← Back to news

Live in Relationship పై పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకతీర్పు

By aravinda nyayapati· 26 May 2026· Indianexpress· Chandigarh
Live in Relationship పై పంజాబ్ హర్యానా హైకోర్టు కీలకతీర్పు

మేజర్లు తమకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించి హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తోందని పంజాబ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ సహజీవనం చేస్తున్న ఒక జంట వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు వారికి పోలీసు ప్రొటెక్షన్ కల్పించింది. ఈ పిటిషన్ వేసిన ఇద్దరికీ గతంలో పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. పాత బంధాలను పక్కన పెట్టి వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. విడాకులు తీసుకోకుండా అలా కలిసి ఉండడం చట్టబద్ధమా ? కాదా ? అన్న అంశాన్ని చెప్పని కోర్టు వారి ప్రాణాలకు మాత్రం రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆదేశించింది.

More in General