Latest

 విజయ్ ను చూస్తే జెలసీగా  ఉంది- పవన్ కల్యాణ్
Politics· 26 May 2026

విజయ్ ను చూస్తే జెలసీగా ఉంది- పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ ఈవెంట్‌లో తన 15 ఏళ్ల పొలిటికల్ జర్నీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు కొత్త సీఎం విజయ్ సాధించిన స్పీడ్ సక్సెస్ చూసి తనకు కాస్త "జెలసీ" (అసూయ) వేసిందని సరదాగా నవ్వేశారు.తమిళ రాజకీయాల్లో కటౌట్లు, హోలోగ్రామ్‌లతో ఈజీగా గెలిచేశారని, కానీ తాను మాత్రం 15 ఏళ్లుగా రోడ్లపై తిరుగుతున్నానని పవన్ పేర్కొన్నారు. ఒక పార్టీని నడపడం, లక్షలాది మందిని ఏకం చేయడం చాలా పెద్ద రిస్క్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

CM విజయ్ పార్టీలోకి క్యూ కడుతున్న MLAలు!
Politics· 26 May 2026

CM విజయ్ పార్టీలోకి క్యూ కడుతున్న MLAలు!

తమిళనాడులో AIADMK పార్టీకి గట్టి షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు MLAలు వెళ్ళిపోగా.. rescent గా అంబసముద్రం MLA ఎసాక్కీ సుబయా కూడా పోస్ట్‌కి resign చేశారు. ఆయన తన లెటర్ ను అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చారు. రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ టెస్ట్‌లో ఈయన విప్‌ను ఫాలో అవ్వకుండా TVK గవవర్నమెంట్ కి సపోర్ట్ చేశారు. త్వరలోనే ఈయన CM విజయ్ పార్టీ అయిన TVK లో చేరే ఛాన్స్ ఉంది.

 బెల్జియంలో మినీబస్సును ఢీకొన్న రైలు..పలువురి మృతి
World· 26 May 2026

బెల్జియంలో మినీబస్సును ఢీకొన్న రైలు..పలువురి మృతి

బెల్జియంలోని బుగ్గెన్‌హౌట్ గ్రామంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లెవెల్ క్రాసింగ్ వద్ద 7 గురు పిల్లలు, డ్రైవర్, సూపర్‌వైజర్‌తో వెళ్తున్న స్కూల్ మినీబస్సును ఒక రైలు బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రమైన ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బాధితులకు బెల్జియం హోంమంత్రి సోషల్ మీడియా ద్వారా తీవ్ర సంతాపం తెలిపారు.

కోహ్లీ వర్సెస్ హెడ్ గొడవ.. మధ్యలో బుక్కయిన అమెరికన్ సింగర్!
Sports· 26 May 2026

కోహ్లీ వర్సెస్ హెడ్ గొడవ.. మధ్యలో బుక్కయిన అమెరికన్ సింగర్!

కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య గ్రౌండ్ లో జరిగిన disturbance సోషల్ మీడియాలో ఒక ఫన్నీ ట్విస్ట్‌కి దారితీసింది. మ్యాచ్ అయ్యాక హెడ్‌కి కోహ్లీ షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. అయితే కొందరు నెటిజన్లు ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్‌కి, అమెరికన్ రాపర్ ట్రావిస్ స్కాట్‌కి మధ్య కన్ఫ్యూజ్ అయ్యారు. క్రికెటర్ అనుకుని పాపం ఆ సింగర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి నెగెటివ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ కన్ఫ్యూజన్ ప్రెసెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

9 ఏళ్లలో 400 రోజులు బయటే.. జైలు నుంచి బయటకొచ్చిన డేరా బాబా!
Crime· 26 May 2026

9 ఏళ్లలో 400 రోజులు బయటే.. జైలు నుంచి బయటకొచ్చిన డేరా బాబా!

