Latest

SIR సరైనదే : సుప్రీం కోర్టు కీలక తీర్పు
బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితాల Special Intensive Revision (SIR) నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం అవసరమేనని తెలిపింది. అయితే ఇదే సమయంలో ఓటర్ల జాబితా నుండి పేర్లు డిలీట్ అయిన వారి విషయంలో కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పొరపాటున ఓట్లు పోయిన జెన్యూన్ ఓటర్లను గుర్తించి, వారు మళ్లీ ఓటు హక్కు పొందేలా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

'నా భర్తను ఇండియాకు రప్పించండి'
TG: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ రూ.70 వేలు లక్ష్మణచందా గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్‌కు చెల్లించి ఈ నెల 15న ఇంటి నుంచి బయలుదేరి 9 మందితో కలిసి దుబాయ్‌కి వెళ్లాడు. శ్రీకాంత్‌తో కలిసి వెళ్లిన మిగతా తొమ్మిది మంది పనికి వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపారు. 9మందితో కలిసి పనికి వెళ్లకుండా గత 13రోజుల నుంచి నా భర్త శ్రీకాంత్ ఫోన్ కంటాక్ట్, ఆచూకీ లేకుండా పోయిందని, నా భర్త ఎక్కడున్నా ఆచూకీ కనుక్కొని ఇండియాకు రప్పించాలని భార్య అలేఖ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసింది.

రేపే సిద్దరామయ్య రిజైన్ … కాంగ్రెస్ ఆయనను ఎలా ఒప్పించిందంటే ..?
కర్ణాటక కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు ఖరారైంది. సీఎం సిద్దరామయ్య రేపు రిజైన్ చేసే ఛాన్స్ ఉంది. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ సీఎం అవుతారు. 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ మార్పు చేస్తోంది. రాజ్యసభ ఎంపీని చేసి సిద్దరామయ్యని నేషనల్ లెవల్ లో ఒక OBC ఫేస్ గా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ లైన్ లో సిద్దరామయ్యకు జాతీయ రాజకీయాల్లో ప్రయార్టీ ఇస్తామని చెప్పి ఆయనను సీఎం పదవి నుంచి వైదొలగడానికి ఒప్పించినట్టు తెలుస్తోంది.

బెంగళూరులో ఎబోలా టెన్షన్: ఐసలేషన్ లో ఉగాండా మహిళ
భారత్ లోనూ ఎబోలా వైరస్ ఎంటర్ అయిందా ? ఇప్పుడిదే ఆందోళన మొదలైంది. ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరు వచ్చిన మహిళకు ఎబోలా ఉందన్న అనుమానాలు వచ్చాయి. 28 ఏళ్ల వయసున్న ఆమెకి ఒళ్లు నొప్పులు, అలసట వంటి ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. దేశంలో ఎక్కడా ఎబోలా కేసు నమోదు కాలేదని ఆందోళన చెందాల్సిన పనే లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ రైడ్స్
మనీ లాండరింగ్ కేసులో కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ED షాకిచ్చింది. తిరువనంతపురంలోని ఆయన ఇల్లు సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీ నుంచి CMRL అనే సంస్థ ఎలాంటి సేవలు పొందకుండా ₹1.72 కోట్లు అక్రమంగా చెల్లించిందనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఈడీ దర్యాప్తుని అడ్డుకోవాలంటూ CMRL వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ రైడ్స్ మొదలయ్యాయి.

'అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి'
TG: బక్రీద్ పండుగ నేపథ్యంలో మెదక్ టౌన్ పరిధిలోని బోధన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.

