Latest

 నీట్2026 రద్దయిందని నిరాశతో విద్యార్ధిని ఆత్మహత్య
Education· 24 May 2026

నీట్2026 రద్దయిందని నిరాశతో విద్యార్ధిని ఆత్మహత్య

కర్ణాటకలోని కలబురగి జిల్లాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని భాగ్యశ్రీ, నీట్ పరీక్ష రాసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పీయూసీ (PUC) బోర్డు పరీక్షల్లో 92 శాతం మార్కులు వచ్చాయి. మే 2న ఆమె నీట్ పరీక్షకు హాజరైంది. తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు, దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల నీట్-యుజి 2026 పరీక్ష రద్దు కావడం వల్ల దేశంలో ఇలాంటి విద్యార్థుల ఆత్మహత్యలు మరికొన్ని కూడా వెలుగులోకి వచ్చాయి.

 ఎర్రకోట కారు పేలుడు కేసులో కీలక ఆధారాలు.. నిందితుడు ఇలా చేశాడు!
Crime· 24 May 2026

ఎర్రకోట కారు పేలుడు కేసులో కీలక ఆధారాలు.. నిందితుడు ఇలా చేశాడు!

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో గత ఏడాది నవంబర్ 10న జరిగిన కారు పేలుడు కేసులో నిందితుడు బాంబుల తయారీ కోసం చాట్‌జీపీటీ (ChatGPT), యూట్యూబ్‌లను ఉపయోగించాడని NIA తెలిపింది.. అల్-ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఈ నిందితుడు రాకెట్ ఐఈడీలను తయారు చేసి జమ్మూ కాశ్మీర్ అడవులలో పరీక్షించాడు. మే 14న ఎన్ఐఏ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కోర్టులో దాఖలు చేసిన 7,500 పేజీల చార్జ్‌షీట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.

వైట్ హౌస్ కాల్పులు .. నేనే జీసస్ నని చెప్పుకున్న నిందితుడు
World· 24 May 2026

వైట్ హౌస్ కాల్పులు .. నేనే జీసస్ నని చెప్పుకున్న నిందితుడు

వైట్‌హౌస్ సెక్యూరిటీ ఎదురు కాల్పుల్లో మరణించిన నిందితుడిని నసీర్ బెస్ట్ గా భద్రతా బలగాలు గుర్తించాయి. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నేనే జీసస్ ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. నసీర్ బెస్ట్‌కు పాత క్రిమినల్ రికార్డు ఉంది. ఇతడు జూలై 2025లోనే వైట్‌హౌస్ సెక్యూరిటీ జోన్‌లోకి అక్రమంగా దూసుకెళ్లడానికి ప్రయత్నించి సీక్రెట్ సర్వీస్ చేతికి చిక్కి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కోర్టు వైట్ హౌస్ పరిసరాలకి రాకూడదంటూ 'స్టే అవే' ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు దానిని ఉల్లంఘించి తుపాకీతో వచ్చి కాల్పులు జరిపాడు. భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు.

వైట్‌హౌస్ వద్ద మళ్లీ కాల్పుల కలకలం.. ట్రంప్ సేఫ్
World· 24 May 2026

వైట్‌హౌస్ వద్ద మళ్లీ కాల్పుల కలకలం.. ట్రంప్ సేఫ్

అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఒక వ్యక్తి వైట్ హౌస్ లోకి దూరడానికి ప్రయత్నించి భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వైట్ హౌస్ ని పూర్తిగా మూసివేశాయి. ఎదురు కాల్పుల్లో ఆ నిందితుడు మరణించాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ట్రంప్ ను టార్గెట్ గా కాల్పులు జరపడం ఇది రెండోసారి

తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి
News· 23 May 2026

తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి

శనివారం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంట పాటు గాలి, వాన రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

చైనా బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు-82 మంది మృతి
World· 23 May 2026

చైనా బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు-82 మంది మృతి

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్, క్విన్యువాన్ కౌంటీలోని లియుషెన్యు బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పేలుడులో 82 మంది మరణించారు. మరో తొమ్మిది మంది భూగర్భంలో చిక్కుకుపోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్పందించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలని , గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పని ప్రదేశాలలో భద్రతను పటిష్టం చేయాలని అధికారులను ఆయన హెచ్చరించారు.