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు టైమ్ అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా హెడ్ గుర్మీత్ రామ్ రహీమ్ మరోసారి 30 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చారు. హరియాణాలోని సునారియా జైలు నుంచి ఆయన మంగళవారం రిలీజ్ అయ్యారు. 2017లో జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయనకు పెరోల్ రావడం ఇది 16వ సారి. ఈ 9 ఏళ్లలో ఆయన 400 రోజులకు పైగా జైలు బయటే గడపడం ప్రెసెంట్ దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌గా మారింది.

22 లక్షల మంది స్టూడెంట్స్ లైఫ్ తో ఆటలా: SC
Education· 26 May 2026

22 లక్షల మంది స్టూడెంట్స్ లైఫ్ తో ఆటలా: SC

నీట్ 2026 లీక్ పైన సుప్రీం కోర్ట్ ఎన్టీఏ (NTA)ని నిలదీసింది. పాత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోలేదా?' అని గట్టి రియాలిటీ చెక్ ఇచ్చింది. ఇది 22 లక్షల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్‌తో ఆడుకోవడమే అని జస్టిస్ లు సీరియస్ అయ్యారు. 'మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదా?' అని హార్డ్ హిట్టింగ్ క్వశ్చన్స్ వేసి, సిస్టమ్ మొత్తం మార్చాలి లేదా ఎన్టీఏని రద్దు చేయాలి అనే పిటిషన్లపై రెస్పాన్స్ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. సుప్రీం కోర్ట్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ మోడ్ లో ఉండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మానిటర్ చేస్తోంది! స్టూడెంట్స్ కి ఇది పాజిటివ్. NTA ఏం సమాధానం చెప్తుందో చూడాలి.

అనాథకు హెయిర్ కట్, షేవింగ్ చేసిన మంచు మనోజ్!▶
Motivational· 26 May 2026

అనాథకు హెయిర్ కట్, షేవింగ్ చేసిన మంచు మనోజ్!

రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ విజిట్ చేశారు. “సెలబ్రిటీ రీబర్త్ ఛాలెంజ్” లో భాగంగా ఆయన ఒక అనాథకు న్యూ లైఫ్ ఇచ్చారు. మలక్‌పేట్ రోడ్డుపై తిరుగుతున్న ఒక మెంటల్లీ అన్‌స్టేబుల్ పర్సన్‌ను ఆశ్రమం వాళ్లు చేరదీశారు. మనోజ్ స్వయంగా అతనికి హెయిర్ కట్, షేవింగ్ చేయించి, కొత్త బట్టలు ఇచ్చి నార్మల్ పర్సన్‌లా మార్చారు. ఈ ఆశ్రమానికి ఎప్పుడూ తన సపోర్ట్ ఉంటుందని మనోజ్ మాట ఇచ్చారు.

పెన్షన్ కోసం అత్త ని 3 కి.మీ మోసుకెళ్ళిన కోడలు!
News· 26 May 2026

పెన్షన్ కోసం అత్త ని 3 కి.మీ మోసుకెళ్ళిన కోడలు!

ఛత్తీస్‌గఢ్‌లో ఒక కోడలు తన 90 ఏళ్ల అత్తను వీపుపై మోసుకుని 3 కిలోమీటర్లు నడిచింది. కారణం ఏంటంటే, కేవలం ₹500 పెన్షన్ కోసం బ్యాంక్ వెళ్లాల్సి వచ్చింది. కేవైసీ (KYC) పెండింగ్‌లో ఉండటం వల్ల గత నాలుగు నెలలుగా పెన్షన్ ఆగిపోయింది. వేరే దారి లేక, ఆ కోడలు అలా అత్తను మోసుకుంటూ బ్యాంక్‌కు వెళ్ళింది. ఇది చూసిన నెటిజన్లు "సిస్టమ్ ఇంకా మారాలి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ కోడలి డెడికేషన్ మాత్రం నెక్స్ట్ లెవల్!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్ రావు ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్!
Politics· 26 May 2026

ప్రొఫెసర్‌ నాగేశ్వర్ రావు ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్!

