గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం

TG: నేటి యూత్ గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానురు విలేజ్‌లో ఏర్పాటు చేసిన పీపీఆర్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి యూత్ ఎక్కువ టైమ్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితం కాకుండా గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణించేలా కృషి చేయాలని కోరారు.



