Latest

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఎంపీజే సాయం..
Local· 27 Aug 2026

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఎంపీజే సాయం..

కాకినాడలో లెప్రసీ కాలనీకి ఓ చేయూత. ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో 55 మంది లెప్రసీ బాధితులకు డ్రెస్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. అమరులు అలీ జ్ఞాపకార్థం ఆర్థిక సహాయం అందించారు. ఇంకా.. 39 మంది మహిళలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్స్ పంపిణీ చేశారు. భోజనంతో పాటు సబ్బు, టూత్‌పేస్ట్, బ్రష్, కొబ్బరి నూనె, షాంపూ, సర్ఫ్ వంటి పరిశుభ్రత కిట్లు కూడా అందజేశారు.
జిల్లా అధ్యక్షులు ఎం.డి. హలీం నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. జనరల్ సెక్రటరీ ఎం.డి. ఉస్మాన్ షబ్బీర్, షాకీర్, తదితరులు పాల్గొన్నారు.

ఖేలో ఇండియాతో స్పోర్ట్స్ లో ఫుల్ జోష్
Local· 27 Aug 2026

ఖేలో ఇండియాతో స్పోర్ట్స్ లో ఫుల్ జోష్

క్రీడాకారులను ప్రోత్సహించి.. తెలుగు వారిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఖేలో ఇండియా సంవాద్ ప్రారంభమైందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నందిగామ మండలంలోని సింబాసిస్ క్యాంపస్‌లో ఖేలో ఇండియాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ మాట్లాడారు.
ఇంకో స్పెషల్ అట్రాక్షన్ – ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు స్వయంగా హాజరై విద్యార్థుల ఎదుగుదల ఆవశ్యకతను వివరించారు.

PRC పెండింగ్ D. A కోసం ధర్నా
Local· 27 Aug 2026

PRC పెండింగ్ D. A కోసం ధర్నా

TGEJAC ఆధ్వర్యంలో పిఆర్సి నీ వెంటనే అమలు చేయాలని 6 పెండింగ్ DA లను వెంటనే ప్రకటించాలని రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు ధర్నా నిర్వహించడం జరిగింది. వందలాది మంది ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. పిఆర్సీ, పెండింగ్ డిెఎ, పేరుకు పోయిన బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

పురుగులంటే అసహ్యం.. 9,000 ఏళ్ల రహస్యమా?
Technology· 27 Aug 2026

పురుగులంటే అసహ్యం.. 9,000 ఏళ్ల రహస్యమా?

మనుషులకు పురుగులు చూస్తేనే అసహ్యం ఎందుకు? దీనికి వేల ఏళ్ల నాటి కారణం ఉండొచ్చని కొత్త రీసెర్చ్ చెబుతోంది. సైంటిస్టులు 745 పురాతన మానవుల పళ్లపై పేరుకున్న టార్టార్ శాంపిల్స్‌ను పరిశీలించగా, ఉత్తర యూరేషియాలో మన పూర్వీకులు పురుగులను చాలా అరుదుగా తిన్నట్టు తేలింది. కానీ నియాండర్తల్స్‌లో పురుగుల DNA ఎక్కువగా కనిపించింది. అంటే వాళ్లు పురుగులను ఎక్కువగా తిని ఉండొచ్చని అంచనా. ఈ ఆహార అలవాట్ల ప్రభావం 9,000 ఏళ్లుగా మన జీన్స్‌లో కొనసాగి ఉండొచ్చని రీసెర్చ్ చెబుతోంది.

600 మంది tribal విద్యార్థులకు... NEET JEE.. Free
Local· 27 Aug 2026

600 మంది tribal విద్యార్థులకు... NEET JEE.. Free

Tribal విద్యార్థుల కలలకు ఓ పెద్ద అడుగు. మెరిట్ exam ద్వారా సెలెక్ట్ చేసిన 600 మంది స్టూడెంట్స్ కి ఫ్రీగా నీట్, IIT-JEEకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ను AP గవర్నమెంటు ఇస్తోంది. ఈ లక్ష్యం కోసమే విశాఖపట్నం మారికవలసలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేసింది. సెలెక్ట్ అయిన వారిలో 300 మంది boys, 300 మంది girls ఉన్నారు. వీరికి ఉచితవిద్యతో పాటు వసతి, ఆహారం, పౌష్టికాహారం, ICT సదుపాయాలు కూడా ఉన్నాయి. ‘‘దీనివల్ల పెద్ద చదువులు చదవాలన్న తమ పిల్లల కల నెరవేరబోతోంద’’ని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!
Local· 27 Aug 2026

చిత్తూరులో 20 వేల మంది.. చెకుముకి సంబరాల హోరు!