 యాంగ్జైటీ పెరిగితే బ్లీడింగ్  జరగొచ్చంటున్న పరిశోధకులు
Health· 23 May 2026

యాంగ్జైటీ పెరిగితే బ్లీడింగ్ జరగొచ్చంటున్న పరిశోధకులు

ఆందోళన ఎక్కువ కాలం కొనసాగితే అది మానసిక ఆరోగ్య సమస్యగా మారుతుందని, ఇది భయం, ఒత్తిడి కంటే భిన్నమైనదని అంటున్నారు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిపుణులు., పరిశోధనల ప్రకారం, ఆందోళన తీవ్రమైతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అరుదైన సందర్భాల్లో ఇది తాత్కాలిక రక్తస్రావానికి దారితీయడమే కాకుండా, ముక్కు నుండి రక్తం కారడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇప్పటికే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారిలో ఇది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి ఏ విషయమైనా అతిగా ఆలోచించి ఆందోళన చెందవద్దు అంటున్నారు శాస్త్ర వేత్తలు.

ప్లీజ్ నన్ను  అలా పిలవొద్దు.. నియంత అన్నా ఫర్వాలేదు అంటున్న ట్రంప్
World· 23 May 2026

ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. నియంత అన్నా ఫర్వాలేదు అంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై వచ్చే విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ... తనను "డంబ్" (తెలివితక్కువవాడు) అని పిలవడం ఇష్టంలేని అవమానమని అన్నారు. విమర్శకులను తప్పుగా నిరూపించడానికి ఒక పరీక్షను సూచించాల్సిందిగా తన వైద్యుడిని కూడా కోరినట్లు చెప్పారు. "నన్ను ఒక తెలివైన క్రూర నియంత (brilliant tyrant dictator) అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు, కానీ డంబ్ అని మాత్రం అనొద్దు" అని ట్రంప్ పేర్కొన్నారు. తన మానసిక సామర్థ్యంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జాబ్స్ లేవు కానీ పిల్లల్ని కనాలా? చంద్రబాబుపై బోత్సా ఫైర్!▶
Politics· 23 May 2026

జాబ్స్ లేవు కానీ పిల్లల్ని కనాలా? చంద్రబాబుపై బోత్సా ఫైర్!

చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్‌పై YCP లీడర్ బోత్సా సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉన్నవాళ్లకే ఉద్యోగాలు లేకపోతే.. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చంద్రబాబు చెప్పడం ఏంటని క్వశ్చన్ చేశాడు. అంతేకాదు, చంద్రబాబు మీలాగా 2 ఎకరాల నుంచి 20 వేల కోట్ల ఆస్తులు సంపాదించే మంత్రం అందరికీ తెలియదు కదా, అంటూ బోత్సా ఘాటుగా విమర్శించారు. ప్రెసెంట్ ఈ పొలిటికల్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సీసీటీవీ వీడియో వైరల్ అవ్వడంతో మహిళను వేధించిన అతను అరెస్ట్!▶
Crime· 23 May 2026

సీసీటీవీ వీడియో వైరల్ అవ్వడంతో మహిళను వేధించిన అతను అరెస్ట్!

హైదరాబాద్ ఆల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసును నార్సింగి పోలీసులు సాల్వ్ చేశారు. చిన్న పిల్లను ఎత్తుకుని వెళ్తున్న ఒక మహిళను ఇతను హర్రాస్ చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సీసీటీవీ వీడియో ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉమెన్ సేఫ్టీ విషయంలో పోలీసులు తీసుకున్న ఈ క్విక్ యాక్షన్‌ను అంతా అప్రిషియేట్ చేస్తున్నారు.

'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్!▶
Entertainment· 23 May 2026

'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్!

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి ఒక అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను భోపాల్‌లో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి హీరో రామ్ చరణ్‌తో పాటు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ కూడా అటెండ్ కాబోతున్నారు. నార్త్ లో జరగబోయే ఈ భారీ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ప్రెసెంట్ ఫుల్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ను కలిసిన క్రికెటర్..
Entertainment· 23 May 2026

అల్లు అర్జున్‌ను కలిసిన క్రికెటర్..

ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఈరోజు అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ మీటింగ్ తర్వాత బన్నీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. టాలెంటెడ్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని కలవడం చాలా హ్యాపీగా ఉందంటూ, అంతేకాదు, అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ ఒక స్పెషల్ సైన్డ్ జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చారని, అందుకు థాంక్స్ చెబుతూ అతని ఫ్యూచర్‌కి బెస్ట్ విషెస్ చెప్పిన బన్నీ.

కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు
News· 23 May 2026

కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు

తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ నాయకుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తాను రాజకీయపార్టీ పెట్టబోతున్నా అంటూ కొందరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వల్ల తాను ఇబ్బంది పడినట్టుగా ఇతరులు పడవద్దని కొంతమంది న్యాయవాదులతో కలిపి ఓ ఫోరమ్ ఏర్పాటు చేశానని చెప్పారు. అవసరమైన ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చేందుకే తాను 'తెలుగువీర లేవరా' అనే ఫోరమ్ ప్రారంభించానని అన్నారు. అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ఫోరమ్ ఏర్పాటు చేశానని చెప్పారు.

పవన్ పక్కన బండ్ల గణేష్.. దేవుడు-భక్తుడి మధ్యలో చిరంజీవి!▶
Entertainment· 23 May 2026

పవన్ పక్కన బండ్ల గణేష్.. దేవుడు-భక్తుడి మధ్యలో చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ పూజా ఈవెంట్‌లో ఒక ఫన్నీ సీన్ జరిగింది. ఈ వేడుకకు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అటెండ్ అయ్యారు. అయితే వీరిద్దరూ ఫోటోలు దిగుతుండగా చిరంజీవిని కూడా ఫోటో దిగమని invite చేయగా, చిరంజీవి సరదాగా జోక్ చేశారు. "దేవుడికి, భక్తుడికి మధ్యలో నేనెందుకు అంబికా అగర్బత్తి లాగ" అంటూ కామిడీ చేశాడు. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

 రాజస్థాన్లో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కుక్కను చంపిన వైనం
Viral· 23 May 2026

రాజస్థాన్లో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కుక్కను చంపిన వైనం

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రాజ్‌గఢ్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి గోడ దాటి లోపలికి వచ్చిన చిరుత, గొలుసుతో కట్టిన పెంపుడు కుక్కపై దాడి చేసింది. సుమారు 16 నిమిషాల పాటు జరిగిన పోరులో కుక్కను చంపి, శరీరాన్ని నోట పట్టుకుని అడవి వైపు పారిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. చిరుత ఇంట్లోకి రావడం పట్ల స్థానికులు భయపడుతున్నారు.

విరాట్ కోహ్లీ బిహేవియర్ పై క్రికెట్ ఫాన్స్ ఫైర్!▶
Politics· 23 May 2026

విరాట్ కోహ్లీ బిహేవియర్ పై క్రికెట్ ఫాన్స్ ఫైర్!

నిన్న జరిగిన SRH vs RCB మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ బిహేవియర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ క్లోస్ అయిన తర్వాత తబ్రైజ్ షంసీ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి చేయి ఇవ్వగా. కోహ్లీ అతని వైపు అసలు చూడకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా డిసపాయింట్ అవుతున్నారు. గ్రౌండ్ లో ఇలాంటి బిహేవియర్ అస్సలు యాక్సెప్టబుల్ కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజ్యసభలో తగ్గనున్న ఎన్డీఏ బలం--విజయ్ కు ఒక సీటు
Politics· 23 May 2026

రాజ్యసభలో తగ్గనున్న ఎన్డీఏ బలం--విజయ్ కు ఒక సీటు

రాజ్యసభలోని 26 స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ బలం 17కి తగ్గే అవకాశం ఉండగా, కాంగ్రెస్ సీట్లు 5కి పెరగనున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ, ఏపీలో టీడీపీ మెజారిటీ స్థానాలు గెలవనున్నాయి. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక స్థానంతో రాజ్యసభలోకి ఎంట్రీ ఇస్తుండగా, జార్ఖండ్‌లో జేఎమ్ఎమ్-కాంగ్రెస్ కూటమి రెండు స్థానాలను కైవసం చేసుకోనుంది. పోలింగ్ జరిగే 26 సీట్లలో ఎన్డీఏకు18, కాంగ్రెస్ కు 4, వైసీపీకి 3, జెఎంఎంకు ఒక స్థానం ఉన్నాయి.

