తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకల్లో షాకింగ్ ఇన్సిడెంట్

TG: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫార్మెషన్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేట టౌన్‌లో నిర్వహించిన సెలబ్రేషన్స్ మాత్రం షాకింగ్‌కు గురిచేసింది. సిద్దిపేట విద్యుత్ సహాయ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్‌లో అధికారులు జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని పాత తెలంగాణ తల్లి ఫొటో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండేళ్లు దాటినా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన విషయం విద్యుత్ అధికారులకు తెలియకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.



