బీసీల విద్యపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: ఆర్. కృష్ణయ్య

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైరయ్యారు. ఎన్నికల సమయంలో పేద కులాల విద్యాభివృద్ధికి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ పరిసరాల్లో బీసీ విద్యార్థి, యువజన, నిరుద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘ఫీజులపై మహా తిరుగుబాటు’ ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.



