Latest

బృందావనంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ!▶
Viral· 2 Jun 2026

బృందావనంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ!

టాలెంటెడ్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బృందావనంలో సందడి చేశారు. అక్కడి ప్రెమానంద్ జీ మహారాజ్ బాబాను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

'జులై 2న మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం'
Politics· 2 Jun 2026

'జులై 2న మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం'

TG: మిలియన్ మార్చ్‌ను తలపించేలా భూపోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన(TRS) స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన తెలంగాణ ఫార్మెషన్ డే సెలబ్రేషన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఆమె స్మరించుకున్నారు. జులై 2న ఉప్పల్ భగాయత్‌లో పెద్దఎత్తున భూపోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటంలో అన్నివర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం: మాజీ మంత్రి వేణు
Politics· 2 Jun 2026

రెండేళ్లలో ప్రజలకు చేసింది శూన్యం: మాజీ మంత్రి వేణు

AP: రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని వైసీపీ తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వేణు విమర్శించారు. వైసీపీ రూపొందించిన 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమ పోస్టర్‌ను జిల్లా వైసీపీ ఆఫీస్‌లో మంగళవారం ఆవిష్కరించారు. బూటకపు హామీలతో నమ్మించి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఇది వెన్నుపోటుకు రెండేళ్లు అని ఫైర్ అయ్యారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో షాక్!
Politics· 2 Jun 2026

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో షాక్!

జనసేన పార్టీకి హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. పార్టీ మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ జనసేన లీడర్స్ హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఆల్రెడీ ఈ మీటింగ్‌కు పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ రిజెక్ట్ చేయడంతో, జనసేన కోర్టును అప్రోచ్ అయింది. కానీ అక్కడ కూడా లైన్ క్లియర్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఏం జరగబోతుందనేది సస్పెన్స్‌గా మారింది. పవన్ ప్రెస్ మీట్ ట్వీట్ తర్వాత జరిగిన ఈ ఇష్యూతో తెలంగాణ పాలిటిక్స్ లో ఫుల్ డిస్కషన్ నడుస్తుంది

ఆవులా గడ్డి తింటూ షాకిచ్చిన వ్యక్తి!▶
Politics· 2 Jun 2026

ఆవులా గడ్డి తింటూ షాకిచ్చిన వ్యక్తి!

సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఆవులకు వేసే తవుడు, గడ్డిని తింటూ కనిపించాడు. ఏదో మూఢనమ్మకం లేదా వింత ఆచారం కోసమే ఆ పర్సన్ ఇలా చేస్తున్నాడని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంకొందరు "ఆవులా మారాలని ట్రై చేస్తున్నాడా ఏంటి?" అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

ఎండ దెబ్బకు స్పీచ్ ఆపేసిన CM రేవంత్ రెడ్డి!▶
Politics· 2 Jun 2026

ఎండ దెబ్బకు స్పీచ్ ఆపేసిన CM రేవంత్ రెడ్డి!

తెలంగాణ ఫార్మేషన్ డే ప్రోగ్రామ్‌లో CM రేవంత్ రెడ్డి, ఎండ విపరీతంగా ఉండడంతో ఆయన తన స్పీచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, జనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెపుతున్నారు. CM లెవెల్ లీడర్ ఇలా ఎండ వల్ల స్పీచ్ ఆపేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.

స్ట్రీట్స్ లో ఆటో నడిపిన CM వైఫ్!▶
News· 2 Jun 2026

స్ట్రీట్స్ లో ఆటో నడిపిన CM వైఫ్!

మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ వైఫ్ అమృత ఫడణవీస్ ముంబై రోడ్లపై అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.రీసెంట్ గా సైకిల్ తొక్కి న్యూస్ లో వైరల్ అయిన ఆమె, మళ్ళీ ఇప్పుడు ముంబై వీధుల్లో స్వయంగా ఆటో నడిపి అందరినీ షాక్ చేసింది. CM వైఫ్ అయి ఉండి కూడా ఇలా నార్మల్ పీపుల్‌లా ఆటో డ్రైవ్ చేయడంతో అక్కడి జనాలు షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మినిస్టర్ వివేక్
TG· 2 Jun 2026

