Latest

 ఆ మూడు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు - ఐఎండీ అలెర్ట్  జారీ
News· 25 May 2026

ఆ మూడు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు - ఐఎండీ అలెర్ట్ జారీ

హిమాలయ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన తుఫాను ముప్పు ఉన్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇన్‌శాట్-3డీఎస్ (INSAT-3DS) శాటిలైట్ చిత్రాల ప్రకారం అక్కడ భారీ మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు, మే 26 నాటికే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.అన్ని అంచనాలు సరిపోతే జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు ఈనెల 26నే కేరళను తాకే అవకాశముంది.

ధర్మేంద్రకు పద్మ విభూషణ్- కన్నీరు పెట్టిన అహానా డియోల్
Cinema· 25 May 2026

ధర్మేంద్రకు పద్మ విభూషణ్- కన్నీరు పెట్టిన అహానా డియోల్

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ లెజెండ్, దివంగత నటుడు ధర్మేంద్ర తరఫున ఆయన భార్య హేమమాలిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూమెంట్‌లో హేమమాలిని కుమార్తె అహానా డియోల్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.

 ఇండో పాక్ బోర్డర్ నైట్ టైమ్ వ్యూ-  వాటే బ్యూటీ అంటున్న నెటిజెన్లు
World· 25 May 2026

ఇండో పాక్ బోర్డర్ నైట్ టైమ్ వ్యూ- వాటే బ్యూటీ అంటున్న నెటిజెన్లు

ఇండిగో పైలట్ ప్రదీప్ క్రిష్ణన్ షేర్ చేసిన ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ నైట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. చీకట్లో మెరిసి పోతున్న ఎల్లో ఫ్లడ్‌లైట్స్ లైన్ అంతరిక్షం నుండి చూసినా కనిపిస్తుందట. ఫ్లైట్ లోపల నుండి ఈ రేర్, బ్యూటిఫుల్ వ్యూని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ కామెంట్లు పెడుతున్నారు!రెండు దేశాల సరిహద్దు రేఖ ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదని పలువురు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ సరిహద్దు కాంతివంతంగా మెరవడం దేశ భద్రతకు, పటిష్టమైన నిఘాకు నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

 ఆ మూడు ఎఫ్ లపై ఒక కన్నేసి ఉంచండి - నిర్మలా సీతారామన్ !
Business· 25 May 2026

ఆ మూడు ఎఫ్ లపై ఒక కన్నేసి ఉంచండి - నిర్మలా సీతారామన్ !

యూఎస్-ఇరాన్ వార్ వల్ల గ్లోబల్ మార్కెట్లు షేక్ అవుతూ దేశంలో రేట్లు పెరుగుతున్న టైమ్‌లో.. ఫ్యూయల్ (Fuel), ఫెర్టిలైజర్ (Fertiliser), ఫారెక్స్ (Forex) అనే '3 Fs' పై ఇండియా ఒక కన్నేసి ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలర్ట్ చేశారు. ముంబై ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. క్రూడ్ ఆయిల్ సప్లైకి మెయిన్ రూట్ అయిన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' లో ప్రాబ్లమ్స్ వల్లే ఫ్యూయల్ ప్రైసెస్ కొండెక్కి కూర్చున్నాయన్నారు. ఇండియా తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 85-90% ఇంపోర్ట్స్‌పైనే డిపెండ్ అవుతుందని, అందుకే ఫారెక్స్ రిజర్వ్స్ (విదేశీ మారక నిల్వలు) సేవ్ చేయాలన్న పీఎం మోదీ అప్పీల్ ఇప్పుడు చాలా క్రూషియల్ అని చెప్పారు.

 దురంధర్ 2 తర్వాత రణ్ వీర్ కు ఇండస్ట్రీ నాన్ కోపరేషన్ !!
Cinema· 25 May 2026

దురంధర్ 2 తర్వాత రణ్ వీర్ కు ఇండస్ట్రీ నాన్ కోపరేషన్ !!

ఫర్హాన్ అఖ్తర్ ప్రతిష్టాత్మక చిత్రం 'డాన్ 3' నుండి నటుడు రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో, అతనిపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సహాయ నిరాకరణ (non-cooperation) ఆదేశాన్ని జారీ చేసింది. షూటింగ్‌కు కేవలం మూడు వారాల ముందే రణ్‌వీర్ తప్పుకుని నష్టం చేకూర్చాడని ఫర్హాన్ ఏప్రిల్ 11న ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని FWICE పదేపదే నోటీసులు పంపినా రణ్‌వీర్ స్పందించకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ఆ స్టార్టప్ భర్తల కష్టాలు తీర్చేసింది..!
Viral· 25 May 2026

ఆ స్టార్టప్ భర్తల కష్టాలు తీర్చేసింది..!