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని 8,9,10 తరగతుల నాలుగు లక్షల మంది విద్యార్థులు పాఠశాల స్థాయి పరీక్ష రాశారు. ఇందులో చిత్తూరు జిల్లా స్పెషల్గా నిలిచింది.
జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 20 వేల మంది విద్యార్థులు దిగ్విజయంగా ఈ పరీక్ష పూర్తి చేశారు.
ఈ సందర్భంగా JVV అధ్యక్షులు అరుణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి యుగంధర్ బాబు మాట్లాడుతూ
మండల స్థాయి సంబరాలు సెప్టెంబర్ 11న, జిల్లాస్థాయి 27న, రాష్ట్రస్థాయి నవంబర్ 1,2,3న జరగనున్నాయని చెప్పారు.

ఆ 76 కోట్లతో పలమనేరులో చేయబోతున్నది ఇదే..
Local· 27 Aug 2026

ఆ 76 కోట్లతో పలమనేరులో చేయబోతున్నది ఇదే..

పలమనేరు రూపురేఖల్లో మార్పులు రానున్నా య్. HMA, DMF, APUFIDC, SC/ST subplan నుంచి రూ.76కోట్లు వచ్చాయి. ఈ నిధులతో చేసే పనుల list మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పైప్‌లైన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి పైప్‌లైన్ పునరుద్ధరణ, కొత్త ఈఎల్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణం, ఐదు బోర్ల ఏర్పాటు చేపట్టామన్నారు.FSTP నిర్మాణం తుది దశకు చేరుకుందని, వీధి దీపాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. MLA ఎన్. అమరనాథ్ రెడ్డి ప్రత్యేక చొరవ తోడ్పడిందన్నారు.

తెలుగు భాష నశిస్తే.. ఏం జరుగుతుందంటే?
Local· 27 Aug 2026

తెలుగు భాష నశిస్తే.. ఏం జరుగుతుందంటే?

తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు పి. తులసినాథం నాయుడు కోరారు. గురువారం తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో కళామందిరంలో ముందస్తుగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తులసినాథం నాయుడు మాట్లాడుతూ "తెలుగు భాష నశిస్తే తెలుగు జాతి ఉనికే ప్రమాదం" అని హెచ్చరించారు.
భాష పరిరక్షణకు ప్రభుత్వం సభా సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ వెంటనే దాన్ని నియమించి అమలు చేయాలని నాయుడు డిమాండ్ చేశారు.

గుత్తి కోటలో కుక్కల టెర్రర్..
Local· 27 Aug 2026

గుత్తి కోటలో కుక్కల టెర్రర్..

గుత్తి కోటలో కుక్కల బెడద మామూలుగా లేదు. ఉదయం భాస్కర్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే.. కుక్కలు చుట్టుముట్టి కరిచాయి. ఇది కేవలం అతని కథ కాదు – ఇక్కడి పిల్లలు, వృద్ధులు రోజూ ఇదే భయంతో తిరగాల్సి వస్తోంది. ‘‘ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా.. ఎవరు పట్టించుకోవడం లేదు. కుక్కలు ఇక్కడి నివాసితులకు ఓ శాపంలా మారాయి. అధికారులకు పని లేదా? ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? ప్రాణ భయంతో బతికే పరిస్థితి ఎంతకాలం? ఈ భయానికి ఫుల్ స్టాప్ పెట్టాలి’’ అని ప్రజలు కోరుతున్నారు.