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వస్తున్నారనే టాక్ తో ఆయన ఇంటి దగ్గరకు తెలంగాణ పోలీసులు వచ్చారు.. అయితే లోకల్ పోలీసుల పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేస్తే అది ఇల్లీగల్ అవుతుందని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో తెలంగాణ పోలీసులు అరెస్ట్‌కి పర్మిషన్ ఇస్తారా లేదా బ్లాక్ చేస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే హైకోర్టులో పిటిషన్ వేయాలని నాగేశ్వర్ రావు ప్లాన్ చేస్తున్నారు.

ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్!
World· 26 May 2026

ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్!

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇరాన్ దగ్గరున్న యురేనియంను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే ఇంటర్నేషనల్ టీమ్స్ ముందే వాటిని పూర్తిగా స్మాష్ చేయాలని చెప్పారు. ఈ యురేనియంతో డేంజరస్ బాంబ్స్ తయారు చేస్తే వరల్డ్ మొత్తానికి రిస్క్ అని ట్రంప్ చెప్పారు. దీనిపై ఇరాన్ ప్రెసిడెంట్ ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

అదిరిపోయే ఫీచర్స్ తో న్యూ ఆధార్ యాప్!
Technology· 26 May 2026

అదిరిపోయే ఫీచర్స్ తో న్యూ ఆధార్ యాప్!

ఆధార్ కార్డు యూజర్ల కోసం UIDAI ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ప్రజెంట్ వాడుతున్న పాత 'mAadhaar' యాప్‌ను త్వరలోనే కంప్లీట్ గా క్లోజ్ చేయబోతున్నట్లు చెప్పారు. దీని ప్లేస్‌లో ఇంకాస్త ఎక్కువ సెక్యూరిటీ, స్మార్ట్ ఫీచర్స్ ఉన్న కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ కొత్త యాప్‌లో సెక్యూర్ క్యూఆర్ కోడ్ షేరింగ్, ఫేస్ అథెంటికేషన్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు. దీనివల్ల యూజర్లు తమ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్‌ను ఈజీగా లాక్ లేదా మేనేజ్ చేసుకోవచ్చు.

వారి సమాధులు వారే తవ్వుకుంటున్నారు
India· 26 May 2026

వారి సమాధులు వారే తవ్వుకుంటున్నారు

ఇండియాలోని గార్మెంట్, టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు తమ కార్మికులు వారి గోతిలో వారే పడేలా చేస్తున్నాయి. కార్మికుల తలలకు చిన్న కెమెరాలు అమర్చి.. వారు బట్టలు ఎలా కుడుతున్నారు, మిషన్లు ఎలా ఆపరేట్ చేస్తున్నారో ‘ఫస్ట్-పర్సన్ వ్యూ’ (Egocentric Data) లో రికార్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలతో భవిష్యత్తులో మనుషుల స్థానంలో రాబోయే 'హ్యూమనాయిడ్ రోబోలకు' ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిపై నాగ్‌పూర్‌కు చెందిన ఒక టెక్నీషియన్ స్పందిస్తూ నా శవాన్ని పెట్టడానికి నేనే శవపేటిక తయారు చేసుకుంటున్నట్లు ఉందని ఆందోళనగా చెప్పారు. నిజంగా ఇదొక కార్పొరేట్ కుట్ర

Live in Relationship పై పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకతీర్పు
General· 26 May 2026

Live in Relationship పై పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకతీర్పు

మేజర్లు తమకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించి హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తోందని పంజాబ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సహజీవనం చేస్తున్న ఒక జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు వారికి పోలీసు ప్రొటెక్షన్ కల్పించింది. ఈ పిటిషన్ వేసిన ఇద్దరికీ గతంలో పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. పాత బంధాలను పక్కన పెట్టి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. విడాకులు తీసుకోకుండా అలా కలిసి ఉండడం చట్టబద్ధమా ? కాదా ? అన్న అంశాన్ని చెప్పని కోర్టు వారి ప్రాణాలకు మాత్రం రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆదేశించింది.