ఢిల్లీకి చెందిన క్యారీమెన్ అనే స్టార్టప్ కంపెనీ కొత్త ఐడియా SMలో వైరల్ అవుతోంది. గంటకు ₹149లకే షాపింగ్ అసిస్టెంట్ సర్వీస్ అందిస్తోంది. ఆ అసిస్టెంట్ మీ వెంటే ఉంటూ 12 కేజీల బరువు మోయడం, క్యూలో నిలబడడం, గొడుగు పట్టడం వంటి పనులన్నీ చేస్తాడు. You shop we carry అన్నది ఆ కంపెనీ ట్యాగ్ లైన్. ఇక షాపింగ్‌లో భర్తల ఉద్యోగాలు ఊడినట్లే అని కొందరు నెటిజన్లు జోకులు వేస్తుంటే.. గర్భిణీలు, వృద్ధులకు ఇదో అద్భుతమైన సాయమని మరి కొందరు ప్రశంసిస్తున్నారు. మొదటి నెలలో 50కి పైగా బుకింగ్స్ వచ్చాయి.

 హైదరాబాద్ లో పలు ఏరియాల్లో దంచి కొడుతున్న వర్షం !!
General· 25 May 2026

హైదరాబాద్ లో పలు ఏరియాల్లో దంచి కొడుతున్న వర్షం !!

హైదరాబాద్ లో పలు ఏరియాల్లో వర్షం దంచి కొడుతోంది. ఎల్బీ నగర్ పరిధిలో ఈ మధ్యాహ్నం నుంచి వెదర్ పూర్తిగా మారిపోయింది. ఉదయం మాడు పగల గొట్టిన ఎండ మధ్యాహ్నానికి మాయమై దట్టమైన నల్లమబ్బులు కమ్మేశాయి. ఈదురు గాలులు వీచి బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్ లలో వర్షం భీభత్సంగా పెరిగింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారి అటు మిగిలిన ప్రాంతాల్లోనూ చల్ల గాలి వీచింది. సరూర్ నగర్, మెట్, హయత్ నగర్ ఏరియాల్లోనూ వర్షం దంచి కోడుతోంది. ఎండలకు విల విలలాడిన నగర ప్రజలు ఈ వర్షం , గాలులకు సేద తీరుతున్నారు.

అమ్మాయిల్లో ఆ ఏడుపు మంచిదే
Health· 25 May 2026

అమ్మాయిల్లో ఆ ఏడుపు మంచిదే

తీవ్రమైన కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారు. దీనికి కారణం హార్మోన్స్ ప్రభావం కాదని నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి కోపం, ఆవేశం వంటి ఫీలింగ్స్ రాకూడదని ఫ్యామిలీ నూరిపోస్తుంది. అవన్నీ అణుచుకోవడం వల్ల ఒత్తిడి, మనసులోని బాధ, ఇమోషన్స్ అన్నీ మిక్స్ అయి కన్నీళ్లు వస్తాయట. ఇలా ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ లాంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలై మనసు రిలాక్స్ అవుతుంది. అంటే ఏడుపు అనేది వీక్‌నెస్ కాదు. బ్రెయిన్, నెర్వస్ సిస్టమ్ ఒత్తిడిని దూరం చేసే ఒక నేచురల్ రియాక్షన్ అన్నమాట.

ముగ్గురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా.. టీవీకేలోకి జంప్
Politics· 25 May 2026

ముగ్గురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా.. టీవీకేలోకి జంప్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ప్రతిపక్ష AIADMKకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార TVK పార్టీలో చేరారు. మధురాంతకం ఎమ్మెల్యే మరగాథం కుమారవేల్, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ సోమవారం స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. స్పీకర్ వాటిని వెంటనే ఆమోదించారు.