నగదు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
Local· 27 Aug 2026

నగదు చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

డీసీఎం వాహనంలో నగదు బ్యాగ్‌ను కోసి రూ.1.50 లక్షలు చోరీ చేసి పరారైన హెల్పర్‌ యాద గణేష్‌(25)ను గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.20 వేల నగదు, శామ్‌సంగ్‌ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. జాన్‌పాక్‌ ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌ వద్ద ఈ నెల 23న సేల్స్‌మ్యాన్‌ భాస్కర్‌ డీజిల్‌ పోయించేందుకు దిగిన సమయంలో నిందితుడు బ్యాగ్‌ను కోసి నగదు తీసుకుని పరారయ్యాడు. ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

CPR శిక్షణతో ప్రాణరక్షణ.. APCRDA ఉద్యోగుల్లో అవగాహన!
Local· 27 Aug 2026

CPR శిక్షణతో ప్రాణరక్షణ.. APCRDA ఉద్యోగుల్లో అవగాహన!

గుండె ఆగిపోతే.. ఆ సమయంలో మీ చేతిలో ఒకరి ప్రాణం ఉంటుంది. అందుకే అమరావతి రాయపూడి ప్రాజెక్ట్ కార్యాలయంలో APCRDA ఉద్యోగులకు CPR శిక్షణ ఇచ్చారు. AIIMS వైద్య నిపుణుల ఆధ్వర్యంలో సడన్ కార్డియాక్ అరెస్ట్ సమయంలో తక్షణ స్పందన, CPR చేసే విధానాలను ప్రత్యక్షంగా వివరించారు. ఉద్యోగులతో హ్యాండ్స్-ఆన్ ప్రాక్టీస్ కూడా చేయించారు. సుమారు 110 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.వైద్య సహాయం అందేలోపు సరైన CPR చేయగలిగితే ప్రాణాలు కాపాడొచ్చని నిపుణులు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నైపుణ్యమని అన్నారు.

బొమ్మరంలో రీవెరిఫికేషన్ షురూ...
Local· 27 Aug 2026

బొమ్మరంలో రీవెరిఫికేషన్ షురూ...

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం గ్రామంలో రీ వెరిఫికేన్ స్టార్ట్ అయ్యింది. ఈ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఎస్ ఐ ఆర్ ద్వారా సేకరించిన జాబితాను విడుదల చేశారు. అలాగే తిరస్కరించిన వచ్చిన ఓటర్ జాబితాను రీ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని మేజర్ సమస్యలపై మొదటిగా దృష్టి సాధించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్టెల రమేష్, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఏ ఒక్కరూ మిస్ అవ్వొద్దు... MLA ఠాకూర్
Local· 27 Aug 2026

ఏ ఒక్కరూ మిస్ అవ్వొద్దు... MLA ఠాకూర్

‘‘ అర్హత ఉన్న వాళ్లెవ్వరూ ఓటరు లిస్టులోంచి మిస్ కొవొద్ద’’ని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గాం గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతూ – SIR ఫేజ్-2లో భాగంగా ఓటరు వివరాల పరిశీలనకు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, తప్పులు ఉంటే సరిచేసుకునేలా ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

ఆ టార్గెట్స్ complete చేయండి.. కలెక్టర్ ఆదేశం
Local· 27 Aug 2026

ఆ టార్గెట్స్ complete చేయండి.. కలెక్టర్ ఆదేశం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వన మహోత్సవ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఆమె స్వయంగా మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్,DRO దాసరి వేణు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, చెరువు గట్లు, రహదారుల పక్కన మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పచ్చదనం కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. DRDO, DPO కూడా పాల్గొన్నారు.

మొక్కలు DNAని దొంగిలిస్తాయా? 🧬
Technology· 27 Aug 2026

మొక్కలు DNAని దొంగిలిస్తాయా? 🧬

ఒక మొక్క మరో మొక్క దగ్గర నుంచి DNA తీసుకుని తనలో వాడుకుంటుందా? వినడానికి వింతగా ఉన్నా.. పరాన్నజీవి మొక్కల్లో ఇలాంటి విషయం నిజంగానే కనిపిస్తోంది. ఇవి మరో మొక్కకు అతుక్కుని నీరు, పోషకాలు తీసుకునే సమయంలో.. కొన్ని జీన్స్ కూడా తమలోకి తీసుకుంటున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఆశ్చర్యమేంటంటే, ఆ జీన్స్‌లో కొన్ని మొక్కలో అలాగే ఉండిపోవడమే కాదు, అక్కడ పనిచేస్తున్నట్టు కూడా ఎవిడెన్స్ కనిపించింది. అంటే మొక్కలు కేవలం నీరు, పోషకాలనే కాదు.. ఒకదానికొకటి DNA కూడా పంచుకునే అవకాశం ఉందన్నమాట.

