Latest

అంబేడ్కర్‌పై అసత్య ప్రచారం.. అధికారులకు ఫిర్యాదు
AP: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు అధికారులను కోరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనాను రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

వృద్ధుడిపై రాయితో దాడి.. నిందితుడి అరెస్ట్
TG: వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కోసం డబ్బుల వసూళ్ల విషయంలో మొదలైన వివాదం ఘర్షణకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చెరుకుపల్లి రెవెన్యూ శివారులో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో బైరంపల్లి రాములు (58)పై కార్తిక్ అలియాస్ వంశీ (22) రాయితో దాడి చేశాడు. రాములు నోటిలోని నాలుగు పళ్లు విరిగి తీవ్ర రక్తస్రావమైంది. కొందుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్తిక్‌ను షాద్‌నగర్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్‌హెచ్‌ఓ వరప్రసాద్ తెలిపారు.

సర్కార్‌కు ఉద్యోగుల అల్టిమేటం.. ఇక పోరుబాటే
TG: తమ సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ నిర్వహించి నగరాన్ని నిర్బంధిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఉద్యోగుల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్ల సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేపడతామని ప్రకటించారు.

బీసీల విద్యపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: ఆర్. కృష్ణయ్య
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో పేద కులాల విద్యాభివృద్ధికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ పరిసరాల్లో బీసీ విద్యార్థి, యువజన, నిరుద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘ఫీజులపై మహా తిరుగుబాటు’ ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మీరాలం ఇక టూరిజం హబ్: CM రేవంత్ రెడ్డి
TG: హైదరాబాద్‌లోని మీరాలం చెరువు అభివృద్ధి పనులపై CM రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువు వద్దకు చేరుకున్న CM.. భారీ క్రేన్‌పై నుంచి జరుగుతున్న పనులను పరిశీలించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. చెరువులో ఐల్యాండ్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. మీరాలంను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు.

అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: CM చంద్రబాబు
AP: 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం దక్కితే.. ప్రపంచస్థాయి క్రీడా వేదికగా అమరావతిని తీర్చిదిద్దాలని CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ఒలింపిక్స్ నిర్వహణకు అనువైన ప్రదేశంగా రూపొందించాలని సూచించారు. రాజధాని నిర్మాణం, రైతుల లేఔట్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల కోసం కేటాయింపుల అనంతరం సీఆర్‌డీఏ వద్ద మిగిలిన 3,800 ఎకరాలను అత్యంత పొదుపుగా వినియోగించాలని స్పష్టం చేశారు.
మారికవలస స్కూల్ రద్దు వద్దు... 2 రోజులుగా parents ఆందోళన
మారికవలస పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాడేరు ఐటీడీఏలో రెండో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారి డిమాండ్ స్పష్టంగా ఉంది – "మా పిల్లలను మారికవలస పాఠశాలలోనే కొనసాగించాలి." సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను రద్దు చేయడం ఆదివాసులకు తీవ్ర అన్యాయమని, ఆదివాసి ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లో చదువుకునే అవకాశాన్ని లేకుండా చేయడం తీవ్ర దెబ్బ అని ఆందోళన వ్యక్తం చేశారు. <br>విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని, మారికవలస గురుకుల స్కూలు కొనసాగించాలని, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

కిట కిట లాడుతున్న RTC బస్సులు
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని వరంగల్–తొర్రూరు మార్గంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో బస్సుల్లో రద్దీ నెలకొంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వరంగల్–తొర్రూరు రూట్‌లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