కర్నాటకలో డి.కె. శివకుమార్ కు పగ్గాలు- సిద్దరామయ్యకి రాజ్యసభ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో రెండు, మూడు రోజుల్లో రాజీనామా చేయనున్నారు. కొత్త సీఎం రేసులో ఉన్న డి.కె. శివకుమార్‌కు కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇక సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిచి, రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేశారు. 2023లో జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ లీడర్‌షిప్ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖలో మారిన వెదర్.. బీచ్ రోడ్ లో అరుదైన దృశ్యం
ఎండలతో మండిపోతున్న విశాఖ పరిసర ప్రాంతాలు ఇవాళ అనూహ్యమైన వాతావరణాన్ని ఫేస్ చేశాయి. సాయంత్రం నాలుగింటి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్మేసి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. చీకటిగా మారిపోయింది. మండే ఎండలతో అల్లాడిపోయిన విశాఖ వాసులు కాస్త సేద తీరారు. పెద్దగా వర్షం పడనప్పటికీ ఈదురు గాలులతో , ఆహ్లాద కరంగా మారిపోయింది. సముద్రం ఆకాశం కలిసినట్టు కనిపించే అరుదైన దృశ్యం బీచ్ లో చోటు చేసుకుంది.

తమ ధాన్యానికి తొందరగా తూకం వేయండి సారూ
TG: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో నెలరోజులు దాటినా ధాన్యాన్ని తూకం వేయడంలేదని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తన హెల్త్ బాగలేక హాస్పిటల్‌కు వెళ్లి వచ్చానని, 45రోజులు దాటినా ఇప్పటికీ ధాన్యం తూకం వేయలేదని రైతు నాగులు తన బాధను తెలిపాడు. కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లోడ్ చేసి రైస్‌మిల్‌కు పంపి ఐదురోజులు గడుస్తుందని, లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నలుగురు ఐదుగురు రైతులతో కలిసి లారీలను తీసుకొచ్చి ధాన్యాన్ని తరలిస్తున్నామని నిర్వాహకురాలు ఊర్మిళ తెలిపారు. అందుకే వరుసక్రమంలో లారీలను పెట్టలేకపోతున్నామని ఆమె చెప్పారు.

డీజే టిల్లు డైరెక్టర్ తో కార్తీ నెక్స్ట్ మూవీ!
ఇది అఫీషియల్! కోలీవుడ్ స్టార్ కార్తీ తన 30వ సినిమా కోసం 'మ్యాడ్' ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ మూవీ ఫుల్ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీతో రాబోతుంది. 'మ్యాడ్' మూవీతో యూత్‌ని షేక్ చేసిన కళ్యాణ్, ఇప్పుడు కార్తీ కోసం ఒక నెక్స్ట్ లెవల్ ఫన్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఆల్రెడీ ఫుల్ హైప్‌లో ఉన్నారు. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది!

పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ
TG: ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందించాలని, పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని మెదక్ ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావు సూచించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించిన ఎస్పీ.. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రాణం తీసిన ఈత సరదా
TG: సరదాగా ఈతకని వెళ్లి చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం మణికొండకు చెందిన కమల్ అనే యువకుడు మంగళవారం తన స్నేహితులతో కలిసి నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు కమల్ డెడ్‌బాడీని బయటకు తీసి నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి'
TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పాములపర్తి వెంకట నరసింహారావు స్వగ్రామమైన వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పీవీ స్ఫూర్తి వనంలోని ఫోటోగ్యాలరీ, సైన్స్ మ్యూజియం, సమావేశ మందిరాన్ని సందర్శించిన కలెక్టర్, అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని పర్యాటక శాఖ, కుడా అధికారులకు సూచించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్
AP: కారు అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్డడంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సోషల్ మీడియాలో త్రెట్స్.. DGPని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు!
గత 11 రోజులుగా సోషల్ మీడియాలో తనకు కంటిన్యూస్‌గా బెదిరింపులు వస్తున్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మీడియా ముందు మాట్లాడారు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఆయన తెలంగాణ DGP కి కంప్లైంట్ చేశారు. తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ త్రెట్స్ పై పోలీసులు వెంటనే స్పందించి, తగిన నిర్ణయం తీసుకోవాలని నాగేశ్వర్ రావు కోరారు.
బొద్దింకలను చంపుతూ BJP హల్చల్!
BJP పాలసీలను క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో "కాక్‌రోచ్ జనతా పార్టీ" అనే ట్రెండ్ నడుస్తోంది. దీనికి కౌంటర్‌గా BJP కార్యకర్తలు రోడ్డుపై ఉన్న బొద్దింకలను టార్గెట్ చేస్తూ ఒక విచిత్రమైన ప్రొటెస్ట్ చేశారు. చేతుల్లో చీపుర్లు, చెప్పులు, ఇన్‌సెక్ట్ స్ప్రేలు పట్టుకుని బొద్దింకలను చంపుతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ విచిత్రమైన నిరసనకు సంబంధించిన వీడియో ప్రెసెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మహిళపై దారుణంగా దాడి చేసి చైన్ స్నాచింగ్‌కు యత్నం
హైదరాబాద్ – కొంపల్లి జయభేరి కాలనీలో ఆయిల్ షాప్ నిర్వహిస్తున్న యజమానురాలిపై దారుణంగా దాడి చేసి, చైన్ స్నాచింగ్‌కు దుండగుడు ప్రయత్నించాడు. ఆయిల్ షాపులో ఉన్న మహిళ తో ముందు మాటలు కదిపి ఆపై ఆమెపై దాడి చేసి దారుణంగా కొట్టాడు. ఆమెను కింద పడవేసి చైన్ లాగే ప్రయత్నం చేశాడు. మహిళ కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పట్టపగలే హైదరాబాద్ లో మహిళలకు భద్రత కరువవుతోంది.
ఎండ వేడికి తగుల బడిపోయిన ఎయిర్ఇండియా బస్సు !!
ఎండవేడి భయపెడుతోంది.. నిప్పుల కొలిమిలా మంట పెట్టేస్తోం ది..! భానుడి భగభగల ధాటికి రోడ్లపై వెళ్లే వాహనాలు సెగలు కక్కుతూ తగలబడిపోతున్నాయి..రోజూ ఏదో ఒక చోట వాహనాలు తగలబడిపోతున్న ఘటనలు పెద్ద సంఖ్యలోనే చోటు చేసుకుంటున్నాయి..! తాజాగా హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది..!ఈసారి ఎయిర్ ఇండియా బస్సు మంటల్లో కాలిపోయింది..!హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధమైంది..!శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వర్క్ షాప్ నుండి సర్వీసింగ్ కోసం ఆటోనగర్ వెళ్తుండగా పెద్ద అంబర్పేట వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా బస్సు మొత్తం వ్యాపించడంతో మొత్తంగా తగులబడిపోయింది..!
లారీ టైరు పేలడంతో వా హనాల ఢీ - ఎండ వేడిమి కారణం!
నిజామాబాద్ జిల్లా చంద్రన్ పల్లిలో.. NH-44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...లారీ టైరు పేలి సడెన్ గా ఆగిపోవడంతో.. వెనుక వస్తున్న 7 కార్లు, 3 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి... పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమై రోడ్డు పక్కన పడిపోయాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలుఅయ్యాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో టైర్లు.. వాటిల్లో ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు పవన్ కళ్యాణ్ కౌంటర్!
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన కామెంట్స్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరినైనా జైల్లో పెడితే జనసేన పార్టీ పెరుగుతుందా? అని క్వశ్చన్ చేశారు. ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేయడానికి కోర్టు లు ఉన్నాయని చెప్పారు. తాను అమిత్ షాను కలిసింది ఓన్లీ డెవలప్‌మెంట్ గురించేనని, ఎవరినో జైల్లో పెట్టించడానికి కాదని పవన్ కళ్యాణ్ క్లియర్ చేశారు.

ఇండస్ట్రీ బ్యాన్ చేయడంతో రణవీర్ అమ్మ వారి ఆలయ సందర్శన
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ మంగళవారం ఉదయం మైసూర్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 'కాంతార' మూవీ మిమిక్రీ వివాదంలో కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ ఆలయాన్ని సందర్శించారు. అయితే, 'డాన్ 3' సినిమా నుండి రణ్‌వీర్ తప్పుకోవడంతో నిర్మాతలకు ₹45 కోట్ల నష్టం వాటిల్లిందనే కారణంతో 'FWICE' ఆయనపై నాన్-కోఆపరేషన్ నోటీస్ జారీ చేసిన మరుసటి రోజే ఈ ఆలయ సందర్శన జరగడం విశేషం. దీనిని అత్యంత సీక్రెట్ గా ఉంచారు..