← Back to news

అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్..!

By aravinda nyayapati· 2 Jun 2026
అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్..!

అమెరికాలో అక్రమంగా ఉంటూ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరిజోనా స్టేట్ లో చేపట్టిన ఆపరేషన్ చెక్‌మేట్ లో మొత్తం 52 మంది పట్టుబడగా, వారిలో 36 మంది హెవీ ట్రక్కులు నడుపుతున్నట్లు గుర్తించారు. వీరిలో 30 మంది భారతీయులే. కొందరి వద్ద గడువు ముగిసిన వర్క్ పర్మిట్లు ఉండగా, మరికొందరి వద్ద సరైన లైసెన్సులు కూడా లేవని అధికారులు తెలిపారు. అరెస్టైన వారందరినీ డిపోర్టేషన్ ప్రక్రియకు పంపనున్నట్లు వెల్లడించారు.

More in World