర్మిస్తోంది. అమెరికా దాడి చేసినా ఎదురుదెబ్బ తీసేలా రెండోసారి దాడి సామర్థ్యాన్ని (Second-strike capability) పెంచుకుంటోంది. రాయిటర్స్ ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. హమీ సైలో క్షేత్రాల సమీపంలో 80కి పైగా వెపన్ ప్రయోగ కేంద్రాలు, బంకర్లు, 'అష్టభుజి' (Octagon) ఆకారపు రక్షణ కట్టడాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తోంది. మొబైల్ క్షిపణి లాంచర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కోసం ఈ కొత్త మౌలిక సదుపాయాలను చైనా చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటోంది.

భార్య కోరిక తీర్చలేక హత్య చేసి తాను సూసైడ్
Crime· 29 May 2026

భార్య కోరిక తీర్చలేక హత్య చేసి తాను సూసైడ్

TG: భర్త భార్యకు ఉరి వేసి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో చోటు చేసుకుంది. దాసరి అంజయ్య(25), యాదమ్మ(20)లకు రీసెంట్‌గా వివాహం జరిగింది. బైక్ కొనివ్వాలన్న భార్య కోరిక తీర్చలేక, ఆమెతో గొడవపడి మామిడి తోటలో భార్య యాదమ్మకు ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అంగన్వాడీ టీచర్లకు అవమానం
Local· 29 May 2026

అంగన్వాడీ టీచర్లకు అవమానం

TG: అంగన్వాడీ టీచర్లను కింద కూర్చోబెట్టి వారి ఎదుట ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్వైజర్ కుర్చీలపై కూర్చొని అంగన్వాడీ టీచర్లను అవమానపరిచారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండలోని అంగన్వాడి కేంద్రంలో వెయ్యిరోజుల ప్రాముఖ్యత ప్రొగ్రామ్ నిర్వహించారు. తల్లులు, గర్భిణీలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసీడీఎస్ సీడీపీవో వెంకటరమణ, సూపర్‌వైజర్లు గోదా ధనమ్మ, పారిజాత బాలమణి కుర్చీలపై కూర్చొని మిగతా వారిని కింద కూర్చొబెట్టారు. మేము మీకంటే స్థాయిలో ఎక్కువ అనే విధంగా వారు బిహెవ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎందుకు?: సుప్రీంకోర్టు
India· 29 May 2026

అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎందుకు?: సుప్రీంకోర్టు

అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని అవమానించడం ఎందుకు? ఇక ఇలాంటి వేధింపులు కొనసాగడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒక మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన కేసు విచారణలో జస్టిస్‌లు బి.వి.నాగరత్న, ఉజ్జ్వల్ భుయాన్ బెంచ్ భర్త కుటుంబం వేధింపులపై సీరియస్‌గా స్పందించింది. భర్త తమ్ముడికి సెక్షన్ 498A కింద కింది కోర్టు వేసిన శిక్షను సమర్థించింది.

5 టైమ్స్ MLA, 2టైమ్స్ మినిస్టర్ గాదె వెంకటరెడ్డి ఇక లేరు!
News· 29 May 2026

5 టైమ్స్ MLA, 2టైమ్స్ మినిస్టర్ గాదె వెంకటరెడ్డి ఇక లేరు!

సీనియర్ లీడర్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో చనిపోయారు. ఇంకొల్లు మండలం పావులూరు విలేజ్ లో ఒక నార్మల్ ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టిన ఆయన. లాయర్‌గా లైఫ్ స్టార్ట్ చేసి స్టేట్ మినిస్టర్ వరకు ఎదిగారు. కాంగ్రెస్‌లో నిఖార్సైన లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన 5 టైమ్స్ MLAగా, 2టైమ్స్ మినిస్టర్ గా పని చేశారు. స్టేట్ డివిజన్ టైమ్‌లో సీమాంధ్ర తరపున ఢిల్లీలో గట్టిగా వాయిస్ వినిపించారు. ఆయన చనిపోవడంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల పాలిటిక్స్‌లో ఒక శకం ముగిసినట్లయింది.