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మినిస్టర్ వివేక్

TG: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్‌కు మినిస్టర్ అటెండయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నేషనల్ ఫ్లాగ్‌ను ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం, ఉమెన్ ఎంపవర్‌మెంట్, జాబ్ ఆపర్ట్యూనిటీస్, విద్య, వైద్యం, మౌలికసదుపాయాల అభివృద్ధికి స్టేట్ గవర్నమెంట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్
TG· 2 Jun 2026

నిరుద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్

TG: తెలంగాణ ఫార్మెషన్ డే సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 280 పోస్టులతో మూడు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినట్లు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం అనౌన్స్ చేశారు. ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఇన్విరాన్‌మెంట్ ఇంజనీర్లు 9, రోడ్డు భవనాల డిపార్ట్‌మెంట్‌లో ఏఈఈ సివిల్ 222, ఎలక్ట్రికల్ 49 పోస్టులు ఉన్నాయన్నారు. గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్‌కు ఇకపై ప్రతినెలా రెండుమూడు ఉద్యోగ ప్రకటనలు చేస్తామని చెప్పారు. మరోవైపు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నోటిఫికేషన్ వేయకపోతే గవర్నమెంట్‌పై తిరగబడతామని నిరుద్యోగ జేఏసీ, పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ పోలీస్‌లకు పవన్ కళ్యాణ్ ట్వీట్.. 'లెట్స్ సీ'!
Politics· 2 Jun 2026

తెలంగాణ పోలీస్‌లకు పవన్ కళ్యాణ్ ట్వీట్.. 'లెట్స్ సీ'!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. ఈరోజు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో జనసేన లీడర్స్‌తో కలిసి ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నా అంటూ. "లెట్స్ సీ" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.

చంద్రబాబుకు చదువు లేదు.. తెలుగు రాదు!▶
Politics· 2 Jun 2026

చంద్రబాబుకు చదువు లేదు.. తెలుగు రాదు!

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి CM చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు అస్సలు చదువు లేదని, తెలుగు కూడా కరెక్ట్‌గా మాట్లాడడం రాదని అన్నారు. ఆయనకు ఇంగ్లీషు రాదని, హిందీ మాట్లాడి ఇదే గ్రీక్ లాంగ్వేజ్ అన్నా నమ్ముతడని సెటైర్లు వేశారు. బాబు వెనుక ఉన్న మీడియా అంతా ఒక పెద్ద మాఫియా అని, దొంగ భూములు అమ్ముకున్న డబ్బుతోనే ఫేక్ మీడియా, ఫేక్ న్యూస్ పేపర్లు రన్ చేస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి
Local· 2 Jun 2026

రోడ్ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి

TG: సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద భారీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఇద్దరు చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించారు. లారీ కింద కారు ఇరుక్కుపోవడంతో అతికష్టం మీద వారిని బయటకు తీశారు. మరో ఇద్దరికి గాయాలు కావడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, క్షతగాత్రులు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు.

విగ్రహాలు కూలగొడితే సీఎం అవుతారా : విష్ణువర్థన్ రెడ్డి
Politics· 2 Jun 2026

విగ్రహాలు కూలగొడితే సీఎం అవుతారా : విష్ణువర్థన్ రెడ్డి

AP: తెలంగాణ రక్షణ సేన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్లపై చేసిన కామెంట్లపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. విగ్రహాలు కూలగొట్టాలని మాట్లాడితే సీఎం అవుతారా కవిత గారు?, ఇంకెన్నాళ్లు మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తారని ఆయన నిలదీశారు. గతంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన కామెంట్లపై కేసులు పెట్టి జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలు ధ్వంసం చేసి ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామని కవిత సన్సెషనల్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్
TG· 2 Jun 2026

ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్

TG: ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 92మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. చాలాకాలంగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల ప్రవర్తన, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, జైలులో వారి ప్రవర్తనా తీరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖైదీలను విడుదల చేయనున్నారు. 86మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి 12ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మానవతా దృక్పథంతో స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్‌ పట్ల ఖైదీల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్..!
World· 2 Jun 2026

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్..!