3 కి.మీ.అదనం... హైవేతో సూరారంకు అన్యాయం..
కొత్త హైవే వచ్చి ఊరిని మరింత దూరం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం మెయిన్ రోడ్డును నేషనల్ హైవే అధికారులు మూసేశారు. ఇప్పుడా గ్రామానికి వెళ్లాలంటే.. వల్లభాపూర్ మీదుగా సుమారు 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిందే. ఎల్కతుర్తి, హుజురాబాద్, హనుమకొండ వైపు రోజూ వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, రైతులు, ద్విచక్ర వాహనదారులు – అందరికీ ఇది భారీ ఇబ్బంది. "అసలు సూరారం మండలంలోనే అతి పెద్ద గ్రామం. ఇలా మార్గం మూసేయడం వల్ల నిత్యావసరాలకే ఆటంకం" అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రీపెయిడ్ కరెంట్.. కోరుట్లలో టీఆర్ఎస్ ధర్నా!
మొబైల్ రీఛార్జ్ లాగా.. ఇక కరెంట్ కూడా ముందస్తు చెల్లింపేనా? అంటూ.. కోరుట్ల బస్టాండ్ వద్ద తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రీపెయిడ్ విద్యుత్ విధానం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరిగింది. టీఆర్ఎస్ కోరుట్ల ఇన్ఛార్జ్ డా. రఘు మాట్లాడుతూ – "స్మార్ట్ మీటర్లకు మేము వ్యతిరేకం కాదు. కానీ ముందుగారీచార్జ్ చేస్తేనే కరెంట్ వచ్చే విధానం ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది" అని ఖండించారు. ఇది పేద, గ్రామీణ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జీకేవీధి ఏకలవ్య విద్యార్థి ఆకస్మిక మృతి
జీకేవీధి ఏకలవ్య పాఠశాల విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందారు. కొయ్యూరు మండలం తోటిమామునిపాలెం గ్రామానికి చెందిన దీపక్ ఏకలవ్యలో 7వ తరగతి చదువుతున్నాడు. నిన్న జ్వరం రావడంతో పాఠశాల వైద్య సిబ్బంది జీకేవీధి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గురువారం కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఊపిరి అందక ఇబ్బంది పడినట్లు చింతపల్లిలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ప్రిన్సిపల్ రమణారావు తెలిపారు.

వారికి 100% రిజర్వేషన్లు.. స్పష్టత కావాల్సందే...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 29న అరకులోయ మండలం గన్నెల పర్యటన సందర్భంగా ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ క్రమ ఒప్పందాలు జారీ చేసిన జీవోలు13,51,2,29 రద్దు చేయాలని పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన లక్ష రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆన్‌లైన్‌లో నో స్టాక్.. రోడ్డుపై రైతుల రాస్తారోకో!
యూరియా కోసం ఆన్‌లైన్ బుకింగ్ – కానీ ప్రతీసారీ 'నో స్టాక్'. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఓ వైపు 440 బస్తాలు తాడ్వాయి పీఎసీఎస్ పరిధిలో ఉన్నాయని, కావాల్సిన రైతులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతుంటే, మరోవైపు రైతులు యాప్ ఓపెన్ చేస్తే.. మళ్లీ 'నో స్టాక్' అని వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డెక్కారు. సమస్యను పై స్థాయి అధికారులకు తెలియచేస్తానని AO హామీనివ్వడంతో శాంతించారు.

చెట్లకు రాఖీ.. నల్లకుంటలో 'వృక్షా బంధన్' క్రియేటివిటీ!
రక్షా బంధన్ అంటే అక్క చెల్లెళ్లు తమ్ముళ్లకు రాఖీ కట్టే పండుగ. కానీ Hyd లోని నల్లకుంటలో మాత్రం సీన్ వేరు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నల్లకుంట (GHS Nallakunta) లో రక్షా బంధన్ సందర్భంగా.. 'వృక్షా బంధన్' కార్యక్రమం నిర్వహించారు.ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ముత్యాల రవీందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ – "మనుషులు వృక్షాలతో సహజీవనం చేసినప్పుడే వాటి ప్రయోజనాలు పొందుతారు. మొక్కలు నాటడమే కాదు.. వాటిని రక్షించుకోవడం చాలా అవసరం" అని అన్నారు. పిల్లలు, స్టాఫ్ కలిసి ఆకులు, పువ్వులు, విత్తనాలతో రకరకాల రాఖీలు తయారు చేశారు.

తాడేపల్లి SHG మహిళకు egg cart
గుంటూరు జిల్లా తాడేపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఉచితంగా ఎగ్ కార్ట్‌ను అందజేశారు. ఎన్ఈసీసీ ఆర్థిక సహాయంతో రూ.50 వేల విలువైన ఈ కార్ట్‌ను మాధురీ సంజన సంఘం సభ్యురాలు స్వీకరించారు. టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు మాట్లాడుతూ – "ఇది మహిళా సాధికారతకు ఎంతో దోహదం చేస్తుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యం మాకు ఉంది" అని అన్నారు.

