ఇండో పాక్ బోర్డర్ నైట్ టైమ్ వ్యూ- వాటే బ్యూటీ అంటున్న నెటిజెన్లు

ఇండిగో పైలట్ ప్రదీప్ క్రిష్ణన్ షేర్ చేసిన ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ నైట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. చీకట్లో మెరిసి పోతున్న ఎల్లో ఫ్లడ్‌లైట్స్ లైన్ అంతరిక్షం నుండి చూసినా కనిపిస్తుందట. ఫ్లైట్ లోపల నుండి ఈ రేర్, బ్యూటిఫుల్ వ్యూని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ కామెంట్లు పెడుతున్నారు!రెండు దేశాల సరిహద్దు రేఖ ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదని పలువురు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ సరిహద్దు కాంతివంతంగా మెరవడం దేశ భద్రతకు, పటిష్టమైన నిఘాకు నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