'ప్రజల్లో నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి'
Local· 29 May 2026

'ప్రజల్లో నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి'

TG: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ సూచించారు. శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, సిబ్బంది క్రమశిక్షణ, అత్యవసర సమయాల్లో స్పందించే విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. స్టేషన్‌లోని రిసెప్షన్ కౌంటర్, క్రైమ్ విభాగం, జనరల్ డైరీ నిర్వహణను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే సహాయం అందించాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో లేదా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇద్దరి ప్రాణం తీసిన తాటి చెట్టు
AP· 29 May 2026

ఇద్దరి ప్రాణం తీసిన తాటి చెట్టు

AP: బైక్‌పై వెళ్తున్న వారిపై తాటి చెట్టు విరిగి పడడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన గరికపాటి మనోహర్(33), అదే విలేజ్‌కు చెందిన చుటూరు శివరామకృష్ణ(27) ఇద్దరూ ఫ్రెండ్స్. వీరు చల్లపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈదురుగాలులకు రహదారి పక్కనే ఉన్న తాటిచెట్టు విరిగి వారి వాహనంపై పడడంతో వెనుక ఉన్న మనోహర్ స్పాట్‌లో చనిపోయాడు. వాహనం నడుపుతున్న శివరామకృష్ణకు తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

అప్పుడు చిరంజీవి-రాజ్‌కుమార్.. ఇప్పుడు చరణ్-శివన్న.. మెగా మూమెంట్!▶
Politics· 29 May 2026

అప్పుడు చిరంజీవి-రాజ్‌కుమార్.. ఇప్పుడు చరణ్-శివన్న.. మెగా మూమెంట్!

మెగాస్టార్ చిరంజీవిని కన్నడ లెజెండ్ రాజ్‌కుమార్ ముద్దు పెట్టుకున్న ఒక పాత మెమోరీని, anchor అడగడం తో ఇప్పుడు అదే మూమెంట్‌ను వారి వారసులు శివరాజ్ కుమార్, రామ్ చరణ్ మళ్లీ రీక్రియేట్ చేశారు. శివరాజ్ కుమార్ ఇప్పుడు రామ్ చరణ్‌ను ముద్దు పెట్టుకున్న ఈ క్యూట్ video ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతుంది. రెండు ఇండస్ట్రీల స్టార్స్ ఇలా కనిపించడంతో మెగా అండ్ కన్నడ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

పవన్ కల్యాణ్ నా ఇన్స్పిరేషన్: రామ్ చరణ్▶
Politics· 29 May 2026

పవన్ కల్యాణ్ నా ఇన్స్పిరేషన్: రామ్ చరణ్

రామ్ చరణ్ తన బాబాయ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు పవన్ కల్యాణ్ గారే ఇన్స్పిరేషన్. పాలిటిక్స్‌లో ఒక్క సీట్ కూడా గెలవని స్టేజ్ నుండి. ఈరోజు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యే వరకు ఆయన జర్నీ ఒక హిస్టరీ, అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. బాబాయ్ సక్సెస్ జర్నీపై రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!
Crime· 29 May 2026

శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ సూసైడ్!

కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం అందరిని షాక్ కి గురిచేసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) అనే స్టూడెంట్ తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ విషయం తెలిసి స్టూడెంట్ పేరెంట్స్, relatives కాలేజీకి వచ్చి పెద్ద గొడవ చేశారు. తమ బాబు చనిపోవడానికి రీజన్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ టైమ్‌లో పోలీసులు, పేరెంట్స్ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. పోలీసులు తమపై దౌర్జన్యం చేశారంటూ పేరెంట్స్ రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు కొందరిని ఈడ్చుకెళ్లడంతో అక్కడ వాతావరణం ఫుల్ టెన్షన్‌గా మారింది.

చర్లపల్లి జైల్లో బండి భగీరథ్!▶
Politics· 29 May 2026

చర్లపల్లి జైల్లో బండి భగీరథ్!

పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ పోలీస్ కస్టడీ అయిపోయింది. దీంతో పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు ఆర్డర్స్ రావడంతో భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు షిఫ్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇంపార్టెంట్ ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేశారు. ప్రెసెంట్ బండి భగీరథ్ జైల్లో ఉన్నట్లు సమాచారం

పవన్ కల్యాణ్ ప్యాకేజీల కోసమే పాలిటిక్స్ చేస్తున్నారా!▶
Politics· 29 May 2026

పవన్ కల్యాణ్ ప్యాకేజీల కోసమే పాలిటిక్స్ చేస్తున్నారా!

పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు, అమిత్ షా ఎక్కువ ప్యాకేజీ ఇచ్చారు కాబట్టే పవన్ కల్యాణ్ కూటమితో కలిసి ఉన్నారని ఆరోపించారు. ఒకవేళ వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తే.. పవన్ ఆయనతో కూడా వెళ్లే ఛాన్స్ ఉందంటూ డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీల కోసమే పాలిటిక్స్ చేస్తున్నారంటూ అనిరుధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

నారా లోకేష్‌కు శ్యామల ఓపెన్ ఛాలెంజ్!▶
Politics· 29 May 2026

నారా లోకేష్‌కు శ్యామల ఓపెన్ ఛాలెంజ్!

YSRCP లీడర్ శ్యామల మంత్రి నారా లోకేష్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు ఫస్ట్ టైమ్ MLA కాబట్టి. మీతో డిబేట్ చేయడానికి మా పార్టీ నుండి ఒక MLAను పంపిస్తాం, చర్చకు వచ్చే దమ్ము ఉందా? అంటూ క్వశ్చన్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను ఎప్పుడు క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే MEGA DSC నోటిఫికేషన్ పైన ఎందుకు మాట్లాడటం లేదంటూ శ్యామల ఫైర్ అయ్యారు.

15ఇయర్స్ వైభవ్ సూర్యవంశీ రికార్డ్స్.. పూరీ బీచ్‌లో సాండ్ ఆర్ట్ వైరల్!▶
Sports· 29 May 2026

15ఇయర్స్ వైభవ్ సూర్యవంశీ రికార్డ్స్.. పూరీ బీచ్‌లో సాండ్ ఆర్ట్ వైరల్!

IPL 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. ఓన్లీ 29 బాల్స్‌లోనే 97 రన్స్ చేసి క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఈ 15ఇయర్స్ వండర్ కిడ్ హిస్టారిక్ ఇన్నింగ్స్‌ను సెలబ్రేట్ చేస్తూ. ఫేమస్ సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఒడిశా పూరీ బీచ్‌లో ఒక బ్యూటిఫుల్ సాండ్ ఆర్ట్ వేసి కంగ్రాట్స్ చెప్పారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఫ్రిజ్‌ ఓవర్‌లోడ్‌ చేస్తే భారీ నష్టం!
Health· 29 May 2026

ఫ్రిజ్‌ ఓవర్‌లోడ్‌ చేస్తే భారీ నష్టం!

సమ్మర్‌లో ఫ్రిజ్‌ వాడకం చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ అందులోనే పెట్టేస్తాం. కానీ ఫ్రిజ్‌ను ఫుల్‌గా నింపేయడం వల్ల లోపల చల్లటి గాలి సరిగా సర్క్యులేట్ అవ్వదు. దీనివల్ల ఫుడ్ ఐటమ్స్ త్వరగా పాడవుతాయి. అంతేకాదు, వస్తువులు ఎక్కువగా ఉంటే వాటిని చల్లగా ఉంచడానికి కంప్రెసర్‌ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే వేడి ఫుడ్‌ను డైరెక్ట్‌గా ఫ్రిజ్‌లో పెట్టకుండా, ఐటమ్స్ మధ్య కొంచెం గ్యాప్ ఇస్తూ సర్దాలని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

డెవలప్‌మెంట్ పేరుతో వైజాగ్ నేచర్‌ డ్యామేజ్!▶
Viral· 29 May 2026

డెవలప్‌మెంట్ పేరుతో వైజాగ్ నేచర్‌ డ్యామేజ్!

విశాఖపట్నంలోని తర్లువాడ, సింహాచలం హిల్స్ ఏరియాలో చెట్లను భారీగా నరికేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. companies కోసం ఇలా నేచర్‌ను డ్యామేజ్ చేయడం కరెక్టేనా అంటూ జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. డెవలప్‌మెంట్ పేరుతో ఎన్విరాన్‌మెంట్‌ను పాడుచేస్తుండటంపై వైజాగ్ పబ్లిక్ ఫుల్ సీరియస్ అవుతున్నారు.