సూర్యాపేటలో underpass కష్టాలు..
సూర్యాపేట పట్టణంలోని హైవే అండర్‌పాస్ సమీపంలో, మాంగల్య షాపింగ్ మాల్ వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ లేదు. ట్రాఫిక్ పోలీసులు లేరు. మరో వైపు అండర్‌పాస్ వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఎక్కువ నిద్రా.. తక్కువ నిద్రా? బాడీకి ఏది మంచిది?
రోజూ ఎంతసేపు నిద్రపోతే బాడీ ఆరోగ్యంగా ఏజ్ అవుతుంది? కొత్త రీసెర్చ్‌కి ఆసక్తికరమైన సమాధానం ఉంది. దాదాపు 5 లక్షల మందికి సంబంధించిన డేటాను పరిశీలించిన సైంటిస్టులు, 23 బయోలాజికల్ ఏజింగ్ క్లాక్స్‌తో నిద్రకు ఉన్న సంబంధాన్ని చూశారు. రోజుకు 6.4 నుంచి 7.8 గంటలు నిద్రపోయేవారిలో బాడీ ఏజింగ్ లెవెల్స్ తక్కువగా కనిపించాయి. 6 గంటల కంటే తక్కువ లేదా 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారిలో మాత్రం ఏజింగ్ వేగంగా కనిపించింది. అయితే నిద్ర తక్కువగానీ, ఎక్కువగానీ ఉండటమే నేరుగా ఏజింగ్‌కు కారణమని ఈ స్టడీ నిరూపించలేదు.

బ్రెయిన్‌లోనే నొప్పికి ‘బ్రేక్’ ఉందా?
నొప్పి మొదలైతే బ్రెయిన్ దాన్ని ఆపలేదా? సైంటిస్టులు ఇప్పుడు బ్రెయిన్‌లోనే నొప్పిని తగ్గించే ఒక ‘బ్రేక్’ లాంటి వ్యవస్థను గుర్తించారు. ఎలుకలపై చేసిన రీసెర్చ్‌లో, బ్రెయిన్‌లోని ఒక ప్రత్యేక భాగంలోని ము ఓపియాయిడ్ రిసెప్టర్లు నొప్పి సిగ్నల్స్‌ను అదుపులో ఉంచుతున్నట్టు కనిపించింది. ఈ రిసెప్టర్లను తొలగించగానే నొప్పికి సెన్సిటివిటీ పెరిగింది.. తిరిగి పెట్టినప్పుడు తగ్గింది. దీన్ని మనుషుల్లోనూ ఉపయోగించగల చికిత్సగా మార్చేందుకు ఇంకా రీసెర్చ్ అవసరం.

నవులూరు ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు టీడీపీ నాయకులు రూ.15 వేల విలువైన All in one ప్రింటర్, బయోమెట్రిక్ మిషన్‌ను బహూకరించారు. పేద విద్యార్థులు జిరాక్స్ కాపీలు, పరీక్ష పత్రాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని HM చెప్పడంతో స్పందించిన దాతలు ఈ సదుపాయాలను అందించారు.కొల్లి వెంకటరావు, బత్తుల నాగరాజు, తోట శ్రీనుబాబు, రుద్రం శ్రీనివాస రావు, పేరుబోయిన వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సమాజం అండగా నిలిస్తే విద్యార్థులకు మంచి విద్య అందుతుందన్నారు.

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఎంపీజే సాయం..
కాకినాడలో లెప్రసీ కాలనీకి ఓ చేయూత. ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో 55 మంది లెప్రసీ బాధితులకు డ్రెస్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. అమరులు అలీ జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం అందించారు. ఇంకా.. 39 మంది మహిళలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. భోజనంతో పాటు సబ్బు, టూత్‌పేస్ట్, బ్రష్, కొబ్బరి నూనె, షాంపూ, సర్ఫ్ వంటి పరిశుభ్రత కిట్లు కూడా అందజేశారు. <br>జిల్లా అధ్యక్షులు ఎం.డి. హలీం నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. జనరల్ సెక్రటరీ ఎం.డి. ఉస్మాన్ షబ్బీర్, షాకీర్, తదితరులు పాల్గొన్నారు.

ఖేలో ఇండియాతో స్పోర్ట్స్ లో ఫుల్ జోష్
క్రీడాకారులను ప్రోత్సహించి.. తెలుగు వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఖేలో ఇండియా సంవాద్ ప్రారంభమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నందిగామ మండలంలోని సింబాసిస్ క్యాంపస్‌లో ఖేలో ఇండియాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు.<br>ఇంకో స్పెషల్ అట్రాక్షన్ – ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు స్వయంగా హాజరై విద్యార్థుల ఎదుగుదల ఆవశ్యకతను వివరించారు.