వైఫ్ చనిపోయిన రెండు రోజులకే హస్బండ్ సూసైడ్!
Crime· 23 May 2026

వైఫ్ చనిపోయిన రెండు రోజులకే హస్బండ్ సూసైడ్!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక shocking ఇన్సిడెంట్ జరిగింది. సిద్ధార్థ్, మేఘన అనే కపుల్‌కి మ్యారేజ్ అయిన వన్ మంత్ లోపే ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత వీరు ఓన్లీ 5 డేస్ మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిన మేఘన అక్కడ ఉరి వేసుకుని చనిపోయింది. భార్య డెత్ తో డిప్రెషన్‌లోకి వెళ్లిన భర్త సిద్ధార్థ్. రెండు రోజులకే బాత్‌రూమ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. ఈ చావుల వెనుక ఉన్న రీజన్స్ ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

లిటిల్ ఫ్యాన్‌కి సారీ చెప్పిన రోహిత్ శర్మ!▶
Politics· 23 May 2026

లిటిల్ ఫ్యాన్‌కి సారీ చెప్పిన రోహిత్ శర్మ!

కోల్‌కతాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ హోటల్ దగ్గర రోహిత్ శర్మను చూడటానికి ఒక చిన్న పాప వెయిట్ చేసింది. అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో రోహిత్ ఆమెను గమనించకుండానే వెళ్ళిపోయారు. దీంతో ఆ చిన్నారి ఏడవడం స్టార్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రోహిత్ శర్మ స్పందించారు. ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఆ పాపకి సారీ చెప్పారు. నెక్స్ట్ టైమ్ కోల్‌కతా వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను కలుస్తానని ప్రామిస్ చేశారు.

 వందే భారత్ స్లీపర్ పైకంటెంట్ క్రియేటర్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స
Viral· 23 May 2026

వందే భారత్ స్లీపర్ పైకంటెంట్ క్రియేటర్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స

వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించిన ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ రుచి త్రివేది అనుభవం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త జనరేషన్ రైలు లుక్, డిజైన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఆమె తెగ పొగిడేసింది. ముఖ్యంగా సెకండ్ ఏసీ కోచ్‌లోని మోడ్రన్ కర్టెన్లు, లైటింగ్, నీట్ బెడ్డింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయని మెచ్చుకుంది. ప్రభుత్వం ఇంత సూపర్ ట్రైన్ ఇచ్చింది కాబట్టి, దీన్ని క్లీన్‌గా ఉంచడం మన బాధ్యత అంటూ సివిక్ సెన్స్ గురించి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కామాఖ్య- హౌరా వందే భారత్ స్లీపర్ సర్వీస్ లో ఆమె ప్రయాణించారు.

బొద్దింకలు తల లేకపోయినా బతికేస్తాయి!
News· 23 May 2026

బొద్దింకలు తల లేకపోయినా బతికేస్తాయి!

బొద్దింకలు డైనోసర్ల కంటే ముందే అంటే 30 కోట్ల ఇయర్స్ నుంచే భూమిపై ఉన్నాయి. వీటికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు ఏంటంటే.. బొద్దింకల హెడ్ కట్ అయినా కూడా అవి కొన్ని డేస్ లైవ్‌గా ఉండగలవు. ఎందుకంటే అవి బాడీపై ఉండే చిన్న హోల్స్ ద్వారా బ్రీతింగ్ తీసుకుంటాయి. అంతేకాదు, ఇవి 40 మినిట్స్ వరకు వాటర్ లో బ్రీతింగ్ ఆపగలవు. గంటకు 5KM స్పీడ్ తో రన్ చేయగలవు.