పాకిస్తాన్ లో సూసైడ్ బాంబింగ్!▶
Crime· 25 May 2026

పాకిస్తాన్ లో సూసైడ్ బాంబింగ్!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. క్వెట్టాలో సైనికులతో వెళ్తున్న రైలుపై సూసైడ్ కారు బాంబు దాడి జరగడంతో కనీసం 24 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దారుణానికి బాధ్యత వహించింది. గాయాలైన వాళ్ళని ఆస్పత్రులకు తరలించగా, చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

త్విషా శర్మ మృతి కేసు.. సుప్రీంకోర్టు సుమోటో విచారణ!
India· 25 May 2026

త్విషా శర్మ మృతి కేసు.. సుప్రీంకోర్టు సుమోటో విచారణ!

నటి త్విషా శర్మ వరకట్న వేధింపుల మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ మొదలు పెట్టింది. త్విషా అత్త రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి కావడంతో.. కేసును తప్పుదోవ పట్టించేలా ఇన్స్టిట్యూషనల్ బయాస్ జరుగుతోందన్న ఆరోపణలపై సిజెఐ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఈ కేసు విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది.

ఇంకా పాఠాలు నేర్చుకోలేదా?.. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం ఆగ్రహం
General· 25 May 2026

ఇంకా పాఠాలు నేర్చుకోలేదా?.. నీట్ పేపర్ లీక్‌పై సుప్రీం ఆగ్రహం

వరసగా ఏళ్లకి ఏళ్లు వివాదాల తర్వాత కూడా ఈసారి నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంత జరిగినా అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం అని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరిస్తూ.. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

₹500 పెన్షన్ కోసం… ఛత్తీస్ గఢ్ లో ఏమైందంటే ..? ▶
India· 25 May 2026

₹500 పెన్షన్ కోసం… ఛత్తీస్ గఢ్ లో ఏమైందంటే ..?

మన ప్రధాని మోదీ డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతూ ఉంటారు కదా…! దాని ఫలితం ఏంటంటే ఛత్తీస్‌గఢ్‌లో సుఖ్మనియా భాయి అనే ఓ కోడలు 90 ఏళ్ల వయసున్న తన అత్తను వీపుపై మోసుకుని 9 కి.మీ నడిచి బ్యాంక్‌కు తీసుకెళ్లింది. కారణమేంటంటే రూ.500 పెన్షన్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్, KYC పూర్తి చేయడం తప్పనిసరి కావడం. అడవిలో కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుంటూ ఆమె వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. కేవైసీ పూర్తి చేసి పెండింగ్ సొమ్ము అందజేశారు.

నెమలి పురి విప్పితే... ▶
Viral· 25 May 2026

నెమలి పురి విప్పితే...

ఎండల ధాటికి బెంబేలెత్తిపోతున్న రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఓ రోజు ఉదయం ఆకాశం మబ్బు పట్టింది. చల్లగాలి సోకడంతో ఒక నెమలి ఇంటి టెర్రస్ పైకి ఎక్కి పురి విప్పి నాట్యం చేసింది. కంటికి, మనసుకి ఆహ్లాదంగా ఉండే ఈ విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

గుక్కెడు నీటి కోసం 45 అడుగుల లోతైన బావిలోకి.. ▶
India· 25 May 2026

గుక్కెడు నీటి కోసం 45 అడుగుల లోతైన బావిలోకి..

దేశవ్యాప్తంగా ఎండలు దండికొడుతున్నాయి. దీంతో తాగునీటికి కటకట ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని వాల్సాద్ జిల్లాలో ప్రజలు గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీటి కోసం 45 అడుగుల లోతున్న బావిలోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ నీటిసరఫరా లేకపోవడంతో నానా అవస్తలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం ప్రాణాలకు తెగించి ఎలా పోరాడుతున్నారో ఈ వీడియోలో మీరూ చూసేయండి

బెంగళూరు భారీ సైబర్ మోసం. మహిళ నుంచి 24 కోట్లు దోపిడి
Crime· 25 May 2026

బెంగళూరు భారీ సైబర్ మోసం. మహిళ నుంచి 24 కోట్లు దోపిడి

బెంగళూరులో 74 ఏళ్ల లక్ష్మీ రామమూర్తి అనే మహిళ డిజిటల్ అరెస్ట్ బారిన పడి ఏకంగా రూ.24 కోట్లు కోల్పోయారు. CBI, ED అధికారులమని చెప్పిన సైబర్ మోసగాళ్లు వీడియో కాల్‌ చేసి మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందంటూ భయపెట్టారు. ఆస్తులు అమ్మిన ఆమె డబ్బులన్నీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 26 లావాదేవీల్లో మొత్తం 23 అకౌంట్లలో జమ చేయించుకున్నారు. 1.3 కేజీల బంగారం తాకట్టు పెట్టడానికి ఆమె బ్యాంకుకి వెళ్లినప్పుడు మేనేజర్ కి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. పోలీసులు రంగంలోకి దిగి ₹5.46 కోట్లు ఫ్రీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.