ఆవును National Animalగా ప్రకటించాలి: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ
General· 26 May 2026

ఆవును National Animalగా ప్రకటించాలి: మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ

దేశంలో గోవధను అరికట్టేందుకు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలా చేయడం వల్ల గోవధ చుట్టూ జరిగే రాజకీయాలకు చెక్ పడుతుందని ముస్లిం సమాజం భావిస్తోంది. ఇప్పటికే ముస్లిం పర్సనల్ లా, జమాయత్ ఇస్లామే హింద్ వంటి సంస్థలు ఆవుని నేషనల్ యానిమల్ గా ప్రకటించాలని అంటున్నారు. ఇప్పుడు మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వారితో గొంతు కలిపారు. ఈ నిర్ణయంతో రూట్ కాజ్ కు పరిష్కారం లభిస్తుందని అంటే అదే చేయాలన్నారు. ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి

ఇదేం నవ్వులు.. పోలీసుల తీరుపై నెటిజన్లు ఫైర్ ▶
India· 26 May 2026

ఇదేం నవ్వులు.. పోలీసుల తీరుపై నెటిజన్లు ఫైర్

ఒక్కసారి ఈ వీడియో చూడండి తమిళనాడు పోలీసు ఆఫీసర్స్ ఎలా నవ్వుతున్నారో. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి కోయంబత్తూరు వెస్ట్ జోన్ IG ఆర్.వి. రమ్య భారతితో పాటు మరో ఇద్దరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ప్రెస్ మీట్ ప్రారంభానికి ముందు నవ్వుతూ, జోకులు వేసుకుంటూ ఉన్న వీడియో బయటకొచ్చింది. ఇంతటి సున్నితమైన, దారుణమైన కేసు గురించి మాట్లాడటానికి వచ్చి.. అంత బాధ్యతారాహిత్యంగా ఎలా నవ్వుతారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతకు ముందు ఈ కేసుపై మీడియా ప్రశ్నించినప్పుడు మంత్రి ఎస్. కీర్తన నవ్వారని విమర్శలు కూడా వచ్చాయి.

గాల్లో 300 ప్రాణాలు.. సేఫ్ గా దించిన ఆర్మీ ▶
India· 26 May 2026

గాల్లో 300 ప్రాణాలు.. సేఫ్ గా దించిన ఆర్మీ

జమ్మూ కశ్మీర్‌లోని ఫేమస్ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో భారీ ప్రమాదం తప్పింది. గొండోలా కేబుల్ కార్ సర్వీస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. 65 క్యాబిన్లలో ఉన్న దాదాపు 300 మంది టూరిస్టులు గాల్లోనే చిక్కుకుపోయారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఆర్మీ,SDRF, NDRF, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి గంటల పాటు శ్రమించి అందరినీ సురక్షితంగా రక్షించారు. ఈ ఆపరేషన్ ఎంత రిస్కో మీరూ చూసేయండి

మళ్లీ యుద్ధం..? ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులు
World· 26 May 2026

మళ్లీ యుద్ధం..? ఇరాన్ పై అమెరికా మెరుపు దాడులు

సీజ్ ఫైర్ నడుస్తున్నప్పటికీ గల్ఫ్ రీజియన్‌లో టెన్షన్స్ మళ్లీ పీక్స్‌కి చేరాయి. సోమవారం దక్షిణ ఇరాన్‌పై అమెరికా సైన్యంహఠాత్తుగా విరు చుకుపడింది. సముద్రంలోmines అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ బోట్లను, అలాగే క్షిపణి ప్రయోగ స్థావరాలను టార్గెట్ చేస్తూ యుఎస్ దాడులు చేసింది. తమ బలగాల రక్షణ కోసమే ఈ ముందస్తు 'డిఫెన్సివ్' యాక్షన్ తీసుకున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పష్టం చేశారు.