అమెరికాలో అక్రమంగా ఉంటూ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరిజోనా స్టేట్ లో చేపట్టిన ఆపరేషన్ చెక్‌మేట్ లో మొత్తం 52 మంది పట్టుబడగా, వారిలో 36 మంది హెవీ ట్రక్కులు నడుపుతున్నట్లు గుర్తించారు. వీరిలో 30 మంది భారతీయులే. కొందరి వద్ద గడువు ముగిసిన వర్క్ పర్మిట్లు ఉండగా, మరికొందరి వద్ద సరైన లైసెన్సులు కూడా లేవని అధికారులు తెలిపారు. అరెస్టైన వారందరినీ డిపోర్టేషన్ ప్రక్రియకు పంపనున్నట్లు వెల్లడించారు.

ఫైర్ యాక్సిడెంట్‌లో ఇద్దరు సజీవదహనం
AP· 2 Jun 2026

ఫైర్ యాక్సిడెంట్‌లో ఇద్దరు సజీవదహనం

TG: ఏలూరు జిల్లా వేలేరుపాడులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు నిద్రలోనే సజీవదహనమయ్యారు. వలగాని సావిత్రి (60), పూలమ్మ (65) నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఇద్దరూ మృతి చెందారు. మంటల ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పెద్దఎత్తున ఎగిసిపడడంతో పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా కాలిబూడిదైంది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన పూలమ్మ తన చెల్లిని చూసేందుకు ఏలూరు వచ్చినట్లు సమాచారం.

తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకల్లో షాకింగ్ ఇన్సిడెంట్
Local· 2 Jun 2026

తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకల్లో షాకింగ్ ఇన్సిడెంట్

TG: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేట టౌన్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్ మాత్రం షాకింగ్‌కు గురిచేసింది. సిద్దిపేట విద్యుత్ సహాయ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్‌లో అధికారులు జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని పాత తెలంగాణ తల్లి ఫొటో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండేళ్లు దాటినా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన విషయం విద్యుత్ అధికారులకు తెలియకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రుతు పవనాలు మళ్లీ వాయిదా
General· 2 Jun 2026

రుతు పవనాలు మళ్లీ వాయిదా

దేశంలో ఎండలు మండిపోతూ ఉండడంతో అందరూ నైరుతి ఎప్పుడెప్పుడు వస్తుందాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వీటి రాక ఇంకా ఆలస్యం కానుంది. జూన్ మొదటి వారంలో వస్తాయో లేదోనన్న సందేహాలున్నాయి. కేరళలో నైరుతి బలంగా నిలబడాలంటే దానికి అవసరమైన గాలులు జూన్ 6 తర్వాతే వస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు IMD ఈ ఏడాది వర్షపాతం అంచనాను 92% నుంచి 90%కి తగ్గించింది. ఎల్‌నినో ప్రభావం కూడా ఈ సారి ఆందోళన పుట్టిస్తోంది.

నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ ▶
TG· 2 Jun 2026

నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెలలో TGPSC ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, విద్యాశాఖలలో పోస్టుల భర్తీకి నోటీఫికేషన్లు జారీ చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ నిరంతం కొనసాగుతుందని సీఎం చెప్పారు.

జై తెలంగాణ జైజై తెలంగాణ ▶
TG· 2 Jun 2026

జై తెలంగాణ జైజై తెలంగాణ

ఇవాళ తెలంగాణ ఆవిర్భావదినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు, అభివృద్ధి అన్నీ కలిపి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో మీరూ చూసేయండి

నేను లేకపోతే నీకు జైలే గతి : నెతన్యాహూపై ట్రంప్ బూతులు
World· 2 Jun 2026

నేను లేకపోతే నీకు జైలే గతి : నెతన్యాహూపై ట్రంప్ బూతులు

అమెరికా అధ్యక్షుడు Donald Trump, ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahuపై బూతుపురాణంలంకిచినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. లెబనాన్ దాడుల విషయంలో నెతన్యాహూ వైఖరిని తప్పుపట్టిన ట్రంప్ ఫోన్ కాల్ లోనే "నువ్వు F***ing Crazy.. నేను లేకపోతే ఎప్పుడో జైల్లో ఉండేవాడివి" అంటూ విరుచుకుపడ్డారు. ఇరాన్ తో శాంతి చర్చలకి లెబనాన్ పై దాడులు అడ్డంకిగా మారడంతో ట్రంప్ సహనం కోల్పోయారు. అసభ్య పదజాలంతో దూషించారని Axios రిపోర్ట్ వెల్లడించింది. ఈ కాల్ తర్వాత బీరూట్‌పై దాడులను ఇజ్రాయెల్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.