సర్కార్‌కు ఉద్యోగుల అల్టిమేటం.. ఇక పోరుబాటే

TG: తమ సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ నిర్వహించి నగరాన్ని నిర్బంధిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన ఉద్యోగుల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్ల సమస్యలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేపడతామని ప్రకటించారు.