 ఆ మూడు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు - ఐఎండీ అలెర్ట్  జారీ
News· 25 May 2026

ఆ మూడు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు - ఐఎండీ అలెర్ట్ జారీ

హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన తుఫాను ముప్పు ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇన్‌శాట్-3డీఎస్ (INSAT-3DS) శాటిలైట్ చిత్రాల ప్రకారం అక్కడ భారీ మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు, మే 26 నాటికే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.అన్ని అంచనాలు సరిపోతే జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈనెల 26నే కేరళను తాకే అవకాశముంది.

ధర్మేంద్రకు పద్మ విభూషణ్- కన్నీరు పెట్టిన అహానా డియోల్
Cinema· 25 May 2026

ధర్మేంద్రకు పద్మ విభూషణ్- కన్నీరు పెట్టిన అహానా డియోల్

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ లెజెండ్, దివంగత నటుడు ధర్మేంద్ర తరఫున ఆయన భార్య హేమమాలిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూమెంట్‌లో హేమమాలిని కుమార్తె అహానా డియోల్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.

 ఇండో పాక్ బోర్డర్ నైట్ టైమ్ వ్యూ-  వాటే బ్యూటీ అంటున్న నెటిజెన్లు
World· 25 May 2026

ఇండో పాక్ బోర్డర్ నైట్ టైమ్ వ్యూ- వాటే బ్యూటీ అంటున్న నెటిజెన్లు

ఇండిగో పైలట్ ప్రదీప్ క్రిష్ణన్ షేర్ చేసిన ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ నైట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. చీకట్లో మెరిసి పోతున్న ఎల్లో ఫ్లడ్‌లైట్స్ లైన్ అంతరిక్షం నుండి చూసినా కనిపిస్తుందట. ఫ్లైట్ లోపల నుండి ఈ రేర్, బ్యూటిఫుల్ వ్యూని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ కామెంట్లు పెడుతున్నారు!రెండు దేశాల సరిహద్దు రేఖ ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదని పలువురు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ సరిహద్దు కాంతివంతంగా మెరవడం దేశ భద్రతకు, పటిష్టమైన నిఘాకు నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

 ఆ మూడు ఎఫ్ లపై ఒక కన్నేసి ఉంచండి - నిర్మలా సీతారామన్ !
Business· 25 May 2026

ఆ మూడు ఎఫ్ లపై ఒక కన్నేసి ఉంచండి - నిర్మలా సీతారామన్ !

యూఎస్-ఇరాన్ వార్ వల్ల గ్లోబల్ మార్కెట్లు షేక్ అవుతూ దేశంలో రేట్లు పెరుగుతున్న టైమ్‌లో.. ఫ్యూయల్ (Fuel), ఫెర్టిలైజర్ (Fertiliser), ఫారెక్స్ (Forex) అనే '3 Fs' పై ఇండియా ఒక కన్నేసి ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలర్ట్ చేశారు. ముంబై ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. క్రూడ్ ఆయిల్ సప్లైకి మెయిన్ రూట్ అయిన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' లో ప్రాబ్లమ్స్ వల్లే ఫ్యూయల్ ప్రైసెస్ కొండెక్కి కూర్చున్నాయన్నారు. ఇండియా తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 85-90% ఇంపోర్ట్స్‌పైనే డిపెండ్ అవుతుందని, అందుకే ఫారెక్స్ రిజర్వ్స్ (విదేశీ మారక నిల్వలు) సేవ్ చేయాలన్న పీఎం మోదీ అప్పీల్ ఇప్పుడు చాలా క్రూషియల్ అని చెప్పారు.