కలెక్టర్‌కు జర్నలిస్టుల పిటిషన్..
Local· 27 Aug 2026

కలెక్టర్‌కు జర్నలిస్టుల పిటిషన్..

నాగర్‌కర్నూల్‌లో జర్నలిస్టులు తమ సమస్యలతో కలెక్టర్ ముందుకు వెళ్లారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు.

అది మిస్ కావొద్దు... MLA
Local· 27 Aug 2026

అది మిస్ కావొద్దు... MLA

‘‘SIR తో లక్షల ఓట్లు గల్లంతై పోతున్నాయ్.. మన దగ్గర అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దు’’ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. భువనగిరిలో SIR (ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ) కార్యక్రమంపై BLA, BLOలతో MLA రివ్యూ మీటింగు జరిపారు. ప్రతి బూత్‌కు సంబంధించిన ఓటర్ల జాబితా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో తప్పకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, BLA, BLOలు పాల్గొన్నారు.

బ్యాంకుల్లో డబ్బు భారీగా పెరిగిందా?
National· 27 Aug 2026

బ్యాంకుల్లో డబ్బు భారీగా పెరిగిందా?

బ్యాంకుల్లో డబ్బు ఒక్కసారిగా ఎక్కువైపోయింది.. ఇప్పుడు ఈ అదనపు డబ్బును ఏం చేయాలన్నదే RBI ముందున్న ప్రశ్న. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు ₹3.4 లక్షల కోట్ల అదనపు డబ్బు ఉందని అంచనా. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉన్న భారతీయులు బ్యాంకుల్లో పెట్టిన డాలర్ డిపాజిట్ల ప్రభావం కూడా దీనికి ఒక కారణం. అందుకే RBI ఈ అదనపు డబ్బును క్రమంగా వెనక్కి తీసుకునే మార్గాలపై ఫోకస్ పెట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఆ ఎరువులపై రైతులకు అవగాహన.. కలెక్టర్ ఆదేశం
Local· 27 Aug 2026

ఆ ఎరువులపై రైతులకు అవగాహన.. కలెక్టర్ ఆదేశం

నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు – ‘‘నానో యూరియా, నానో డీఏపీ.. ఇవి రైతుల కోసం కొత్త టెక్ ఎరువులు. వీటిని వాడాలి. రైతులకు చెప్పాలి.’’ అని అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ఆఫీసర్లందరూ ఫీల్డులోకి వెళ్లిపోయి ఈ విషయాన్ని రైతులకు చెప్పాలన్నారు. రైతు బీమా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ పై కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న Child Protestor ఆదిత్య
Current Affairs· 27 Aug 2026

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న Child Protestor ఆదిత్య

బిహార్‌లో BPSC పరీక్షలపై విద్యార్థులు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న 6 ఏళ్ల ఆదిత్య కుమార్‌ను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లిన వీడియో SMలో వైరల్ అయింది. సీఎం రాజీనామా డిమాండ్ చేస్తూ, పోలీసు చర్యలపై ప్రశ్నిస్తూ మాట్లాడిన ఆదిత్యను పోలీసులు దూరంగా తీసుకువెళ్లారు. అతణ్ని అరెస్ట్ చేయలేదని, పక్కకు తీసుకెళ్లామని వాళ్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆదిత్య Child Protestorగా మారాడు. ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న అతని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న AP ప్రజలు
Current Affairs· 27 Aug 2026

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న AP ప్రజలు

నేపాల్‌ వరదల్లో AP నుంచి వెళ్లిన కొంతమంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఏపీ ప్రభుత్వ అధికారులు వీరి వివరాలు భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గల్లంతైన లేదా చివరిసారిగా కనిపించినవారు..చొప్పరపు రమేశ్‌బాబు, అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర ఆనాఘ, బాలసుబ్రహ్మణ్యం, శశికుమార్ అట్లూరి, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ. వీళ్లంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. చిక్కుకున్నవారిలో భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు, అపర్ణ కాకాని సురక్షితంగా ఉన్నారు.