మళ్లీ పెట్రో బాదుడు.. రెండు వారాల్లో 4వ సారి పెంపు
General· 25 May 2026

మళ్లీ పెట్రో బాదుడు.. రెండు వారాల్లో 4వ సారి పెంపు

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో దేశంలో ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. లీటర్ పెట్రోల్‌పై ₹2.61, డీజిల్‌పై ₹2.71 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగోసారి. ఈ తాజా బాదుడుతో ఎప్పుడూ రేట్లు తక్కువగా ఉండే దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర ₹100 మార్క్‌ను దాటి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడమే దీనికి కారణం.

కాక్రో్చ్ పార్టీ పై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు
General· 24 May 2026

కాక్రో్చ్ పార్టీ పై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు

సుప్రీంకోర్టు కోర్టు హాల్లో చేసిన ఓరల్ కామెంట్లను స్వార్ధ ప్రయోజ నాలకు, వాణిజ్య ప్రకటనలకు వాడుకుంటున్నారంటూ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' అనే రాజకీయ సంస్థపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. కోర్టు వ్యాఖ్యలను పబ్లిసిటీ కోసం డిజిటల్ మాధ్యమాల్లో తప్పుగా వాడుకోవడం ప్రమాదకరమని పిటిషన్ పేర్కొంది. అలాగే, నకిలీ డిగ్రీలతో చట్టవిరుద్ధంగా లాయర్ వృత్తి చేస్తున్న వారిపై సిబిఐ (CBI) చేత స్వతంత్ర విచారణ జరిపించాలని ఈ పిటిషన్ కోరింది.

యురేనియం నిల్వలు వదులు కోడానికి ఇరాన్ రెడీ !
World· 24 May 2026

యురేనియం నిల్వలు వదులు కోడానికి ఇరాన్ రెడీ !

అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చల్లో భాగంగా, తమ వద్ద ఉన్న అత్యంత సంపన్న యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. పశ్చిమాసియా ఘర్షణలను ముగించడం, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. వాషింగ్టన్, టెహ్రాన్‌లు ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాబోయే 30 నుండి 60 రోజుల్లో దీనిపై తుది చర్చలు జరగనున్నాయి.

  మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎల్ అండ్ టీ ఆఫీస్ లో అగ్నిప్రమాదం▶
Politics· 24 May 2026

మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎల్ అండ్ టీ ఆఫీస్ లో అగ్నిప్రమాదం

మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కాలి బూడిదైనట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఎండిన గడ్డికి లేదా చెత్తకు పెట్టిన నిప్పు, గాలి వేగానికి ఎల్ అండ్ టీ తాత్కాలిక క్యాంప్ కార్యాలయానికి (అంబటిపల్లి వద్ద) వ్యాపించిందని అక్కడి సిబ్బంది ప్రాథమికంగా చెబుతున్నారు.

  డిప్యూటీ సీఎం  కొడుకైతే మాత్రం... స్పెషల్ ట్రీట్ మెంటా?
Politics· 24 May 2026

డిప్యూటీ సీఎం కొడుకైతే మాత్రం... స్పెషల్ ట్రీట్ మెంటా?

కాకినాడ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కుమారుడు అకీరా నందన్ ఈరోజు మధ్యాహ్నం 2:25 ని.లకి కాకినాడ సమీపంలోని కోరింగ అభయారణ్యం మడ్ పార్క్ ని సందర్శించి బోట్ లో షికారు చేశారు. MLA స్టికర్ ఉన్న కాన్వాయిలో లోపల బోటింగ్ వరకు అనుమతి లేనప్పటికీ అన్ని కార్ లను ఎలా అనుమతించారని విచ్చేసిన సందర్శకులు విస్మయం వ్యక్తం చేశారు. తాము భగ భగ మండే ఎండలో కిలోమీటర్ నడిచి వస్తుంటే వారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన సందర్శకులను పక్కన ఆపేసి రాచమర్యాదలు పొందారని వాపోయారు.